
సింగరాయకొండ ఘటన: ఆధారాలు లేకుండా పాఠశాలపై నిందలు వద్దు
Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

చైనా మాస్టర్స్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ లక్ష్య సేన్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రౌండ్ ఆఫ్ 32లో కెనడాకు చెందిన విక్టోర్ లాయ్ చేతిలో లక్ష్య వరుస గేముల్లో ఓటమి పాలయ్యాడు. ఇంటర్నెట్ డెస్క్: చైనా మాస్టర్స్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ లక్ష్య సేన్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రౌండ్ ఆఫ్ 32లో కెనడాకు చెందిన విక్టోర్ లాయ్ చేతిలో లక్ష్య వరుస గేముల్లో ఓటమి పాలయ్యాడు. 14-21, 7-21 తేడాతో లాయ్ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. ఈ ఓటమితో 2026లో విక్టోర్ లాయ్‌తో లక్ష్య సేన్ హెడ్-టు-హెడ్ రికార్డు 1-3కు పడిపోయింది. ఈ ఏడాది లక్ష్యపై లాయ్‌కు ఇది వరుసగా మూడో విజయం కావడం గమనార్హం. ఇటీవల ఢిల్లీలో జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లోనూ లక్ష్యసేన్‌కు నిరాశే ఎదురైంది. రెండో రౌండ్లో అమెరికాకు చెందిన గారెట్ టాన్ చేతిలో ఓడిపోయాడు. చైనా మాస్టర్స్‌లో తొలుత లక్ష్యసేన్ ఫ్రాన్స్‌కు చెందిన అలెక్స్ లానియర్తో తలపడాల్సి ఉంది. అయితే ఢిల్లీలో టైటిల్ సాధించిన అనంతరం లానియర్ టోర్నీ నుంచి వైదొలగడంతో.. లక్ష్యకు మరోసారి విక్టోర్ లాయ్‌తో తలపడే అవకాశం వచ్చింది. ఈసారి కూడా ఫలితం లక్ష్యకు అనుకూలంగా రాలేదు. ఇదిలా ఉంటే.. మరో భారత స్టార్ కిదాంబి శ్రీకాంత్ మాత్రం చైనా మాస్టర్స్‌లో శుభారంభం చేశాడు. రౌండ్ ఆఫ్ 32లో చైనీస్ తైపీకి చెందిన చి యు-జెన్ను 21-16, 21-15తో వరుస గేముల్లో ఓడించి రౌండ్ ఆఫ్ 16లోకి దూసుకెళ్లాడు. 2023 సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్‌లో శ్రీకాంత్‌ను తొలి రౌండ్లోనే ఓడించిన యు-జెన్‌పై ఈసారి భారత షట్లర్ పైచేయి సాధించాడు. తొలి గేమ్‌లో ఆధిపత్యం ప్రదర్శించిన శ్రీకాంత్.. రెండో గేమ్‌లోనూ ప్రశాంతంగా ఆడి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. ఇక మిక్స్డ్ డబుల్స్‌లో ధ్రువ్ కపిల-తనీషా క్రాస్టో జోడీ అదరగొట్టింది

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత మహిళల జోడీ పుల్లెల గాయత్రి గోపిచంద్- ట్రీసా జాలీ కాంస్య పతకం సాధించింది. శనివారం జరిగిన మహిళల డబుల్స్ సెమీ ఫైనల్స్‌లో ట్రీసా-గాయత్రి జోడీ చైనాకు చెందిన లియు షెంగ్షు, టాన్ నింగ్ చేతిలో 21-18, 13-21, 8-21 తేడాతో ఓటమి పాలైంది. ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత మహిళల జోడీ పుల్లెల గాయత్రి గోపిచంద్- ట్రీసా జాలీ కాంస్య పతకం సాధించింది. శనివారం జరిగిన మహిళల డబుల్స్ సెమీ ఫైనల్స్‌లో ట్రీసా-గాయత్రి జోడీ చైనాకు చెందిన లియు షెంగ్షు, టాన్ నింగ్ చేతిలో 21-18, 13-21, 8-21 తేడాతో ఓటమి పాలైంది. అయితే మహిళల డబుల్స్ విభాగంలో భారత్ చివరిసారిగా 2011లో పతకం సాధించింది. అప్పట్లో జ్వాలా గుత్తా-అశ్విని పొన్నప్ప కూడా కాంస్యం గెలిచారు. మళ్లీ 15 ఏళ్ల తర్వాత అదే విభాగంలో ట్రీసా-గాయత్రి కాంస్యం గెలిచి రికార్డు నెలకొల్పారు. మ్యాచ్‌ను చైనా జోడీ దూకుడుగా ప్రారంభించినా.. భారత షట్లర్లు అద్భుతంగా పుంజుకున్నారు. కీలక సమయాల్లో వరుస పాయింట్లు సాధిస్తూ ఆధిపత్యం ప్రదర్శించిన ట్రీసా-గాయత్రి తొలి గేమ్‌ను 21-18తో సొంతం చేసుకున్నారు. రెండో గేమ్‌లో ఇరు జట్ల మధ్య పోరు నువ్వా-నేనా అన్నట్టుగా సాగింది. స్కోరు 12-12తో సమం కావడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. అయితే ఆ తర్వాత టాన్ నింగ్-లియు షెంగ్షు జోడీ ఒక్కసారిగా గేర్ మార్చింది. వరుస పాయింట్లు సాధిస్తూ భారత జోడీపై ఒత్తిడి పెంచిన చైనా షట్లర్లు రెండో గేమ్‌ను 21-13తో గెలిచారు. దీంతో మ్యాచ్ నిర్ణాయత్మక మూడో గేమ్‌కు వెళ్లింది. మూడో గేమ్‌లో మాత్రం ట్రీసా-గాయత్రి జోడీ పెద్దగా ప్రతిఘటించలేకపోయింది. ఆరంభం నుంచే చైనా జోడీ ఆధిపత్యం కొనసాగించింది. భారత షట్లర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా 21-8తో మూడో గేమ్‌ను ముగించి మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. ప్రపంచ మాజీ బాక్సింగ్ ఛాంపియన్ జొలాని దారుణ హత్య కోహ్లీ కాదు

భారత స్టార్ బ్యాడ్మింటన్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి–చిరాగ్ శెట్టి ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో మరో పతకం సాధించాలన్న ఆశలు క్వార్టర్ ఫైనల్లోనే ముగిశాయి. చైనాకు చెందిన ప్రపంచ నంబర్-3 జోడీ లియాంగ్ వీ కెంగ్–వాంగ్ చాంగ్ చేతిలో భారత జంట వరుస గేముల్లో ఓటమి పాలైంది. ఇంటర్నెట్ డెస్క్: భారత స్టార్ బ్యాడ్మింటన్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి–చిరాగ్ శెట్టి ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో మరో పతకం సాధించాలన్న ఆశలు క్వార్టర్ ఫైనల్లోనే ముగిశాయి. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో చైనాకు చెందిన ప్రపంచ నంబర్-3 జోడీ లియాంగ్ వీ కెంగ్–వాంగ్ చాంగ్ చేతిలో భారత జంట వరుస గేముల్లో ఓటమి పాలైంది. ప్రపంచ నంబర్-5గా ఉన్న సాత్విక్–చిరాగ్ 36 నిమిషాల్లో 18–21, 9–21 తేడాతో పరాజయం చవి చూశారు. మ్యాచ్ ఆరంభం నుంచే ఆశించిన స్థాయిలో పదును చూపలేకపోయిన భారత జోడీ.. రెండో గేమ్‌లో పూర్తిగా వెనుకబడింది. 2022, 2025 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో కాంస్య పతకాలు సాధించిన సాత్విక్–చిరాగ్.. ఈసారి మూడో పతకంపై ఆశలు పెట్టుకున్నారు. అయితే పారిస్ ఒలింపిక్స్ రజత పతక విజేతలైన లియాంగ్–వాంగ్ జోడీ ముందు భారత జంటకు ఎదురుదెబ్బ తగిలింది. కుల్దీప్ యాదవ్‌పై వారికి నమ్మకం లేదు.. అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు ఒక్క మ్యాచ్‌తో కుల్దీప్ సామర్థ్యాన్ని అంచనా వేయొద్దు: స్పిన్ కోచ్ బహుతులే

భారత బ్యాడ్మింటన్ రంగంలో ఒకటిన్నర దశాబ్ద కాలంగా సాగుతున్న నిరీక్షణకు తెరపడింది. యువ క్రీడాకారిణులు గాయత్రి గోపీచంద్ - ట్రీసా జాలీ ద్వయం ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో పతకాన్ని ఖాయం చేసుకుంది. మహిళల డబుల్స్ విభాగంలో సెమీ ఫైనల్స్‌కు చేరుకోవడం ద్వారా వీరు ఈ చారిత్రక ఘనతను సొంతం చేసుకున్నారు.ఉత్కంఠభరితంగా సాగిన క్వార్టర్ ఫైనల్ పోరులో గాయత్రి - ట్రీసా జోడీ, చైనాకు చెందిన జియా యిఫాన్ - జాంగ్ షుక్సియాన్ జంటపై అద్భుత విజయం సాధించింది. తొలి గేమ్‌ను 16-21 తేడాతో కోల్పోయినప్పటికీ, భారత ద్వయం అసాధారణ రీతిలో పుంజుకుంది. ఆ తర్వాత రెండు గేమ్‌లను 21-15, 21-13 స్కోరుతో వరుసగా కైవసం చేసుకుని మ్యాచ్‌ను గెలుచుకుంది. ఈ విజయంతో సెమీస్‌లో అడుగుపెట్టిన భారత జోడీ, కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది.ప్రపంచ ఛాంపియన్షిప్ మహిళల డబుల్స్ విభాగంలో భారత క్రీడాకారిణులు పతకం సాధించడం గత 15 ఏళ్లలో ఇదే తొలిసారి. చివరగా 2011లో గుత్తా జ్వాల - అశ్విని పొన్నప్ప జోడీ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఇటీవలే ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డుకు ఎంపికైన గాయత్రి, ట్రీసాతో కలిసి బరిలోకి దిగి అంచనాలకు తగ్గట్టుగా రాణించింది. ఒకవేళ సెమీ ఫైనల్లోనూ విజయం సాధిస్తే, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరిన తొలి భారత మహిళల డబుల్స్ జోడీగా వీరు సరికొత్త చరిత్ర సృష్టిస్తారు

న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్షిప్ మహిళల సింగిల్స్ ప్రీ-క్వార్టర్స్‌లో భారత స్టార్ షట్లర్ పివి సింధు ఓటమిపాలైంది. చైనాకు చెందిన ప్రపంచ నంబర్ 3 క్రీడాకారిణి వాంగ్ జి యితో జరిగిన హోరాహోరీ పోరులో సింధు నిరాశపరిచింది. సుమారు 90 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో సింధు 11-21, 21-15, 17-21 తేడాతో పరాజయం పాలైంది. వరల్డ్ ఛాంపియన్షిప్ చరిత్రలో చైనా షట్లర్లపై సింధుకు అద్భుతమైన అజేయ రికార్డు ఉండేది. గతంలో చైనా ఆటగాళ్లతో ఎదురైన 8 పోరుల్లోనూ సింధునే విజయం వరించింది. అయితే ఈ మ్యాచ్‌లో ఆ రికార్డు తొలిసారి తారుమారైంది. మ్యాచ్ నిర్ణయాత్మక మూడో గేమ్‌లో ఇరువురు 16-16 పాయింట్లతో సమంగా ఉన్నప్పుడు ఉత్కంఠ తీవ్రస్థాయికి చేరింది. దీంతో వాంగ్ జి యి మస్కుల్ పెయిన్ నెపంతో మెడికల్ టైమ్అవుట్ తీసుకుంది. ఇదిలా ఉండగా ఆ సుదీర్ఘ విరామం తర్వాత సింధు మైదానంలో తన ఏకాగ్రతను కోల్పోయింది. ఫలితంగా సింధు వరుసగా అనవసర తప్పిదాలు చేసి పాయింట్లను ప్రత్యర్థికి సమర్పించుకుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ ముగిసిన అనంతరం సింధు స్పందిస్తూ, ప్రత్యర్థి తీసుకున్న ఆ మెడికల్ టైమ్అవుట్ మైండ్ గేమ్‌లో భాగంగా వ్యూహాత్మకంగా చేసిందా అనే సందేహాన్ని వ్యక్తపరిచింది. ఈ పరాజయంతో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఆరో పతకాన్ని ముద్దాడాలన్న సింధు కల నెరవేరలేదు. మరోవైపు మహిళల సింగిల్స్ విభాగంలో భారత్ తరఫున పోరాటం పూర్తిగా ముగిసింది. అయితే డబుల్స్ విభాగంలో భారత్‌కు పతక ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. పురుషుల డబుల్స్‌లో సాత్విక్-చిరాగ్ జంట, మహిళల డబుల్స్‌లో ట్రీసా-గాయత్రి జోడీలు క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుని ముందంజ వేశాయి

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత యువ షట్లర్లు ట్రీసా జాలీ-గాయత్రి గోపిచంద్ సంచలనం సృష్టించారు. రౌండ్ ఆఫ్ 16లో జపాన్ జంటపై వరుస గేమ్‌ల్లో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లారు. ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత యువ షట్లర్లు ట్రీసా జాలీ-గాయత్రి గోపిచంద్ సంచలనం సృష్టించారు. గురువారం జరిగిన మహిళల డబుల్స్ రౌండ్ ఆఫ్ 16లో జపాన్ జంట రెన్ ఇవానగా- కీ నకనిషిపై 21-16, 21-12 తేడాతో వరుస గేమ్‌ల్లో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లారు. దీంతో భారత జోడీ పతకానికి మరింత చేరువైంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 39వ స్థానంలో ఉన్న గాయత్రి-ట్రీసా జోడీ ఆరంభం నుంచే దూకుడుగా ఆడారు. ట్రీసా తన పవర్ఫుల్ జంప్ స్మాష్‌లతో ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కరి చేయగా.. గాయత్రి ఫ్రంట్ కోర్టులో అద్భుతంగా ఆడి పాయింట్లను సెట్ చేసింది. వీరిద్దరి కోర్టు రొటేషన్స్ కూడా ప్రత్యర్థి జోడీకి ఇబ్బందులు కలిగించాయి. మ్యాచ్ మధ్యలో లైన్ కాల్స్ విషయంలో అంపైర్‌తో భారత ఆటగాళ్లకు స్వల్ప వాగ్వాదం జరిగింది. షటిల్‌ను ఉద్దేశపూర్వకంగా కొట్టినందుకు ట్రీసాకు ఎల్లో కార్డు కూడా లభించింది. అయితే కోచ్ పుల్లెల గోపీచంద్ సూచనలతో గాయత్రి–ట్రీసా ప్రశాంతంగా వ్యవహరించి మ్యాచ్‌పై దృష్టి పెట్టారు. క్వార్టర్ ఫైనల్లో భారత జోడీ చైనాకు చెందిన ప్రపంచ నంబర్ 4 జియా యి ఫాన్–జాంగ్ షు షియాన్‌తో తలపడనుంది. ఇప్పటివరకు ఈ చైనా జోడీతో గాయత్రి–ట్రీసా మూడు సార్లు తలపడగా.. ఒక్కసారి కూడా గెలుపు రుచి చూడకపోవడం గమనార్హం. అయితే ప్రస్తుత ఫామ్‌ను కొనసాగించి విజయం సాధిస్తే భారత జోడీ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పతకం ఖాయం చేసుకుంటుంది. దాంతోపాటు చైనాతో ఓటముల పరంపరకు కూడా తెర పడినట్లు అవుతుంది. భారత మహిళల డబుల్స్‌లో ప్రపంచ ఛాంపియన్షిప్ పతకం సాధించిన చివరి జోడీ జ్వాలా గుత్తా-అశ్విని పొన్నప్ప. 2011లో వారు ఈ ఘనత సాధించారు. గాయత్రి-ట్రీసా క్వార్టర్ ఫైనల్లో

న్యూఢిల్లీలో జరుగుతున్న ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. స్టార్ షట్లర్ పీవీ సింధు, యువ సంచలనం ఆయుష్ శెట్టి ప్రీక్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లగా, మేటి ఆటగాడు లక్ష్యసేన్ అనూహ్య ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించాడు.మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో పీవీ సింధు అద్భుత ప్రదర్శన కనబరిచింది. కెనడాకు చెందిన వెన్ యు జాంగ్‌ను 21-16, 21-17 తేడాతో కేవలం 35 నిమిషాల్లోనే ఓడించి విజయం సాధించింది. తొలి గేమ్‌లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన సింధు, రెండో గేమ్‌లో ఒక దశలో 9-12తో వెనుకబడినప్పటికీ.. వెంటనే పుంజుకుని మ్యాచ్‌ను కైవసం చేసుకుంది.అయితే, పురుషుల సింగిల్స్‌లో భారత శిబిరానికి నిరాశ ఎదురైంది. అమెరికా ఆటగాడు గారెట్ టాన్తో జరిగిన హోరాహోరీ పోరులో లక్ష్యసేన్ 21-19, 19-21, 17-21 తేడాతో ఓటమి పాలయ్యాడు. గంటా 13 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్ గెలిచినప్పటికీ, లక్ష్యసేన్ ఆ తర్వాత అదే జోరును కొనసాగించలేకపోయాడు.మరోవైపు, యువ ఆటగాడు ఆయుష్ శెట్టి తన విజయయాత్రను కొనసాగిస్తున్నాడు. శ్రీలంక ఆటగాడు దుమిందు అబేవిక్రమను 21-8, 21-10 తేడాతో కేవలం 26 నిమిషాల్లోనే చిత్తుచేసి రౌండ్ ఆఫ్ 16లోకి ప్రవేశించాడు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడీకి వాకోవర్ లభించగా, మిక్స్డ్ డబుల్స్‌లో తనీషా క్రాస్టో-ధ్రువ్ కపిల జోడీ మూడో రౌండ్‌కు చేరుకుంది. ఇక మహిళల సింగిల్స్‌లో ఉన్నతి హుడా ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించింది

ప్రపంచ చాంపియన్‌షి్‌పలో ఆరో పతకం అందుకోవాలని ఆరాటపడుతోన్న భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఆ దిశగా మరింత ముందంజ వేసింది. సింధుతో పాటు పురుషుల యువ సంచలనం ఆయుష్ శెట్టి సింగిల్స్‌లో... సాత్విక్ జోడీకి వాకోవర్ జూలక్ష్యసేన్, ఉన్నతి అవుట్ తండ్రైన ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ గ్లెన్ మాక్స్వెల్ కోహ్లీ సలహాలు నా జీవితాన్నే మార్చేశాయి: ఇంగ్లండ్ క్రికెటర్

స్వదేశంలో జరుగుతున్న BWF వరల్డ్ ఛాంపియన్షిప్ 2026 నుంచి భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ అనూహ్యంగా నిష్క్రమించాడు. పురుషుల సింగిల్స్ రౌండ్ ఆఫ్ 32లో అమెరికాకు చెందిన గారెట్ టాన్ చేతిలో 21-19, 19-21, 17-21తో ఓటమి చవిచూశాడు. తొలి గేమ్‌ను గెలుచుకున్న లక్ష్య.. రెండో గేమ్‌లో ఆధిపత్యం కొనసాగించలేకపోయాడు. టాన్ పుంజుకుని రెండో గేమ్‌ను గెలుచుకోవడంతో మ్యాచ్ నిర్ణాయక మూడో గేమ్‌కు వెళ్లింది. పోరాడినా ఫలితం దక్కలేదు మూడో గేమ్‌లో టాన్ ప్రారంభం నుంచే దూకుడుగా ఆడాడు. ఒక దశలో 11-4 ఆధిక్యంలోకి వెళ్లాడు. అయితే లక్ష్యసేన్ అద్భుతంగా పుంజుకుని వరుస పాయింట్లు సాధించాడు. స్కోరు 17-16కు చేరడంతో మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారింది. కీలక సమయంలో టాన్ ఒత్తిడిని జయించి వరుస పాయింట్లు సాధించాడు. దీంతో 21-17తో మూడో గేమ్‌ను, మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ ఓటమితో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో లక్ష్యసేన్ ప్రయాణం ముగిసింది. ఆయుష్ శెట్టి సంచలనం మరోవైపు భారత యువ షట్లర్ ఆయుష్ శెట్టి ఈ టోర్నీలో ఇప్పటికే సంచలన విజయం నమోదు చేశాడు. 21 ఏళ్ల ఆయుష్ పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్ వన్, చైనా స్టార్ షి యూకీని ఓడించి సంచలనం సృష్టించాడు. ఇవాళే జరుగబోయే రెండో రౌండ్లో ఆయుష్ బరిలోకి దిగనున్నాడు. సింధుపై ఆశలు భారత స్టార్ పీవి సింధు కూడా ఇవాళే తన రెండో రౌండ్ మ్యాచ్‌లో బరిలోకి దిగనుంది. లక్ష్యసేన్ అనూహ్య నిష్క్రమణతో నిరాశ చెందిన భారత అభిమానులకు ఇప్పుడు సింధు, ఆయుష్ శెట్టి ప్రదర్శనలపై ఆశలు పెట్టుకున్నారు. సాంప్రదాయ దుస్తులులో మెరిసిన ముద్దుగుమ్మ అదా శర్మ..(ఫోటోలు) కేబీఆర్ ట్రాఫిక్ ‘ట్రాప్’.. ఎటు వెళ్లాలో తెలియక జనం పరేషాన్!(చిత్రాలు) చీరకట్టులో మంత్రముగ్ధం చేస్తున్న శ్రీలీల అందం ...(ఫొటోలు) అదితి రావు స్టన్నింగ్ లుక్స్.. సిద్ధార్థ్‌తో స్పెషల్ మూమెంట్స్! (ఫొటోలు) భారత్ తన కొడుకు ప్రాణాలు కాపాడటంతో పాకిస్థానీ తల్లి భావోద్వేగ సందేశం చిరు

బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత మహిళల డబుల్స్ జోడీ త్రీసా జాలీ–గాయత్రీ గోపిచంద్ సంచలన విజయం సాధించింది. మంగళవారం జరిగిన రెండో రౌండ్లో 16వ సీడ్ అమెరికా జోడీ లారెన్ లామ్–అల్లిసన్ క్విన్ లీని వరుస గేముల్లో ఓడించి ప్రీ-క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించింది. త్రీసా-గాయత్రీ జోడీ కేవలం 38 నిమిషాల్లో 21-15, 21-12 తేడాతో అమెరికా జోడీని చిత్తు చేసింది. ఆరంభం నుంచే త్రీసా–గాయత్రీ దూకుడైన ఆటతో ప్రత్యర్థులపై ఒత్తిడి పెంచారు. త్రీసా పవర్ఫుల్ స్మాష్‌లతో పాయింట్లు సాధించగా.. గాయత్రీ ర్యాలీలను కొనసాగిస్తూ చక్కటి డ్రాప్ షాట్లతో ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టింది. దీంతో తొలి గేమ్‌ను 21-15తో సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లోనూ భారత జోడీ అదే దూకుడును కొనసాగించింది. విరామ సమయానికి 11-4 ఆధిక్యం సాధించింది. ప్రత్యర్థుల అనవసర తప్పిదాలను కూడా సద్వినియోగం చేసుకున్న త్రీసా–గాయత్రీ.. వేగవంతమైన కదలికలు, అద్భుతమైన లైన్ జడ్జ్‌మెంట్‌తో మ్యాచ్‌ను 21-12తో ముగించింది. కవిప్రియ–సిమ్రన్‌కు నిరాశ మరో భారత మహిళల డబుల్స్ జోడీ కవిప్రియ సెల్వం–సిమ్రన్ సింఘి మాత్రం రెండో రౌండ్లోనే నిష్క్రమించింది. 9వ సీడ్ బల్గేరియా జోడీ గాబ్రియేలా స్టోయేవా–స్టెఫానీ స్టోయేవా చేతిలో 7-21, 14-21తో ఓటమిపాలైంది. కేవలం 32 నిమిషాల్లోనే ఈ మ్యాచ్ ముగిసింది. మిక్స్డ్ డబుల్స్‌లో భారత్‌కు నిరాశ మిక్స్డ్ డబుల్స్‌లో భారత జోడీలకు శుభారంభం దక్కలేదు. రోహన్ కపూర్–రుత్విక శివాని గద్దె జోడీ కెనడాకు చెందిన జొనాథన్ బింగ్ త్సాన్ లై–క్రిస్టల్ లై చేతిలో 22-20, 19-21, 17-21తో పోరాడి ఓడింది. మరో జోడీ అశిత్ సూర్య–అమృత ప్రముతేష్ కూడా టర్కీకి చెందిన ఎమ్రే సోన్మెజ్–యాసెమెన్ బెక్టాస్ జోడీ చేతిలో తీవ్ర పోరాటం తర్వాత 21-16, 29-30, 22-24తో పరాజయం పాలైంది. అయితే 15వ సీడ్ భారత జోడీ ధ్రువ్ కపిల–తనీషా క్రాస్టో ఇంకా పోటీలో ఉంది. తొలి రౌండ్లో బై లభించడంతో.. రెండో రౌండ్లో మకావుకు చెందిన ఐక్ చోంగ్ లియోంగ్–వెంగ్ చి

కేంద్ర ప్రభుత్వం 2025 సంవత్సరానికి గాను జాతీయ క్రీడా పురస్కారాలను మంగళవారం ప్రకటించింది. భారత బ్యాడ్మింటన్ దిగ్గజం, కోచ్ పుల్లెల గోపీచంద్ కుమార్తె గాయత్రిని ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డు వరించింది. మహిళల డబుల్స్‌లో తన భాగస్వామి ట్రీసా జాలీతో కలిసి పుల్లెల గాయత్రి ఈ పురస్కారానికి ఎంపికైంది. వీరితో పాటు డెకాథ్లాన్ అథ్లెట్ తేజస్విన్ శంకర్, చెస్ ప్రపంచకప్ విజేత దివ్య దేశ్‌ముఖ్ సహా మొత్తం 17 మంది క్రీడాకారులకు అర్జున అవార్డులను ప్రకటించారు. అయితే, ఈ ఏడాది దేశ అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డును ఎవరికీ ప్రకటించకపోవడం గమనార్హం.సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ (రిటైర్డ్) అరుణ్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ సిఫార్సుల మేరకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఈ అవార్డుల జాబితాను విడుదల చేసింది. గత నాలుగేళ్లుగా నిలకడగా రాణిస్తూ, క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించిన వారికి అర్జున అవార్డును ప్రదానం చేస్తారు. కామన్వెల్త్ క్రీడల్లో డెకాథ్లాన్‌లో పతకం గెలిచిన తొలి భారతీయ అథ్లెట్‌గా తేజస్విన్ శంకర్ చరిత్ర సృష్టించగా, ఫిడే మహిళల ప్రపంచ కప్ గెలుచుకుని దివ్య దేశ్‌ముఖ్ సంచలనం రేపారు. హాకీ క్రీడాకారుడు హార్దిక్ సింగ్ పేరు ఖేల్ రత్న కోసం పరిశీలనకు వచ్చినప్పటికీ, అతను పోటీ నుంచి తప్పుకోవడంతో ఈసారి ఎవరికీ ఈ పురస్కారం దక్కలేదని తెలిసింది.సీనియర్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు అరుమై నాయగంను అర్జున అవార్డు (జీవన సాఫల్యం) వరించింది. 1962 జకార్తా ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచిన భారత జట్టులో ఆయన సభ్యుడు

బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు చెందిన యువ ప్లేయర్ ఆయుష్ శెట్టి సరికొత్త చరిత్ర సృష్టించాడు. న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన పురుషుల సింగిల్స్ మొదటి రౌండ్లో ప్రపంచ నంబర్ 1, డిఫెండింగ్ ఛాంపియన్ అయిన చైనా స్టార్ షి యుకీని ఆయుష్ శెట్టి చిత్తు చేశాడు. తొలిసారి వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో ఆడుతున్న 21 ఏళ్ల ఆయుష్, 21-14, 13-21, 21-19 తేడాతో విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. గత ఏప్రిల్‌లో జరిగిన బ్యాడ్మింటన్ ఆసియా ఛాంపియన్షిప్ ఫైనల్లో షి యుకీ చేతిలో ఆయుష్ ఓడిపోయాడు. ఇప్పటివరకు అతడిపై వరుసగా మూడు సార్లు ఓడిపోయిన ఆయుష్, ఈసారి మాత్రం దెబ్బకు దెబ్బ తీశాడు. సొంతగడ్డపై ప్రేక్షకుల సపోర్టుతో ఆయుష్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్ తర్వాత ఆయుష్ మాట్లాడుతూ.. అభిమానులు ఇచ్చిన ఎనర్జీతోనే తానూ ఈ విజయం సాధించానని, హోమ్ క్రౌడ్ నిరంతరం తనకు సపోర్ట్ చేసిందని చెప్పాడు. మ్యాచ్ ప్రారంభం నుంచే ఆయుష్ చాలా అగ్రెసివ్‌గా ఆడాడు. తన పవర్ఫుల్ అటాకింగ్ షాట్లు, నెట్ గేమ్‌తో షి యుకీపై ఒత్తిడి పెంచి తొలి గేమ్‌ను 21-14తో సొంతం చేసుకున్నాడు. అయితే రెండో గేమ్‌లో షి యుకీ పుంజుకున్నాడు. ఆయుష్ చేసిన కొన్ని క్రాస్ కోర్ట్ మిస్టేక్స్ వల్ల యుకీ 21-13తో రెండో గేమ్‌ను గెలిచి మ్యాచ్‌ను సమం చేశాడు. ఇక నిర్ణయాత్మక మూడో గేమ్‌లో ఆయుష్ 11-5 తో మంచి ఆధిక్యంలోకి వెళ్లాడు. కానీ ఆ తర్వాత షి యుకీ వేగంగా పాయింట్లు సాధిస్తూ గట్టి పోటీ ఇచ్చాడు. చివరి నిమిషంలో మ్యాచ్ చాలా టెన్షన్ టెన్షన్‌గా మారింది. "చివర్లో అతడు పాయింట్లు సాధిస్తున్నప్పుడు నిజంగా చాలా నర్వస్‌గా అనిపించింది. కానీ ఎలాగోలా మ్యాచ్‌ను ముగించి గెలిచాను. గెలిచాక పెద్ద ఉపశమనం లభించింది" అని ఆయుష్ వెల్లడించాడు. 73 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో ఆయుష్ 21-19తో

ప్రతిష్ఠాత్మక వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షి్‌పలో తొలిరోజే భారత కుర్రాడు సంచలనం సృష్టించాడు. యువ షట్లర్ ఆయుష్ శెట్టి తన కెరీర్లోనే అతిపెద్ద విజయాన్ని నమోదు చేస్తూ.. ప్రపంచ నెంబర్ వన్... వరల్డ్ నెం.1 షి యుకిపై ఆయుష్ సంచలన విజయం ప్రతిష్ఠాత్మక వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షి్‌పలో తొలిరోజే భారత కుర్రాడు సంచలనం సృష్టించాడు. యువ షట్లర్ ఆయుష్ శెట్టి తన కెరీర్లోనే అతిపెద్ద విజయాన్ని నమోదు చేస్తూ.. ప్రపంచ నెంబర్ వన్, డిఫెండింగ్ చాంపియన్ షి యుకికి షాకిచ్చాడు. మూడు గేమ్‌ల హోరాహోరీ సమరంలో చైనా స్టార్‌ను మట్టి కరిపించి గ్రాండ్‌గా రెండోరౌండ్‌కు దూసుకెళ్లాడు. ఆదినుంచే జోరు: సొంతగడ్డపై అభిమానుల హర్షధ్వానాలతో విజృంభించిన ఆయుష్.. 30 ఏళ్ల షి యుకితో మ్యాచ్ మొదటి గేమ్‌లో 11-5 ఆధిక్యంలోకి దూసుకుపోయాడు. అదే ఊపులో గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. అయితే రెండో గేమ్‌లో పుంజుకున్న షి యుకి..సుదీర్ఘ ర్యాలీలతో ఆయు్షను అలిసిపోయేలా చేసి గేమ్‌ను దక్కించుకున్నాడు. నిర్ణాయక గేమ్‌లో.. తెలివిగా ఆడిన ఆయుష్ ప్రత్యర్థి తప్పులను సద్వినియోగం చేసుకొని గేమ్‌ను మ్యాచ్‌ను చేజిక్కించుకున్నాడు. తద్వారా తన కెరీర్లో మరో చిరస్మరణీయ విజయం అందుకున్నాడు. కర్ణాటకకు చెందిన ఆయుష్ ఈఏడాది ఆసియా చాంపియన్‌షి్‌పలో లీ షి ఫెంగ్, జొనాథన్ క్రిస్టీ, విదిత్‌సర్న్ వంటి హేమాహేమీలను చిత్తుచేసి రజత పతకం కైవసం చేసుకోవడం విశేషం

భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో శుభారంభం చేసింది. మహిళల సింగిల్స్ రౌండ్ ఆఫ్ 64లో ఐర్లాండ్‌కు చెందిన సోఫియా నోబెల్‌పై సింధు 21-7, 21-11 తేడాతో సునాయస విజయం సాధించింది. ఇంటర్నెట్ డెస్క్: భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో శుభారంభం చేసింది. ఢిల్లీ వేదికగా నేడు మొదలైన బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో మహిళల సింగిల్స్ రౌండ్ ఆఫ్ 64లో ఐర్లాండ్‌కు చెందిన సోఫియా నోబెల్‌పై సింధు 21-7, 21-11 తేడాతో సునాయస విజయం సాధించింది. కేవలం 28 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించి తదుపరి రౌండ్‌కు దూసుకెళ్లింది. ప్రపంచ 9వ ర్యాంకర్‌గా బరిలోకి దిగిన సింధు.. 21 ఏళ్ల సోఫియా నోబెల్‌తో తొలిసారి తలపడింది. మ్యాచ్ ఆరంభం నుంచే సింధు దూకుడుగా ఆడింది. వరుస పాయింట్లు సాధిస్తూ ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచింది. దీంతో తొలి గేమ్‌లో నోబెల్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వని సింధు.. 21-7తో గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్‌ను కూడా సింధు నాలుగు పాయింట్ల ఆధిక్యంతో ప్రారంభించింది. అయితే నోబెల్ పుంజుకునే ప్రయత్నం చేసింది. వేగాన్ని మార్చి వరుసగా పాయింట్లు సాధించడంతో కొంతసేపు పోటీ హోరాహోరీగా సాగింది. అయినప్పటికీ కీలక దశలో సింధు తన అనుభవాన్ని చూపించింది. వరుసగా ఏడు పాయింట్లు సాధించి మ్యాచ్‌పై పూర్తి పట్టు సాధించింది. చివరకు 21-11తో రెండో గేమ్‌ను కూడా గెలుచుకుని మ్యాచ్‌ను 2-0తో ముగించింది. దీంతో మహిళల సింగిల్స్ రౌండ్ ఆఫ్ 64ను విజయంతో అధిగమించింది. మహిళల డబుల్స్‌లో గాయత్రి గోపీచంద్-ట్రీసా జాలీ జంట తొలి రౌండ్లో విజయం సాధించి రౌండ్ ఆఫ్ 32కు దూసుకెళ్లింది. ఈ జోడీ వరుస గేమ్‌ల్లో 21-9, 21-13 తేడాతో స్పెయిన్‌కు చెందిన పౌలా-లూసియా జంటను చిత్తు చేసింది. పురుషుల డబుల్స్‌లో ఎంఆర్ అర్జున్- హరిహరన్ జంట కూడా తదుపరి రౌండ్‌కు అర్హత సాధించింది. టెస్టుల్లో అరుదైన ఘనత

ఢిల్లీ వేదికగా ప్రతిష్టాత్మక బిడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్షిప్ 2026 నేడు ఘనంగా ప్రారంభమైంది. ఉదయం 9 గంటల నుంచే కోర్టుల్లో షట్లర్ల మధ్య హోరాహోరీ పోరు మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ శ్రేణి క్రీడాకారులు ఈ మెగా టోర్నీలో పాల్గొని తమ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. భారత గడ్డపై జరుగుతున్న ఈ పోటీల్లో పతకాలే లక్ష్యంగా ఆతిథ్య జట్టు బరిలోకి దిగుతోంది. దాదాపు 17 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మన దేశంలో ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ జరుగుతుండటం విశేషం. గతంలో భారత్ ఈ టోర్నీకి ఆతిథ్యం ఇచ్చిన అనుభవం ఉన్నప్పటికీ, ప్రస్తుత క్రీడాకారుల జోష్ భిన్నంగా ఉంది. స్వదేశీ అభిమానుల మద్దతు భారత షట్లర్లకు అదనపు బలాన్ని ఇస్తుందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ టోర్నీలో నిలకడ ప్రదర్శించడం ద్వారా భారత్ చరిత్ర సృష్టించాలని క్రీడాభిమానులు కోరుకుంటున్నారు. భారత మహిళల సింగిల్స్ స్టార్ పీవీ సింధు తన తొలి రౌండ్లో ఐర్లాండ్‌కు చెందిన సోఫియా నోబెల్‌తో తలపడనుంది. దీంతో సింధు తన ఆధిపత్యాన్ని ప్రదర్శించి తదుపరి రౌండ్లకు సునాయాసంగా చేరుకోవాలని చూస్తోంది. మరోవైపు ప్రిక్వార్టర్స్‌లో చైనా స్టార్ వాంగ్ జి యీతో సింధుకు కఠినమైన పరీక్ష ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ కీలక పోరులో గెలిస్తేనే సింధు పతక రేసులో నిలిచే అవకాశాలు మెరుగుపడతాయి. పురుషుల సింగిల్స్‌లో యువ కెరటం లక్ష్య సేన్ దేశం తరఫున ప్రధాన పతక ఆశగా బరిలోకి దిగుతున్నాడు. ఫామ్ పరంగా మంచి ఊపుమీదున్న లక్ష్య, ప్రపంచ స్థాయి ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు పూర్తి సిద్ధంగా ఉన్నాడు. ఫలితంగా భారత అభిమానులు అతని నుంచి కచ్చితంగా పతకం వస్తుందని భారీ ఆశలు పెట్టుకున్నారు. కఠిన డ్రా ఉన్నప్పటికీ, తన వ్యూహాలతో ప్రత్యర్థులను చిత్తు చేస్తాడని కోచింగ్ టీమ్ నమ్ముతోంది. ఈ నేపథ్యంలో టోర్నీ రాబోయే రోజుల్లో మరిన్ని ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లకు వేదిక కానుంది. టాప్ షట్లర్ల రాకతో ఢిల్లీలోని స్టేడియం

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియం ప్రతిష్టాత్మక వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌కు వేదిక కానుంది. అయితే ఈ మైదానానికి చుట్టు పక్కల కోతుల బెడద ఎక్కువగా ఉంది. ఈ ఏడాది ఆరంభంలో ఇదే వేదికలో జరిగిన ఇండియా ఓపెన్‌లోనూ కోతుల వీరంగంతో అభిమానులు, నిర్వాహకులు చాలా ఇబ్బంది పడ్డారు. ప్రేక్షకుల గ్యాలరీల్లోకి కూడా కోతులు దూసుకురావడంతో పలు విమర్శలు వచ్చాయి. ఈసారి ప్రతిష్టాత్మక వరల్డ్ చాంపియన్‌షిప్ జరుగుతుండడంతో, మునుపటి పరిస్థితులు ఎదురుకావొద్దని నిర్వాహకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పరిస్థితులు చక్కదిద్దే ప్రయత్నంలో నిర్వాహకులు కొత్తగా వింత పద్ధతిని అనుసరించబోతున్నారు. కోతులను భయపెట్టి వాటిని తరిమేసేందుకు కొండముచ్చు శబ్దాలను ఆశ్రయిస్తున్నారు. అయితే ఇవి అసలైనవి కాదు. కొండముచ్చు తరహాలు అరుస్తూ, ఈలలు వేస్తూ హడావిడి చేసేందుకు ముగ్గురు మనుషులను ప్రత్యేకంగా నియమించారు. తాము చేసే శబ్దాల వల్ల కోతులు పారిపోతాయని, గతంలోనూ ఢిల్లీలోని పలు కీలక ప్రభుత్వ కార్యాలయాల్లో ఇలాగే చేశామని వారు చెబుతున్నారు. దీంతో కోతులను బెదరగొట్టేందుకు వీరిని ప్రత్యేకంగా నియమించినట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఇక తాజా పరిణామంపై భారత స్టార్ షట్లర్ పీవీ సింధు స్పందించింది. "వీళ్లు చేస్తుంది చూస్తుంటే నవ్వు రావచ్చు. మన పరిష్కార మార్గాలు వింతగా అనిపించవచ్చు. కానీ టోర్నీని సమర్థంగా నిర్వహించేందుకు తెర వెనక కూడా ఇలాంటి ఎంతో మంది పని చేస్తున్నారు. వీరి శ్రమకు హ్యాట్సాఫ్" అని సింధు వ్యాఖ్యానించింది. కాగా ఢిల్లీ వేదికగా ఆగస్టు 17 నుంచి 23 వరకు వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ జరగనుంది. చదవండి: రషీద్ మెరుపులు.. వన్డే ప్రపంచకప్‌కు అఫ్గానిస్తాన్ అర్హత ‘పళ్ళ బురుసు’ ప్రీ-రిలీజ్ ప్రెస్ మీట్..ముఖ్య అతిథిగా నాగార్జున (ఫొటోలు) హైదరాబాద్ గచ్చిబౌలి లో సందడి చేసిన టాలీవుడ్ ముద్దుగుమ్మ మానస చౌదరి (ఫొటోలు) ఎల్లో శారీలో హీరోయిన్ రీతూ వర్మ గ్లామర్.. ఫోటోలు రోజుకు 3 గంటల క్లాసులు.. ఏడాదికి రూ.9 లక్షల ఫీజు.. అమెరికా ప్రీస్కూల్ వీడియో

భారత యువ షట్లర్ అస్మిత చాలిహా అద్భుత ప్రదర్శన చేసింది. కొరియా మాస్టర్స్ 300 టోర్నీ ఫైనల్లో చైనా క్రీడాకారిణి హాన్‌ను చిత్తుగా ఓడించి.. టైటిల్ కైవసం చేసుకుంది. స్పోర్ట్స్ డెస్క్: కొరియా మాస్టర్స్ 300 టోర్నీలో భారత యువ షట్లర్ అస్మిత చాలిహా (Ashmitha Chaliha) అద్భుత ప్రదర్శన చేసింది. తన కెరీర్లో తొలిసారి బీడబ్ల్యూఎఫ్ టూర్ టైటిల్‌ను సాధించింది. ఇవాళ(ఆదివారం) ఆసన్ వేదికగా జరిగిన ఈ టోర్నీ మహిళల సింగిల్స్ ఫైనల్లో 14-21, 21-14, 21-14 తేడాతో చైనా క్రీడాకారిణి, 35వ ర్యాంకర్ హాన్‌ను చిత్తుగా ఓడించింది. అస్సాంకు చెందిన ఈ26 ఏళ్ల యువ షట్లర్ తొలి గేమ్‌ను కోల్పోయింది. అయితే మిగతా రెండు గేముల్లో అదరగొట్టి.. అద్భుతం చేసింది. కేవలం గంటలోపే విజయం సాధించి.. టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. అంతకు ముందు సెమీ ఫైనల్లో భారత్‌కే చెందిన రక్షిత రామ్‌రాజ్‌ను ఓడించి అస్మిత ఫైనల్లో ప్రవేశించింది. నిన్న(శనివారం) హోరాహోరీగా జరిగిన సెమీఫైనల్లో అస్మిత 21-13, 16-21, 21-13తో రక్షితపై గెలిచింది. తద్వారా తొలిసారి బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) టూర్ సింగిల్స్ ఫైనల్‌కు చేరింది. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ 300 లేదా అంతకంటే ఎక్కువ సింగిల్స్ టైటిల్ గెలుచుకున్న ఐదవ భారతీయ మహిళగా అస్మిత నిలిచింది. ప్రపంచ 50వ ర్యాంకర్‌గా ఉన్న అస్మిత గౌహతిలోని నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో పార్క్ టే-సాంగ్ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతోంది. జైస్వాల్‌ను మైదానం బయటకు పంపి.. కాపాడిన రహానే! వైభవ్‌పై ఆసీస్ స్టార్ ప్లేయర్ ప్రశంసల జల్లు