
సింగరాయకొండ ఘటన: ఆధారాలు లేకుండా పాఠశాలపై నిందలు వద్దు
Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

అయోధ్యలోని రామమందిర పరిపాలన, నిర్వహణ బాధ్యతలను ఇకపై భారత వైమానిక దళ మాజీ అధికారి పర్యవేక్షించనున్నారు. శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ రామ్ మందిర్ మొదటి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రాను నియమించింది. ట్రస్ట్ నిర్వహించిన సమావేశంలో అందరి అంగీకారంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. జితేంద్ర మిశ్రాను 3 సంవత్సరాల ఒప్పంద ప్రాతిపదికన ఈ పోస్టులో నియమించారు. రామ మందిరం సీఈఓగా జితేంద్ర మిశ్రా ఆలయ పరిపాలన, రోజువారీ కార్యకలాపాలను పూర్తిగా పర్యవేక్షిస్తారు. మందిరానికి వచ్చే భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు, వసతుల ఏర్పాటు ఆయన చూసుకుంటారు. అలాగే వివిధ విభాగాల బృందాల మధ్య సమన్వయం సాధించడం, ఆలయ ఆపరేషన్లకు సంబంధించిన పనులను నిర్వహించడం ఆయన బాధ్యతల్లో భాగం. భారత వైమానిక దళంలో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవం ఈ కొత్త బాధ్యతలను సజావుగా నిర్వర్తించడానికి ఆయనకు ఎంతో ఉపయోగపడుతుందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. రామ్ మందిర్ సీఈఓ పదవికి లభించే ఖచ్చితమైన జీతం వివరాలను ట్రస్ట్ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఈ పోస్టు కోసం దరఖాస్తులను ఆహ్వానించిన సమయంలోనే, ఎంపికైన అధికారి వేతనం, ఇతర భత్యాలు పరస్పర ఒప్పందం ప్రకారం నిర్ణయిస్తామని ట్రస్ట్ తెలిపింది. అందువల్ల జితేంద్ర మిశ్రా నెలవారీ జీతం ఎంత అనే విషయమై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. సీఈఓగా బాధ్యతలు చేపట్టిన జితేంద్ర మిశ్రాకు అయోధ్యలో నివసించడానికి అధికారిక నివాస సౌకర్యం లభిస్తుంది. అయోధ్యలోనే ఉంటూ ఆలయ రోజువారీ పనులు, పరిపాలనపై దృష్టి పెట్టడానికి ఈ వసతి సహాయపడుతుంది. అయితే ఆయనకు ఎలాంటి నివాసం కేటాయిస్తారు, దాని వివరాలు ఏంటి అనే విషయాలు ట్రస్ట్ ఇంకా బయటపెట్టలేదు. దీనితో పాటు జితేంద్ర మిశ్రాకు ప్రభుత్వ వాహనం, భద్రతా సిబ్బంది సదుపాయం కూడా ఉంటాయి. ప్రభుత్వ ఉన్నతాధికారికి లభించే విధంగానే ఆయనకు కొన్ని ప్రత్యేక వీఐపీ సౌకర్యాలు లభిస్తాయి. ఈ సౌకర్యాలకయ్యే ఖర్చునంతా రామ్ మందిర్

అయోధ్య రామ మందిరం పరిపాలనకు తొలి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జీతేంద్ర మిశ్రాను నియమించే అవకాశం ఉంది. 5 వేల మందికి పైగా దరఖాస్తుదారుల నుంచి ఆయన్ను ఎంపిక చేసినట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. భారత వైమానిక దళంలో పలు కీలక కమాండ్ బాధ్యతలు నిర్వహించిన జీతేంద్ర మిశ్రా.. ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో వెస్ట్రన్ కమాండ్ చీఫ్‌గా పనిచేశారు.శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ బుధవారం కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ భేటీలో 12 అంశాలపై చర్చించనున్నారు. ఇందులో రామ మందిరానికి తొలి సీఈఓ నియామకం ప్రధాన అంశంగా ఉంది. సీఈఓకు విస్తృత పరిపాలనా అధికారాలు కల్పించేలా ట్రస్ట్ డీడ్‌లో మార్పులు చేయాలని కూడా నిర్ణయించే అవకాశం ఉంది.2020 ఫిబ్రవరి 5న ట్రస్ట్ ఏర్పాటైన తర్వాత డీడ్‌లో మార్పులు చేయడం ఇదే తొలిసారి కానుంది. మందిరంలో విరాళాల అక్రమాల ఆరోపణలు, సమర్పణల నగదు మాయం వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత ట్రస్ట్ నిర్వహిస్తున్న మూడో సమావేశం ఇది. ఈ వ్యవహారం నేపథ్యంలో ట్రస్ట్ మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ రాజీనామా చేశారు.మందిరం పరిపాలనను మరింత ప్రొఫెషనల్‌గా, పారదర్శకంగా నిర్వహించేందుకు పూర్తి స్థాయి సీఈఓ అవసరమని రామ మందిర నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా గతంలో పేర్కొన్నారు. సీఈఓ ప్రభుత్వ జోక్యం లేకుండా పనిచేస్తారని, ట్రస్ట్ ప్రధాన కార్యదర్శికి నివేదిస్తారని సమాచారం.సీఈఓకు చట్టపరమైన, పరిపాలనా, ఆర్థిక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. సంస్థకు అవసరమైన విధానాలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల రెండో రోజున కీలక అంశంపై ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. 25 వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా ఉన్నతీకరించే ప్రతిపాదన ప్రస్తుతానికి ఏదీ లేదని పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. జాతీయ జనాభా గణన (సెన్సస్) ప్రక్రియ పూర్తయ్యే వరకు ఈ విషయంలో ముందుకు వెళ్లలేమని ఆయన వెల్లడించారు.మంగళవారం స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి నారాయణ సమాధానమిచ్చారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జనాభా గణన ప్రక్రియ కొనసాగుతోందని, 2027 మార్చి 31 వరకు ఈ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉందని ఆయన గుర్తుచేశారు.జనగణన పూర్తయ్యే వరకు పరిపాలనా పరమైన సరిహద్దుల్లో ఎలాంటి మార్పులు చేయవద్దని కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని మంత్రి సభకు వివరించారు. అందువల్ల, జనాభా గణన ప్రక్రియ ముగిసిన తర్వాతే అధిక జనాభా గల పంచాయతీలను మున్సిపాలిటీలుగా మార్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని ఆయన పేర్కొన్నారు. దీంతో కొత్త మున్సిపాలిటీల ఏర్పాటుపై మరికొంత కాలం వేచి చూడక తప్పదని స్పష్టమైంది

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్‌ను రాష్ట్ర సర్కార్ కొత్తగా ఏర్పాటు చేసింది. హైదరాబాద్, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్‌ను (TG SAFE) రాష్ట్ర సర్కార్ కొత్తగా ఏర్పాటు చేసింది. ఆహార భద్రత, డ్రగ్స్ కంట్రోల్ విభాగాల విలీనానికి ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఫుడ్ సేఫ్టీ, డ్రగ్స్ కంట్రోల్ విభాగాలు ఇకపై ఏకీకృత పరిపాలన కింద పనిచేయనున్నాయి. ఆహారం, మందులు, కాస్మెటిక్స్‌పై లైసెన్సింగ్, తనిఖీలు, శాంప్లింగ్, పరీక్షలు, ఎన్ఫోర్స్మెంట్ను ప్రభుత్వం మరింత పటిష్ఠం చేయనుంది. TG SAFEలో డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్, ఫుడ్ సేఫ్టీ, ఎన్ఫోర్స్మెంట్, లీగల్ & ప్రాసిక్యూషన్, ల్యాబొరేటరీ, అడ్మినిస్ట్రేటివ్ విభాగాలు పనిచేయనున్నాయి. ఫుడ్ సేఫ్టీ, డ్రగ్స్ టెస్టింగ్ ల్యాబొరేటరీలను ఒకే ల్యాబొరేటరీ విభాగం కిందకు ప్రభుత్వం తీసుకురానుంది. అక్రమాలు, కల్తీపై నిఘా పెంచేందుకు ఇంటెలిజెన్స్, రిస్క్ ఆధారిత తనిఖీలను TG SAFE చేపట్టనుంది. ఎన్ఫోర్స్మెంట్ కోసం TG SAFEకు పోలీసు సిబ్బందిని డీజీపీ కేటాయించనున్నారు. తొలిదశలో క్యూర్ ప్రాంతంలో TG SAFE కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. క్యూర్ ప్రాంతంలో ఆహార వ్యాపారాలు, డ్రగ్స్ సంస్థలు అధికంగా ఉన్నందున ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోంది. ఫుడ్, డ్రగ్స్ నియంత్రణ వ్యవస్థ ఆధునీకరణకు రాష్ట్రస్థాయి కమిటీ ఏర్పాటు చేయనుంది. టెస్టింగ్, ఇంటెలిజెన్స్, డేటా అనాలిసిస్, లీగల్ సపోర్ట్, ల్యాబ్ మౌలిక వసతులపై ఈ కమిటీ దృష్టి సారించనుంది. TG SAFE ఏర్పాటు ద్వారా ప్రజారోగ్యం, వినియోగదారుల భద్రతకు ప్రభుత్వం మరింత ప్రాధాన్యం ఇస్తోంది. ఆగస్టు 15, 2026 నుంచి TG SAFE ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జీవో ఎంఎస్ నంబర్ 67 జారీ చేసింది. టీజీ సేఫ్ కమిషనర్‌గా అవినాశ్

హైదరాబాద్‌లో ట్రాఫిక్‌జామ్‌కు చెక్ పెట్టడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్(హెచ్-సిటీ)లో భాగంగా వంతెనలు, అండర్‌పాస్‌ల నిర్మాణాన్ని వేగవంతం చేసింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పనులు ప్రారంభం అయ్యాయి. నిర్మాణ సంస్థ ఎంపిక.. ఆమోదించిన పురపాలక శాఖ హైదరాబాద్ సిటీ: మహా నగరంలో ట్రాఫిక్‌జామ్‌కు చెక్ పెట్టడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్(హెచ్-సిటీ)లో భాగంగా వంతెనలు, అండర్‌పాస్‌ల నిర్మాణాన్ని వేగవంతం చేసింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పనులు ప్రారంభం అయ్యాయి. మరికొన్ని జంక్షన్ల వద్ద వంతెనల నిర్మాణానికి పాలనాపరమైన అనుమతులు జారీ చేస్తోంది. టెండర్ ప్రక్రియలో భాగంగా ఏజెన్సీల ఎంపికకూ ఆమోదం తెలుపుతోంది. ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన ఓవైసీ ఫ్లై ఓవర్ నుంచి సంతోష్‌నగర్ వైపు వెళ్లేలా ఎడమ వైపు ర్యాంపు, హఫీజ్‌బాబా నగర్ జంక్షన్ నుంచి బాలాపూర్ 100 అడుగుల రోడ్డు వరకు, బండ్లగూడ- ఎర్రకుంట ఎక్స్ రోడ్ వద్ద ఆరు లేన్ల వంతెనల నిర్మాణం కోసం ఏజెన్సీ ఎంపికకు సర్కార్ ఆమోదం తెలుపుతూ బుధవారం పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రూ.242.72 కోట్ల నిర్మాణ వ్యయంతో ఈ వంతెనలు, ర్యాంప్‌ను ఒకే ప్యాకేజీగా చేపట్టనున్నారు. వాస్తవంగా ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ.231.87 కోట్లుగా అంచనా వేయగా.. 4.68 శాతం ఎక్కువకు కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ లిమిటెడ్ బిడ్ దాఖలు చేసింది. రెండు పర్యాయాలు టెండర్ ప్రకటించినా.. సింగిల్ బిడ్ దాఖలు కావడంతో అదే సంస్థను ఎంపిక చేశారు. ఆస్తుల సేకరణతో కలిపి ప్రాజెక్టుకు రూ.385 కోట్లు అవసరమని అంచనా వేయగా సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.పనులు చేపట్టేందుకు ఏజెన్సీతో జీహెచ్ఎంసీ కమిషనర్ ఒప్పందం కుదర్చుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వంతెనలు పూర్తయితే పాతబస్తీలో పలు ప్రాంతాల నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి రాకపోకలు సులువు కానున్నాయి. ప్రియాంక కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థికసాయం