
పై కేంద్రం తీవ్ర ఆగ్రహం! ఏడు రోజుల్లోగా లెక్క తేలాలి
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం 'మెటా' (Meta) సంస్థకు కేంద్ర ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. ఇన్స్టాగ్రామ్ ప్లాట్‌ఫారమ్‌లో చిన్నారులపై లైంగిక దోపిడీని ప్రోత్సహించేలా కొన్ని క్రూరమైన ప్రకటనలు (యాడ్స్) రావడంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పిల్లలపై సాగే లైంగిక అరాచకాలకు (CSAE) సంబంధించిన కంటెంట్‌ను ప్రచారం చేసే ఇలాంటి అసాంఘిక ప్రకటనలు వెలుగులోకి రావడంతో.. కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (MeitY) మెటా సంస్థకు తీవ్ర హెచ్చరికలతో కూడిన నోటీసులు జారీ చేసింది. ఇటువంటి వివాదాస్పద ప్రకటనలను తక్షణమే నిలిపివేయాలని కేంద్రం స్పష్టం చేసింది. శనివారం రాత్రి జారీ చేసిన ఈ నోటీసులో మెటా సంస్థ నుంచి కేంద్ర ప్రభుత్వం తక్షణ వివరణను డిమాండ్ చేసింది. పిల్లల లైంగిక వేధింపులను ప్రోత్సహించే కంటెంట్ లేదా దానికి దారితీసే అకౌంట్లకు సంబంధించిన పెయిడ్ యాడ్స్ అసలు ఇన్‌స్టాగ్రామ్‌లో ఎలా ఆమోదం పొందాయో చెప్పాలని నిలదీసింది. దీనిపై పూర్తి వివరాలతో కూడిన సమగ్ర నివేదికను ఏడు రోజుల్లోగా తమకు సమర్పించాలని ఆదేశించింది. సామాజిక మాధ్యమాల భద్రతా నిబంధనలను మెటా సంస్థ ఏ స్థాయిలో బేఖాతరు చేస్తోందో ఈ ఘటనే నిరూపిస్తోందని ఐటీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు రంగంలోకి దిగి మెటా సంస్థను గట్టిగా ప్రశ్నించారు. చిన్నారుల భద్రతకు సంబంధించిన అత్యంత సున్నితమైన అంశంలో ఇలాంటి ఘోరమైన వైఫల్యాలు ఎలా సంభవించాయనే దానిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రకటనల ఆమోద ప్రక్రియను నిశితంగా పరిశీలించాలని, అటువంటి వివాదాస్పద అడ్వర్టైజ్మెంట్లను యాప్ నుంచి శాశ్వతంగా తొలగించాలని అధికారులను ఆదేశించారు. సాధారణంగా తమ ప్లాట్‌ఫారమ్‌లలో ఇటువంటి కంటెంట్‌ను గుర్తించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఆటోమేటెడ్ సిస్టమ్స్, హ్యూమన్ రివ్యూ వంటి ఎన్నో రక్షణ వ్యవస్థలను వాడుతున్నట్లు మెటా గతంలో గొప్పలు చెప్పుకుంది. అయితే ఈ భద్రతా వలయాలు పూర్తి స్థాయిలో