
Ayesha Khan : ధురంధర్ ఫేమ్ అయేషా ఖాన్ బర్త్ డే.. సెలబ్రేషన్స్ ఫోటోలు వైరల్..
ధురంధర్ ఫేమ్ అయేషా ఖాన్ (Ayesha Khan) తన బర్త్ డే సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి.

ధురంధర్ ఫేమ్ అయేషా ఖాన్ (Ayesha Khan) తన బర్త్ డే సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి.

Ayesha Khan Engagement Photos: 'ధురంధర్' సినిమాలోని 'షరారత్' పాటతో యువతను విపరీతంగా ఆకట్టుకున్న ప్రముఖ నటి ఆయేషా ఖాన్ వ్యక్తిగత జీవితం ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఆమె సోషల్ మీడియాలో పంచుకున్న కొన్ని కొత్త ఫోటోలు అభిమానుల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. ఆయేషా ఖాన్ ఇటీవల ఒక అపరిచితుడితో కలిసి దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అయితే ఆ వ్యక్తి ముఖాన్ని ఆమె గోప్యంగా ఉంచారు. ఈ చిత్రాలలో ఆమె చేతికి ధరించిన వజ్రపు ఉంగరం స్పష్టంగా కనిపించడంతో, నెటిజన్లు ఆమెకు నిశ్చితార్థం జరిగిపోయిందంటూ జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఈ వైరల్ ఫోటోలపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఇది నిజంగానే రహస్య నిశ్చితార్థం కావచ్చని కొందరు అభిమానులు భావిస్తుండగా, మరికొందరు మాత్రం ఇది ఏదైనా నగల బ్రాండ్ (జ్యూయెలరీ ఫోటోషూట్) ప్రమోషన్లో భాగమై ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. నటి ఆయేషా ఖాన్ కానీ, ఆమె టీమ్ కానీ ఈ వార్తలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. రణవీర్ సింగ్ నటించిన 'ధురంధర్' చిత్రంలోని 'షరారత్' పాటలో ఆయేషా గ్లామరస్ డ్యాన్స్ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. అయితే ఈ పాట షూటింగ్ సమయంలో తాను పడిన ఇబ్బందులను ఇటీవల ఆమె పంచుకున్నారు. నెలసరి సమయంలోనూ షూటింగ్లో పాల్గొనాల్సి రావడంతో శారీరకంగా, మానసికంగా చాలా అలసిపోయి కన్నీళ్లు పెట్టుకున్నానని ఆమె ఓ సందర్భంలో వెల్లడించారు. గమనిక: ఆయేషా ఖాన్ లేదా ఆమె బృందం నుండి స్పష్టత వచ్చే వరకు ఈ నిశ్చితార్థ వార్తలను కేవలం ఊహాగానాలుగానే భావించాలి

అయేషా ఖాన్ (Ayesha Khan) గురించి పరిచయం అక్కర్లేదు. “ధురంధర్” సినిమాలో సూపర్ హిట్ ఐటెం సాంగ్ లో కనిపించి ఒక్కసారిగా వరల్డ్ వైడ్ పాపులరైంది ఈ బ్యూటీ. అందుకే ఆమెకి ఇన్ స్టాగ్రామ్ లో ఒక్కసారిగా ఫాలోయింగ్ పెరిగింది. దాంతో, ఆమెకి ఇన్ స్టా లో ప్రొమోషన్ ల కోసం భారీగా డబ్బులు ముట్టచెప్తున్నాయి బ్రాండ్స్. తాజాగా ఒక బ్రాండ్ కోసం ఒక ఫోటోషూట్ చేసి చేసింది. ఐతే మొదట ఫోటోలు షేర్ చేసినప్పుడు జనం కన్ఫ్యూజ్ అయ్యారు. ఆమె ఎంగేజ్ మెంట్ చేసుకుందేమో అని ఫ్యాన్స్ భావించారు. ఎందుకంటే చేతికి రింగ్ పెట్టుకొని ఒక అబ్బాయిని కౌగిలించుకున్న ఫోటోని షేర్ చేసింది. ఆ అబ్బాయి ఫేస్ కనిపించకుండా ‘ఎంగేజ్డ్” అన్నట్లుగా మెసెజ్ పెట్టింది. దాంతో ఎవరా లక్కీ గై అంటూ అభిమానులు ప్రశ్నలు వేశారు. ఆ తర్వాత మరిన్ని ఫోటోలు అప్లోడ్ చేసి క్లారిటీ ఇచ్చింది. ఒక నగల బ్రాండ్ కోసం చేసిన యాడ్ అది అని అర్థం అయింది. ఆమె నిశ్చితార్థం కాదు. ఆయేషా ఖాన్ తెలుగులో కూడా నటించింది. “ముఖ చిత్రం”, “ఓం భీం బుష్”, “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”, “మనమే” వంటి నాలుగు చిత్రాల్లో నటించింది. ఐతే, “ధురంధర్”లో “శరరత్” పాటతో ఒక్కసారిగా క్రేజ్ తెచ్చుకొంది

ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్‌లో ఆయేషా గిలామనా అలియాస్ శంసో బీబీ (28) అనే టిక్‌టాకర్ హత్యకు గురయ్యారు. ఇస్లామాబాద్ సమీపంలోని టాక్సిలా ప్రాంతంలో తోబుట్టువులతో కలిసి కారులో ప్రయాణిస్తుండగా.. బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమెపై కాల్పులు జరిపారు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. ఇదే ఘటనలో కారు అదుపుతప్పి ప్రమాదానికి గురికావడంతో.. ఆమె సోదరి అసీమాకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయేషాకు టిక్‌టాక్‌లో 13 లక్షలమందికిపైగా ఫాలోవర్లు ఉన్నారు. కాషిఫ్ అనే వ్యక్తి తన కుమార్తెకు ఫోన్ చేసి బయటకు రావాలని కోరాడని.. ఈ క్రమంలోనే ఆమె తన సోదరి, సోదరుడితో కలిసి కారులో వెళ్లారని ఆయేషా తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కౌసర్, జావేద్ అనే ఇద్దరు వ్యక్తులతో ఆమెకు ఆర్థిక వివాదాలు ఉన్నాయని, ఆ ఇద్దరే ఈ హత్య చేయించి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఇందులో కాషిఫ్ పాత్ర కూడా ఉందని ఆరోపించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పాకిస్థాన్‌లో గతేడాది నుంచి మహిళా ఇన్ఫ్లుయెన్సర్ హత్యకు గురికావడం ఇది ఐదోసారి. అంతకుముందు సనా జావెద్, సనా యూసఫ్, మెహక్ శెహజాదీ సైతం వేర్వేరు కాల్పుల ఘటనల్లో ప్రాణాలు కోల్పోయారు. సుమీరా రాజ్‌పుత్ అనే ఇన్ఫ్లుయెన్సర్ను విషమిచ్చి హత్య చేశారనే ఆరోపణలు ఉన్నాయి. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

ఆయేషా ఖాన్ పోస్ట్ చేసిన ఈ ఫొటోలు అభిమానుల్లో క్యూరియాసిటీని పెంచాయి. ఇందులో ఉన్న మిస్టరీ మ్యాన్ ముఖం కనిపించకుండా జాగ్రత్తపడింది. చేతికి మెరుస్తున్న డైమండ్ రింగ్ ఉండటంతో, ఆమె తన వ్యక్తిగత జీవితంలో ఒక పెద్ద అడుగు వేసిందని అందరూ భావిస్తున్నారు. దీనికి తోడు 'ఇదొక కల' అని చిన్న క్యాప్షన్ పెట్టడంతో, ఇది ఎంగేజ్మెంట్ ప్రకటన అయ్యుంటుందని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. అయితే, ఆయేషా మాత్రం ఇప్పటివరకు తన ఎంగేజ్మెంట్ గురించి అధికారికంగా ఏమీ చెప్పలేదు. అయేషా ఖాన్ తెలుగు సినిమాల్లో కూడా నటించింది. 2022లో ఆమె ముఖచిత్రం మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత శ్రీవిష్ణు ఓం భీమ్ బుష్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాల్లో నటించింది. అయేషా ఖాన్ సోషల్ మీడియాలో గుర్తింపు పొందిన క్రేజీ సెలెబ్రిటీ. ధురంధర్ మూవీలో చేసిన స్పెషల్ సాంగ్ తో నేషనల్ వైడ్ పాపులారిటీ సొంతం చేసుకుంది

ఓం భీం బుష్, ముఖచిత్రం, మనమే, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి.. లాంటి పలు సినిమాలలో బోల్డ్ గా నటించి మెప్పించిన బాలీవుడ్ భామ అయేషాఖాన్ తాజాగా నిశ్చితార్థం చేసుకున్నట్టు సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసింది. అయితే ఈ ఫోటోలకు.. ఒక కల. మీకు నచ్చిన సహజ వజ్రపు నిశ్చితార్థపు ఉంగరాన్ని ఇక్కడ వెతుక్కోండి అంటూ ఓ సంస్థ పేరు పెట్టడంతో ఇది ఎంగేజ్మెంట్ రింగ్ ప్రమోషనల్ ప్రకటనా లేక నిజంగానే నిశ్చితార్థం చేసుకుందా అనే డైలమాలో పడేసింది అందర్నీ. బాలీవుడ్ బిగ్ బాస్ తో ఫేమ్ తెచ్చుకున్న అయేషాఖాన్ తెలుగు, బాలీవుడ్ సినిమాలు, బాలీవుడ్ షోలు చేస్తుంది

సీనియర్ నటి షర్మిలా ఠాగూర్ మత మార్పిడి గురించి చాలాకాలంగా జరుగుతున్న ప్రచారంపై ఆమె కుమార్తె సబా పటౌడీ స్పష్టత ఇచ్చారు. తన తల్లి, దివంగత క్రికెటర్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడీని వివాహం చేసుకునే సమయంలో ఇస్లాం మతాన్ని స్వీకరించిన మాట వాస్తవమేనని ఆమె ధ్రువీకరించారు. అయితే, తమ కుటుంబంలో అన్ని మతాలకు సమాన గౌరవం ఇస్తూ, లౌకిక వాతావరణంలో పెరిగామని తెలిపారు.ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సబా పటౌడీ మాట్లాడుతూ "1969లో నాన్నను పెళ్లి చేసుకునేందుకు అమ్మ ఇస్లాం స్వీకరించి, 'ఆయేషా సుల్తానా'గా పేరు మార్చుకున్నారు. అది ఆమె వ్యక్తిగత నిర్ణయం. ఆ తర్వాత ఇంట్లో మతపరమైన కట్టుబాట్లను మాపై ఎప్పుడూ రుద్దలేదు" అని వివరించారు. తమ తండ్రి ఇస్లామిక్ సంప్రదాయాలను పాటిస్తే, తల్లి తన బెంగాలీ హిందూ సంస్కృతిని, పండుగలను కొనసాగించేవారని గుర్తుచేసుకున్నారు."మా ఇంట్లో దీపావళి, ఈద్, దుర్గాపూజ వంటి అన్ని పండుగలను ఒకే గొడుగు కింద ఎంతో సంతోషంగా జరుపుకొనేవాళ్లం. మమ్మల్ని (సైఫ్, సోహా, నేను) అన్ని సంస్కృతులను గౌరవించేలా పెంచారు" అని సబా తెలిపారు. భారత సినీ, క్రీడా రంగాల్లో షర్మిలా-టైగర్ పటౌడీల వివాహం ఒక చారిత్రక అంతర్మత వివాహంగా నిలిచిపోయింది. గతంలో షర్మిలా ఠాగూర్, సైఫ్ అలీ ఖాన్, సోహా అలీ ఖాన్ కూడా తాము లౌకిక భావాలతో పెరిగామని పలు సందర్భాల్లో పేర్కొన్నారు

బుల్లితెరపైనే కాక వెండితెరపైనా తనదైన ముద్ర వేస్తూ హీరోగా రాణిస్తోన్న సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘సుధీర్స్ జోకర్’. ఈ మూవీ నుంచి మురళీ శర్మ లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు. బుల్లితెరపైనే కాక వెండితెరపైనా తనదైన ముద్ర వేస్తూ హీరోగా రాణిస్తోన్న సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘సుధీర్స్ జోకర్’ (Sudheer’s Joker). ఈ సినిమాతో బిగ్ బాస్ ఫేమ్ అయేషా హీరోయిన్గా టాలీవుడ్‌కి పరిచయం కాబోతోంది. గతంలో ‘పరదా’ వంటి విభిన్నమైన చిత్రాన్ని అందించి అందరి ప్రశంసలు అందుకున్న ఆనంద మీడియా బ్యానర్‌పై నిర్మాతలు శ్రీనివాసులు పి.వి., విజయ్ డొంకాడ, శ్రీధర్ మక్కువ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పీఎస్ సునీల్ పుప్పాల దర్శకత్వంలో స్ట్రాంగ్ కంటెంట్, ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్లతో ఒక సరికొత్త కమర్షియల్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రంలో వర్సటైల్ యాక్టర్ మురళీశర్మ (Murali Sharma) ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆదివారం (ఆగస్ట్ 9) ఆయన పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సినిమా నుంచి ఓ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ సినిమాలో ఆయన ‘డిటెక్టివ్ జీవన్’ (Detective Jeevan) అనే ఆసక్తికరమైన పాత్రలో ప్రేక్షకులను అలరించబోతున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలతో తన నటనతో మెప్పించిన మురళీశర్మకు, ఈ డిటెక్టివ్ జీవన్ రోల్ మరో గుర్తుండిపోయే క్యారెక్టర్ కానుందని మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు. తాజాగా విడుదలైన బర్త్ డే పోస్టర్లో ఆయన బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ చూస్తుంటే ఈ పాత్ర ఆయనకు పర్ఫెక్ట్గా సరిపోయినట్లు అనిపిస్తోంది. ఈ సినిమా కథాంశం విషయానికి వస్తే... ఒక రాయల్ ఫ్యామిలీలో జన్మించి రాబరీస్ చేసే హీరో క్రైమ్ కేసులను డీకోడ్ చేయడానికి, డిటెక్టివ్ జీవన్ తన ఇంటెలిజెన్స్, అనుభవంతో ఎలాంటి ప్రయత్నాలు చేశాడనేది ప్రధానాంశంగా సాగనుంది. వీరిద్దరి మధ్య