
Tirumala | తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శిలాతోరణం వరకుక్యూలైన్లో భక్తులు
Tirumala | వేయి నామాలు గల వేంకటేశ్వరుడు కొలువుదీరిన తిరుమల లో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది.

Tirumala | వేయి నామాలు గల వేంకటేశ్వరుడు కొలువుదీరిన తిరుమల లో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది.

పద్మారావునగర్, వెలుగు: గాంధీ మెడికల్ కాలేజ్ 72వ ఫౌండేషన్ డే వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి.

నీట్ పేపర్ లీక్ అంశంపై విద్యార్థుల ఆందోళనలకు సంబంధించి నమోదైన కేసుల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. విద్యార్థులపై నమోదైన కేసులను వెంటనే ఎత్తివేయాలని కోరుతూ 4 రాష్ట్రాలు సుప్రీంను ఆశ్రయించాయి. ఇంటర్నెట్ డెస్క్: నీట్ పేపర్ లీక్ అంశంపై విద్యార్థుల ఆందోళనలకు సంబంధించి నమోదైన కేసుల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. విద్యార్థులపై నమోదైన 116 ఎఫ్ఐఆర్లను రద్దు చేయాలని కోరుతూ బిహార్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, అస్సాం రాష్ట్రాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం తమ రాష్ట్రాల్లో నమోదైన కేసులను వెంటనే ఎత్తివేయాలని కోరుతూ 4 రాష్ట్రాలు వేర్వేరు పిటిషన్లలో విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. విద్యార్థులు ఆందోళనలు విరమిస్తే వారిపై నమోదైన కేసులను ఉపసంహరించుకుంటామని జులై 25న కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ)కి ఇచ్చిన హామీని ఆయా రాష్ట్రాలు తమ పిటిషన్లలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన కేసులను రద్దు చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. విద్యార్థులపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలనే డిమాండ్‌తో ఈ నెల 5న ఢిల్లీలో ర్యాలీ నిర్వహించేందుకు సీజేపీ పిలుపునిచ్చిన నేపథ్యంలో కేంద్రం, రాష్ట్రాలు వేగంగా స్పందించినట్లు తెలుస్తోంది. దీంతో విద్యార్థుల ఆందోళనలకు సంబంధించిన కేసుల ఉపసంహరణపై సుప్రీంకోర్టు తదుపరి విచారణలో కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. హెగ్సెత్‌పై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు.. 2028 రేసులో ఉన్నట్టా? విమాన ఇంధనానికి మళ్లీ మంట.. లీటరుకు రూ.6.28 పెరిగిన ఏటీఎఫ్ ధర

గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఆధ్వర్యంలోని ఎలక్ట్రిక్ టూ-వీలర్ బ్రాండ్ అయిన యాంపియర్, 30కి పైగా కనెక్టెడ్ ఫీచర్లతో కూడిన 'మాగ్నస్ జి మ్యాక్స్' అప్డేటెడ్ వెర్షన్‌ను లాంచ్ చేసింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.1.10 లక్షలు కాగా, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కొత్త సిన్నమోన్ కాపర్ కలర్ ఆప్షన్లో కూడా లభిస్తుంది. ఫీచర్ల విషయానికి వస్తే.. మాగ్నస్ జి మ్యాక్స్‌లో ఇప్పుడు హిల్ హోల్డ్, క్రూజ్ కంట్రోల్, టర్న్-బై-టర్న్ నావిగేషన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. రద్దీగా ఉండే పార్కింగ్ ప్రదేశాలలో యజమానులు స్కూటర్‌ను గుర్తించడంలో సహాయపడే ఫైండ్ మై స్కూటర్ అండ్ పింగ్ మై స్కూటర్ వంటి భద్రతా ఫీచర్లు కూడా దీనికి లభిస్తాయి. యాంపియర్ కనెక్ట్ యాప్‌తో మెరుగైన కనెక్టివిటీ కోసం ఈ స్కూటర్లో అప్డేట్ చేసిన యూజర్ ఇంటర్ఫేస్ ఉంది. నావిగేషన్, ఇతర వాహన సమాచారాన్ని కొత్త 5 అంగుళాల ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో చూడవచ్చు. ఇతర కనెక్టెడ్ ఫీచర్లలో రియల్ టైమ్ ఛార్జింగ్ స్టేటస్, లైవ్ ట్రాకింగ్, జియో ఫెన్సింగ్, తెఫ్ట్ అండ్ టో అలర్ట్‌లు, రిమోట్ వెహికల్ డయాగ్నోస్టిక్స్, సర్వీస్ బుకింగ్, ఛార్జింగ్ హిస్టరీ, బ్యాటరీ హెల్త్ ఇన్సైట్స్ ఉన్నాయి. మాగ్నస్ జి మ్యాక్స్‌కు ఓవర్-ది-ఎయిర్ (OTA) అప్డేట్లు కూడా లభిస్తాయి. ఇవి సాఫ్ట్వేర్ అప్డేట్లను రిమోట్‌గా ఇన్స్టాల్ చేయడానికి.. స్కూటర్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌లోని సాఫ్ట్వేర్ సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి సహాయపడతాయి. మాగ్నస్ జి మ్యాక్స్ 3 kWh బ్యాటరీ ప్యాక్‌తో పాటు 2.4 kW మోటార్‌ను కలిగి ఉంది. సర్టిఫైడ్ రేంజ్ 142 కిమీ. రియల్ వరల్డ్ రేంజ్ కొంత తగ్గుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 65 కి.మీ.లు. బ్యాటరీకి 5 సంవత్సరాలు లేదా 75,000 కి.మీ.ల వారంటీ వర్తిస్తుంది. కర్నూలులో వైఎస్ జగన్‌కు జననీరాజనం.. కదం తొక్కిన కార్యకర్తలు (ఫొటోలు) 'అగధ' మూవీ కామాక్షి భాస్కర్ల స్పెషల్ (ఫొటోలు) బాలనటి గ్రీష్మ నేత్రిక ఇప్పుడు ఎలా

హైదరాబాద్‌లో ట్రాఫిక్‌జామ్‌కు చెక్ పెట్టడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్(హెచ్-సిటీ)లో భాగంగా వంతెనలు, అండర్‌పాస్‌ల నిర్మాణాన్ని వేగవంతం చేసింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పనులు ప్రారంభం అయ్యాయి. నిర్మాణ సంస్థ ఎంపిక.. ఆమోదించిన పురపాలక శాఖ హైదరాబాద్ సిటీ: మహా నగరంలో ట్రాఫిక్‌జామ్‌కు చెక్ పెట్టడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్(హెచ్-సిటీ)లో భాగంగా వంతెనలు, అండర్‌పాస్‌ల నిర్మాణాన్ని వేగవంతం చేసింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పనులు ప్రారంభం అయ్యాయి. మరికొన్ని జంక్షన్ల వద్ద వంతెనల నిర్మాణానికి పాలనాపరమైన అనుమతులు జారీ చేస్తోంది. టెండర్ ప్రక్రియలో భాగంగా ఏజెన్సీల ఎంపికకూ ఆమోదం తెలుపుతోంది. ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన ఓవైసీ ఫ్లై ఓవర్ నుంచి సంతోష్‌నగర్ వైపు వెళ్లేలా ఎడమ వైపు ర్యాంపు, హఫీజ్‌బాబా నగర్ జంక్షన్ నుంచి బాలాపూర్ 100 అడుగుల రోడ్డు వరకు, బండ్లగూడ- ఎర్రకుంట ఎక్స్ రోడ్ వద్ద ఆరు లేన్ల వంతెనల నిర్మాణం కోసం ఏజెన్సీ ఎంపికకు సర్కార్ ఆమోదం తెలుపుతూ బుధవారం పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రూ.242.72 కోట్ల నిర్మాణ వ్యయంతో ఈ వంతెనలు, ర్యాంప్‌ను ఒకే ప్యాకేజీగా చేపట్టనున్నారు. వాస్తవంగా ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ.231.87 కోట్లుగా అంచనా వేయగా.. 4.68 శాతం ఎక్కువకు కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ లిమిటెడ్ బిడ్ దాఖలు చేసింది. రెండు పర్యాయాలు టెండర్ ప్రకటించినా.. సింగిల్ బిడ్ దాఖలు కావడంతో అదే సంస్థను ఎంపిక చేశారు. ఆస్తుల సేకరణతో కలిపి ప్రాజెక్టుకు రూ.385 కోట్లు అవసరమని అంచనా వేయగా సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.పనులు చేపట్టేందుకు ఏజెన్సీతో జీహెచ్ఎంసీ కమిషనర్ ఒప్పందం కుదర్చుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వంతెనలు పూర్తయితే పాతబస్తీలో పలు ప్రాంతాల నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి రాకపోకలు సులువు కానున్నాయి. ప్రియాంక కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థికసాయం

India vs Sri Lanka: శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియా యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. శ్రీలంక క్రికెట్ XIతో జరిగిన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో పడిక్కల్ 164 బంతుల్లో 142 పరుగులతో ఆకట్టుకున్నాడు. అతని ఇన్నింగ్స్‌లో భారీ షాట్లతో పాటు క్రీజులో నిలదొక్కుకునే సామర్థ్యాన్ని కూడా ప్రదర్శించాడు. ఈ ప్రదర్శనతో శ్రీలంకతో గాలే వేదికగా జరగనున్న తొలి టెస్టులో పడిక్కల్‌కు తుది జట్టులో చోటు దక్కుతుందా అనే చర్చ మొదలైంది. దీనిపై టీమిండియా స్పిన్ బౌలింగ్ కోచ్ సైరాజ్ బహుతులే స్పందించారు. పడిక్కల్‌కు ప్రాక్టీస్ మ్యాచ్‌లో లభించిన అవకాశాన్ని అతను అద్భుతంగా ఉపయోగించుకున్నాడని ప్రశంసించారు. పడిక్కల్ తనను తాను నిరూపించుకున్నాడని, భారీ స్కోర్ చేయడం ద్వారా మంచి ఆత్మవిశ్వాసాన్ని సంపాదించుకున్నాడని బహుతులే పేర్కొన్నారు. అయితే తొలి టెస్టులో అతడిని ఆడించాలా వద్దా అనే నిర్ణయం మాత్రం గాలేకు చేరుకున్న తర్వాతే తీసుకుంటామని స్పష్టం చేశారు. పిచ్ పరిస్థితులు, జట్టు అవసరాలను పరిశీలించిన అనంతరం తుది జట్టును ఎంపిక చేస్తామని తెలిపారు. ఇదిలా ఉండగా.. గాలే టెస్టులో భారత జట్టు స్పిన్ విభాగంపైనా ఆసక్తి నెలకొంది. జట్టులో నలుగురు స్పిన్నర్లు తమదైన ప్రత్యేకత కలిగి ఉన్నారని బహుతులే తెలిపారు. రవీంద్ర జడేజాకు అంతర్జాతీయ స్థాయిలో అపారమైన అనుభవం ఉందని, మానవ్ సుతార్ కచ్చితమైన బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నాడని చెప్పారు. అలాగే శారాంశ్ జైన్ దేశవాళీ క్రికెట్లో మంచి ప్రదర్శనలు ఇచ్చి జట్టులో చోటు సంపాదించుకున్నాడని పేర్కొన్నారు. గాలే పిచ్ స్వభావాన్ని పరిశీలించిన తర్వాత స్పిన్నర్ల కాంబినేషన్‌పై కూడా నిర్ణయం తీసుకుంటామని బహుతులే వెల్లడించారు. దీంతో తొలి టెస్టులో భారత తుది జట్టులో ఎవరెవరికి చోటు దక్కుతుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. కాగా, భారత్, శ్రీలంక మధ్య తొలి టెస్టు ఆగస్టు 15 నుంచి గాలే ఇంటర్నేషనల్ స్టేడియంలో ప్రారంభం కానుంది. ప్రాక్టీస్ మ్యాచ్‌లో 142 పరుగులతో మెరిసిన పడిక్కల్‌కు