
భార్య హత్య.. ప్రియురాలికి డెడ్ బాడీ ఫోటో.. 9నెలల తరువాత బిగ్‌ట్విస్ట్.. అమెరికాలో తెలంగాణ టెకీ దారుణం
Telangana Techie Killd Wife : అమెరికాలో నివసిస్తున్న తెలంగాణకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవినాష్ నార్నేపై భార్య రాజిత సబ్బినేని (27) హత్య కేసులో సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. తొమ్మిది నెలల పాటు సాగిన దర్యాప్తు అనంతరం పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి ఫస్ట్-డిగ్రీ మర్డర్ కేసు నమోదు చేశారు. నేరం రుజువైతే అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్ర చట్టాల ప్రకారం యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం ఉంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. తెలంగాణకు చెందిన టెకీ అవినాశ్ నార్నే, రాజిత సుబ్బినేని భార్యాభర్తలు. వారికి గతేడాది ప్రారంభంలోనే వివాహంజరిగింది. అయితే, గతేడాది అక్టోబర్ నెలాఖరున తన భార్య బాత్రూం లోపల తాళం వేసుకుందని, ఎంత పిలిచినా పలకడం లేదని రాత్రి సమయంలో బెల్వ్యూ పోలీసులకు నార్నే ఫోన్ చేశాడు. హుటాుహటీన ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు.. బాత్రూంలోకి బలవంతంగా ప్రవేశించి చూడగా.. రాజిత నేలపై పడిఉంది. వెంటనే ఆమెను పరీక్షించగా అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. రాజిత సుబ్బినేని మృతదేహానికి ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించగా.. గొంతు నులమడం వల్ల ఊపిరాడకపోవడంతో మరణించినట్లు తేలింది. దీంతో ఆమెది హత్యగా నిర్ధారించిన స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తు సమయంలో భర్త అవినాశ్ పై అనుమానం వచ్చినప్పటికీ తప్పుడు వాదనలతో పోలీసులను డైవర్ట్ చేశాడు. అవినాశ్ పోలీసులకు చెప్పిన వివరాల ప్రకారం.. రాజిత చనిపోయిన రోజు తాను ఇంట్లోనే ఉన్నానని.. బయటకు వెళ్లి 40 నిమిషాల తరువాత తిరిగి వచ్చానని నార్నే డిటెక్టివ్ లకు చెప్పాడు. తాను వచ్చేసరికి బాత్రూమ్ లో తాళం వేసి ఉండటాన్ని గమనించి.. పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపాడు. దీంతో ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా.. నార్నే బయటకు వెళ్లినట్లు రికార్డయింది.. అయితే, అతను బయటకు వెళ్లిన తరువాత మరొకరు ఎవరూ ఇంటి లోపలికిరాలేదు. దీంతో అవినాశ్ నార్నే ఏదో దాస్తున్నాడని అక్కడి పోలీసులు గుర్తించారు. నార్నే
