
Bank Accounts: ఒకటికి మించిబ్యాంకు ఖాతాలు ఉంటే వచ్చే సమస్యలివే! అసలు ఎన్ని ఖాతాలు ఉండాలో తెలుసా?
చాలామంది తమ అవసరాలను బట్టి ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలను నిర్వహిస్తుంటారు. కొందరికి జీతం కోసం ఒక ఖాతా, పొదుపు కోసం మరో ఖాతా ఉంటే.. మరికొందరు వేర్వేరు బ్యాంకుల్లో మూడు లేదా అంతకంటే ఎక్కువ ఖాతాలను కూడా కలిగి ఉంటారు. అయితే ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉంటేనే ఎక్కువ ప్రయోజనాలు వస్తాయని అనుకోవడం సరైనది కాదు. ప్రతి ఖాతాకు స్పష్టమైన ప్రయోజనం ఉంటేనే వాటిని నిర్వహించడం ఉపయోగకరంగా ఉంటుంది. లేదంటే ఖాతాల సంఖ్య పెరిగేకొద్దీ వాటిని ట్రాక్ చేయడం, ఛార్జీలు గమనించడం, లావాదేవీలను తనిఖీ చేయడం కష్టమవుతుంది.





