ఖమేనీ అంత్యక్రియల్లో.. వెక్కివెక్కి ఏడ్చిన ఇరాన్స్పీకర్, విదేశాంగ మంత్రి.. వీడియో వైరల్
Ayatollah Khamenei Funeral Tehran : ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంతిమ వీడ్కోలు కార్యక్రమాలతో రాజధాని టెహ్రాన్ నగరం శోకసంద్రంగా మారింది. యూఎస్-ఇజ్రాయెల్ సంయుక్త సైనిక దాడుల్లో ఆయన మరణించిన సంగతి తెలిసిందే. టెహ్రాన్‌లోని గ్రాండ్ మొసల్లా వేదికగా శుక్రవారం ప్రారంభమైన ఈ సంతాప కార్యక్రమాల్లో ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ గాలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నారు. తమ ప్రియతమ నేత అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోవడాన్ని గుర్తు చేసుకుంటూ.. వెక్కి వెక్కి ఏడ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వందలాది దేశాల అధినేతలు, విదేశీ ప్రముఖులు, దౌత్య ప్రతినిధులు ఖమేనీ భౌతికకాయానికి నివాళులర్పించేందుకు తరలివచ్చారు. ఆ పూర్తి వివరాలు మీకోసం. జూలై 9న అంతిమ సంస్కారాలు..ప్రస్తుతం టెహ్రాన్ గ్రాండ్ మొసల్లాలో ఉంచిన ఖమేనీ భౌతికకాయానికి ప్రజలు, ఆ దేశ అధినేతలతో పాటు విదేశాల నుంచి వచ్చిన నేతలు కూడా నివాళులు అర్పిస్తున్నారు. ఈరోజు ఉదయం 6 గంటలకే ప్రార్థనా మందిరం తలుపులు తెరుచుకోగా.. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ గాలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీలు అక్కడకు చేరుకున్నారు. ఈ సందర్భంగానే.. ఖమేనీని చివరి సారి చూసి వెక్కి వెక్కి ఏడ్చారు. వారిని వారు కంట్రోల్ చేసుకోలేక.. వారు ఏడ్చిన తీరు అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా.. శని, ఆది వారాలు ప్రజల సందర్శనార్థం ఖమేనీ పార్థివ దేహాన్ని ఇక్కడే ఉంచనుండగా.. సోమవారం టెహ్రాన్ నగరంలో భారీ ఊరేగింపు నిర్వహించనున్నారు. ఆ తర్వాత ఇరాన్‌లోని పవిత్ర నగరమైన ఖోమ్తో పాటు ఇరాక్‌లోని బాగ్దాద్, కర్బలా, నజాఫ్ నగరాల్లో ప్రత్యేక మతపరమైన ఆచారాలు నిర్వహిస్తారు. చివరగా జూలై 9వ తేదీన మషద్