
మీ ఆధార్ యాప్ మర్చిపోయారా? మీ ఇంట్లోనే జస్ట్ 5 నిమిషాల్లో కొత్త పిన్ రీసెట్ చేయొచ్చు
ఆధార్ యాప్ వాడే యూజర్లకు బిగ్ అలర్ట్ ఆధార్ యాప్ పిన్ మర్చిపోతే ఎలా పొందాలో తెలుసా? మీ ఇంట్లోనే ఈజీగా ఆధార్ యాప్ పిన్ రీసెట్ చేసుకోవచ్చు Aadhaar App PIN : ఆధార్ యూజర్లకు బిగ్ అలర్ట్.. మీ ఫోన్లో ఆధార్ యాప్ వాడుతున్నారా? అయితే, మీ ఆధార్ యాప్ సేఫ్టీ చాలా ముఖ్యం. మీ ఆధార్ సంబంధిత వ్యక్తిగత డేటా సేఫ్ ఉంచుకోవాలి. ఎలాంటి దుర్వినియోగం లేకుండా యాప్ పిన్ను ఎప్పటికప్పుడు ఛేంజ్ చేసుకోవాలి. మీ ఆధార్ యాప్ పిన్ను ఎలా మార్చాలో మీకు తెలియదా? ఈ సింపుల్ స్టెప్స్ ద్వారా మీ ఇంటి నుంచే ఈజీగా అప్డేట్ చేసుకోవచ్చు. ఆధార్ యాప్ పిన్ ఎలా మార్చాలంటే? సింపుల్ స్టెప్స్ : ముందుగా మీ మొబైల్లో ఆధార్ యాప్‌ను ఓపెన్ చేయండి. పాత పిన్ సాయంతో లాగిన్ అవ్వండి. లాగిన్ తర్వాత యాప్‌లోని ప్రొఫైల్ లేదా సెట్టింగ్స్ సెక్షన్‌కు వెళ్లండి. మీకు ఆధార్ సేఫ్టీకి సంబంధించిన అనేక ఆప్షన్లు కనిపిస్తాయి. ఇప్పుడు Change PIN లేదా Update PIN ఆప్షన్‌పై క్లిక్ చేయండి. మీ పాత పిన్ను ఎంటర్ చేయండి. మీ కొత్త పిన్ కూడా ఎంటర్ చేయండి. కొత్త పిన్ను మళ్లీ ఎంటర్ చేసి ఆ తర్వాత కన్ఫార్మ్ బటన్ క్లిక్ చేయండి. ఇప్పుడు Submit లేదా Save బటన్‌ను ట్యాప్ చేయండి. PIN మారినట్టు స్క్రీన్‌పై కనిపిస్తుంది. మళ్లీ ఆధార్ యాప్‌ను ఓపెన్ చేస్తే కొత్త పిన్ ఎంటర్ చేయాలి. మీ PIN మర్చిపోతే ఏం చేయాలి? : మీ ఆధార్ యాప్ పిన్ను మర్చిపోతే ఆందోళన అవసరం లేదు. యాప్‌లో Forgot PIN ఆప్షన్ ద్వారా కొత్త పిన్ను క్రియేట్ చేసుకోవచ్చు. దీనికి OTP వెరిఫికేషన్ అవసరం. మీ ఆధార్ కార్డుకు లింక్ చేసిన అదే మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. Read Also