
సంపద పెంచుకోవాలంటే.. అంకుర్ వారికూ ఆర్ధిక సూత్రాలు
సాధారణంగా ఆదాయం పెరిగే కొద్దీ ఖర్చులు కూడా పెరుగుతుంటాయి. ఖరీదైన వస్తువులు కొనడం, లైఫ్‌స్టైల్ మార్చుకోవడం అనేది చాలామందికి అలవాటే. అయితే.. వ్యాపారవేత్త, రచయిత అంకుర్ వారికూ (Ankur Warikoo) మాత్రం డబ్బును ఖర్చు చేసే విషయంలో కొన్ని నియమాలు పాటిస్తే.. భవిష్యత్తులో మంచి సంపదను కూడబెట్టుకోవచ్చని చెబుతున్నారు. తాను, తన భార్య రుచి కలిసి పాటిస్తున్న ఐదు మనీ రూల్స్‌ను అంకుర్ వారికూ సోషల్ మీడియాలో షేర్ చేశారు. తాము సంపన్న కుటుంబాల నుంచి రాలేదని, తమ జీవితంలో నిజమైన ఆర్థిక స్థిరత్వం గత 6-7 ఏళ్లలోనే వచ్చిందని ఆయన చెప్పారు. ఈ ఐదు అలవాట్లు తమ కుటుంబం డబ్బును చూసే విధానాన్ని మార్చాయని తెలిపారు. మొదటి నియమం - డబ్బున్నవారిలా కనిపించడానికి ఖర్చు చేయకూడదు ఇతరులను ఆకట్టుకోవడానికి ఖరీదైన వస్తువులు కొనడం కంటే.. భవిష్యత్తులో సంపదను పెంచే ఆస్తులపై డబ్బు పెట్టాలని ఆయన చెబుతున్నారు. అందుకే.. తమ డబ్బులో ఎక్కువ భాగాన్ని స్టాక్స్, బంగారం వంటి వాటిలో పెట్టుబడి పెడతామని చెప్పారు. కుటుంబానికి ఒక ఇల్లు మాత్రమే ఉందని, కారు కూడా సొంతంగా కొనకుండా అద్దెకు ఉపయోగిస్తున్నామని తెలిపారు. రెండో నియమం - ముఖ్యమైన విషయాల కోసం ఎక్కువ ఖర్చు చేయడం ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో రాజీ పడకూడదనేది వారి ఆలోచన. నాణ్యమైన ఆహారం కోసం ఎంత ఖర్చైనా పెట్టడానికి సిద్ధంగా ఉంటామని అంకుర్ చెప్పారు. తమ కూరగాయలను సేంద్రీయ పద్ధతిలో పండించే అద్దె పొలం ఉందని, బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేయడం కూడా చాలా తక్కువగా ఉంటుందని తెలిపారు. మూడో నియమం - వస్తువుల కంటే జ్ఞాపకాలను సంపాదించుకోవడం ఖరీదైన వస్తువులు కొనడం కంటే కుటుంబంతో కలిసి ప్రయాణాలు చేయడం, క్రీడా కార్యక్రమాలకు వెళ్లడం, మ్యూజియంలు చూడటం వంటి అనుభవాలకు డబ్బు ఖర్చు చేయడం ఎక్కువ విలువైనదని ఆయన భావిస్తున్నారు. గత ఏడాది తమ కుటుంబం ఏకంగా 116