
Kalyan | నిర్మాతల మండలి ఎన్నికల్లో ‘మనప్యానెల్’ హవా.. మెజారిటీస్థానాలు కైవసం!
Kalyan | నిర్మాతల మండలి ఎన్నికల్లో ‘మన ప్యానెల్’ హవా.. మెజారిటీ స్థానాలు కైవసం!
© 2026 nimisham.in

Kalyan | నిర్మాతల మండలి ఎన్నికల్లో ‘మన ప్యానెల్’ హవా.. మెజారిటీ స్థానాలు కైవసం!

తాత్కాలికంగా నిరసన విరమించిన ఉద్యోగులు.. డిమాండ్లు నెరవేర్చాలని షరతు
TFPC: ‘మన ప్యానెల్’ ఘన విజయం.. నిర్మాతల మండలి అధ్యక్షుడిగా సి. కళ్యాణ్ ఎన్నిక

నిర్మాతల మండలి ఎన్నికల్లో ‘మన ప్యానెల్’ విజయం

కదంతొక్కిన స్వర్ణ వార్డు/ స్వర్ణ గ్రామ ఉద్యోగులు
AP Development: ఏపీ మాత్రం బాగుపడొద్దా? అభివృద్ధిని అడ్డుకుంటున్న రాజకీయాలు, మేధావుల తీరుపై చర్చ AP Development: ఏపీ అభివృద్ధిని అడ్డుకుంటున్నది ఎవరు? AP Development అంటే కేవలం రోడ్లు వేయడం, భవనాలు నిర్మించడం మాత్రమే కాదు. ఒక రాష్ట్రానికి పెట్టుబడులు రావడం, పరిశ్రమలు ఏర్పడటం, యువతకు ఉద్యోగాలు లభించడం, రాజధాని అభివృద్ధి చెందడం, మౌలిక సదుపాయాలు పెరగడం, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడటం అన్నీ కూడా అభివృద్ధిలో భాగమే. కానీ ఆంధ్రప్రదేశ్ విషయంలో ఒక విచిత్రమైన […]

నిర్మాతల మండలి కొత్త అధ్యక్షుడి ముందు పెను సవాళ్లు!

నిర్మాతల మండలి ఎన్నికల్లో.. ‘మన ప్యానల్’ క్లీన్ స్వీప్

నిర్మాతల మండలి ఎన్నికల్లో ‘మన ప్యానెల్’ హవా..

రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యం దిశగా భారత్ మరో కీలక ముందడుగు వేసింది. భారత వాయుసేన (ఐఏఎఫ్), పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన 'ఖగంతక్-243' అనే లాంగ్ రేంజ్ గ్లైడ్ బాంబు (ఎల్ఆర్‌జీబీ) డ్రాప్ ట్రయల్‌ను విజయవంతంగా నిర్వహించింది. ఈ పరీక్షతో సుదూరంలోని లక్ష్యాలను కచ్చితత్వంతో ఛేదించే సామర్థ్యం భారత వాయుసేనకు మరింత పెరిగింది.ఈ పరీక్ష నిర్దేశిత లక్ష్యాలన్నింటినీ అందుకుందని, 'ఆత్మనిర్భర్ భారత్', 'మేకిన్ ఇండియా' స్ఫూర్తితో రక్షణ రంగంలో సరికొత్త శిఖరాలను అధిరోహించామని సెప్టెంబర్ 2న 'ఎక్స్' సోషల్ మీడియా వేదికగా ఐఏఎఫ్ ప్రకటించింది. ఇది భారత వాయుసేనతో పాటు దేశీయ రక్షణ పరిశ్రమకు కూడా ఒక ముఖ్యమైన మైలురాయి అని పేర్కొంది.ఖగంతక్-243 ప్రత్యేకతలునాగ్పూర్కు చెందిన జేఎస్ఆర్ డైనమిక్స్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) సంయుక్తంగా ఈ బాంబును అభివృద్ధి చేశాయి. 300 కిలోల తరగతికి చెందిన ఈ బాంబులో 125 కిలోల శక్తివంతమైన వార్‌హెడ్ ఉంటుంది. సుఖోయ్-30ఎంకేఐ యుద్ధ విమానం నుంచి పొఖ్రాన్‌లో దీనిని పరీక్షించారు.ఈ గ్లైడ్ బాంబును సుమారు 12 కిలోమీటర్ల ఎత్తు నుంచి జారవిడిచినప్పుడు, తనకున్న రెక్కల సహాయంతో గాలిలో తేలుతూ 180 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా కచ్చితత్వంతో ఛేదించగలదు. దీనివల్ల, శత్రుదేశాల ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ పరిధిలోకి వెళ్లకుండానే మన ఫైటర్ జెట్లు లోతైన ప్రాంతాల్లోని రన్వేలు, కమాండ్ సెంటర్లు వంటి వ్యూహాత్మక టార్గెట్లపై దాడి చేయవచ్చు.భవిష్యత్తులో మిగ్-29కె, మిరాజ్-2000 వంటి ఇతర విమానాల్లోనూ దీనిని అనుసంధానించనున్నారు. ఇప్పటికే పరిమిత సంఖ్యలో వీటి ఉత్పత్తి కోసం బీఈఎల్‌కు

టెక్ దిగ్గజం గూగుల్ సైబర్ సెక్యూరిటీ రంగంలో మరో కీలక మైలురాయిని అధిగమించింది. తమ అత్యంత శక్తివంతమైన సైబర్ సెక్యూరిటీ ఏఐ మోడల్ "జెమినీ 3.8 ఫ్లాష్ సైబర్"ను పరిచయం చేస్తున్నట్లు ఆ సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్ ప్రకటించారు. సైబర్ భద్రతకు సంబంధించిన లోపాలను అత్యంత వేగంగా గుర్తించి, వాటిని అంతే వేగంగా సరిదిద్దడంలో ఈ మోడల్ అద్భుతమైన పనితీరు కనబరుస్తుందని ఆయన 'ఎక్స్' వేదికగా వెల్లడించారు.ఈ ఏఐ మోడల్ సామర్థ్యాన్ని పరీక్షించేందుకు నిర్వహించిన పరిశ్రమల ప్రామాణిక 'సైబర్జిమ్' బెంచ్‌మార్క్‌లో ఇది 86.2 శాతం స్కోరును సాధించిందని ఆయన తెలిపారు. అదేవిధంగా, లోపాలను సరిచేసే విషయంలో 'CWE-బెంచ్' పరీక్షలో 47.2 శాతం సామర్థ్యాన్ని ప్రదర్శించినట్లు పేర్కొన్నారు. గూగుల్ అందిస్తున్న ఇతర ఫ్లాష్ మోడల్స్ తరహాలోనే ఇది కూడా వేగవంతమైన పనితీరును, తక్కువ ఖర్చుతో కూడిన లభ్యతను కలిగి ఉంటుందని సుందర్ పిచాయ్ వివరించారు.గూగుల్ నిర్వహించిన అంతర్గత పరీక్షల్లో దాదాపు 20 ప్రోగ్రామింగ్ భాషల్లోని లోపాలను కనుగొనడంలో ఈ మోడల్ 70 శాతం కంటే ఎక్కువ సక్సెస్ రేటును నమోదు చేసినట్లు సుందర్ పిచాయ్ వెల్లడించారు. అత్యున్నత స్థాయి పనితీరును కనబరుస్తూనే, "ఫ్లాష్" స్థాయి వేగంతో, సరసమైన ధరకే ఈ మోడల్ అందుబాటులోకి వస్తుందని ఆయన స్పష్టం చేశారు

ప్రముఖ రైడ్ హైలింగ్ కంపెనీ ఉబర్ భారీ స్థాయిలో ఉద్యోగాల కోతకు సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా తమ ఉద్యోగుల్లో సుమారు 3,300 మందిని తొలగించనున్నట్లు ప్రకటించింది. ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ రైడ్ హైలింగ్ కంపెనీ ఉబర్ భారీ స్థాయిలో ఉద్యోగాల కోతకు సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా తమ ఉద్యోగుల్లో సుమారు 3,300 మందిని తొలగించనున్నట్లు ప్రకటించింది. ఇది కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 10 శాతానికి సమానం. మేనేజ్మెంట్ స్థాయిలను తగ్గించడం, సంస్థాగత నిర్మాణాన్ని సరళీకరించడం, భవిష్యత్ వ్యాపారాలపై పెట్టుబడులను పెంచడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది (Uber layoffs 2026). గత ఏడాది చివరి నాటికి ఉబర్‌లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 34,000 మంది ఉద్యోగులు ఉన్నారు. తాజా లేఆఫ్స్‌తో ఉద్యోగుల సంఖ్య 30 వేల కంటే దిగువకు చేరనుంది. 2021లో కంపెనీ ఉద్యోగుల సంఖ్య ఏ స్థాయిలో ఉందో దాదాపు అదే స్థాయికి ఇప్పుడు చేరనుంది. కోవిడ్ మహమ్మారి తర్వాత ఉబర్ చేపడుతున్న అతిపెద్ద ఉద్యోగాల కోత ఇదే. 2020 మేలో కరోనా కారణంగా రైడ్ హైలింగ్ డిమాండ్ కుప్పకూలడంతో కంపెనీ సుమారు 6,700 ఉద్యోగాలను తొలగించింది (Uber job cuts). ఈ పునర్వ్యవస్థీకరణలో భాగంగా కంపెనీలోని మేనేజర్ల సంఖ్యను 20 శాతం తగ్గించనున్నారు (Uber manager layoffs). అయితే వీరందరూ ఉద్యోగాలు కోల్పోతారని కాదు. కొంతమంది మేనేజర్లను మేనేజ్మెంట్ బాధ్యతల నుంచి తొలగించి వేరే పాత్రల్లోకి మార్చనున్నారు. ఉద్యోగాల కోత మాత్రం మేనేజర్లకే పరిమితం కాకుండా ఇతర ఉద్యోగులపైనా ప్రభావం చూపనుంది. సంస్థను మరింత సరళంగా, వేగంగా మార్చడమే తాజా పునర్వ్యవస్థీకరణ లక్ష్యమని ఉబెర్ సీఈవో దారా ఖోస్రోషాహి తెలిపారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో జగిత్యాల వాసి మృతి వియన్నా మ్యూజియంలో భారీ దోపిడీ.. రూ.38 కోట్ల విలువైన వజ్రాల హారం చోరీ
Bhagavanth Kesari బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ప్రత్యేక పేజీ. కొత్త కథనాలు మరియు వివరాలు సేకరించిన వెంటనే ఇక్కడ చేర్చబడతాయి.

టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్(Nikhil Siddharth) కెరీర్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కార్తికేయ(Karthikeya) ఫ్రాంచైజీకి మూడో భాగం రాబోతోందనే వార్త అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. తొలి రెండు భాగాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు, రెండో భాగం జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకోవడం ఈ సిరీస్‌పై అంచనాలను మరింత పెంచింది. దీంతో కార్తికేయ3(Karthikeya3) విషయంలో ఎలాంటి రాజీ పడకుండా మరింత భారీ స్థాయిలో సినిమాను రూపొందించాలనే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. కథను పూర్తి స్థాయిలో రెడీ చేయడంతో పాటు, కథకు సరిపోయే లొకేషన్ల ఎంపిక వంటి వర్క్స్ జరుగుతున్నాయి. గత రెండు సినిమాల సక్సెస్‌ల నేపథ్యంలో మూడో భాగం కేవలం సీక్వెల్‌గా కాకుండా, ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించేలా ఉండాలని నిఖిల్ భావిస్తున్నట్లు సమాచారం. సరైన ప్లానింగ్‌తోనే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లాలని టీమ్ నిర్ణయించినట్లు కనిపిస్తోంది. ఇదిలా ఉండగా నిఖిల్ ప్రస్తుతం తన పూర్తి దృష్టిని భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న స్వయంభుపై పెట్టారు. దాదాపు రెండేళ్లుగా ఈ ప్రాజెక్ట్ కోసం టైమ్ కేటాయించిన ఆయన, సినిమా రిలీజ్ తర్వాతే తర్వాతి ప్రాజెక్టులపై క్లియర్ డెసిషన్స్ తీసుకునే అవకాశముంది. భరత్ కృష్ణమాచారి(Bharath Krishnamachari) దర్శకత్వంలో రూపొందుతున్న స్వయంభులో సంయుక్త(Samyuktha), నభా నటేష్(Nabha Natesh) హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత నిఖిల్ మళ్లీ కార్తికేయగా ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది

తెలంగాణ ప్రభుత్వం రైతులకు మరోసారి శుభవార్త చెప్పింది. రైతు భరోసా పథకం కింద మూడో విడత నిధులను విడుదల చేసింది. హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రైతులకు మరోసారి శుభవార్త చెప్పింది. రైతు భరోసా పథకం కింద మూడో విడత నిధులను విడుదల చేసింది. 3 నుంచి 4 ఎకరాల భూమి కలిగిన రైతుల ఖాతాల్లో రూ.1,330 కోట్లను జమ చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఈ విడతలో 6.39 లక్షల మంది రైతులు లబ్ధి పొందగా, ఇప్పటివరకు మొత్తం 61.35 లక్షల మంది రైతులకు రూ.5,402.37 కోట్ల రైతు భరోసా సాయాన్ని ప్రభుత్వం అందించినట్లు మంత్రి తెలిపారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం, సాగు ఖర్చులను తగ్గించడం, రైతులకు ఆర్థిక భరోసా కల్పించడమే రైతు భరోసా పథకం ప్రధాన ఉద్దేశమని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే నిధులు జమ చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని ముందుకు సాగుతోందని ఆయన అన్నారు. ‘మీ అవినీతిని మాకు అంటించాలని చూస్తున్నారా’.. బీఆర్ఎస్పై పొంగులేటి ఫైర్ వారెవ్వా... మీ డ్రామాలు బిగ్‌బాస్ షోను తలపిస్తున్నాయి.. కాంగ్రెస్, బీఆర్ఎస్లపై బండి సంజయ్ సెటైర్లు

ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో పాకిస్థాన్ 194 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైన నేపథ్యంలో ఆ జట్టు ఓపెనర్ ఇమామ్-ఉల్-హక్ గాయంపై వివాదం మొదలైంది. మ్యాచ్ సందర్భంగా కాలి పిక్కకు గాయమైన ఇమామ్.. రెండు ఇన్నింగ్స్‌లలోనూ బ్యాటింగ్‌కు రాకపోవడంపై పాకిస్థాన్ సెలక్షన్ కమిటీలోని సీనియర్ సభ్యుడు ఆకిబ్ జావేద్ అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) విచారణ జరుపుతుందని వెల్లడించారు. పాకిస్థాన్ నాలుగు సభ్యుల సెలక్షన్ ప్యానెల్లో ఉన్న ఆకిబ్ జావేద్.. కండరాల గాయం కారణంగా ఆటగాడు రెండు ఇన్నింగ్స్‌లలోనూ బ్యాటింగ్‌కు దూరంగా ఉండటం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. గాయాలు క్రికెట్లో సహజమేనని, గతంలో ఆటగాళ్లు గాయాలతోనూ కట్టులు కట్టుకుని బ్యాటింగ్ చేసిన సందర్భాలు ఉన్నాయని గుర్తుచేశారు. అయితే ఇమామ్ విషయంలో పరిస్థితి భిన్నంగా ఉందని, ఇది ఆందోళన కలిగించే అంశమని అన్నారు. లార్డ్స్ టెస్టు తొలి రోజు ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఇమామ్ ఎడమ కాలి పిక్కకు గాయమైంది. దీంతో మ్యాచ్‌లో మిగిలిన భాగానికి అతడు దూరమయ్యాడు. అయితే నాలుగో రోజు ఆట ప్రారంభానికి ముందు ఇమామ్ మైదానంలోని అవుట్‌ఫీల్డ్‌లో కనిపించాడు. కాలికి భారీగా కట్టు కట్టుకుని షాడో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసిన అతడు నడిచేటప్పుడు కుంటుతూ కనిపించడం చర్చకు దారితీసింది. లార్డ్స్ టెస్టు కోసం తుది జట్టు ఎంపిక విషయంలో సెలెక్టర్లు, జట్టు యాజమాన్యం మధ్య విభేదాలు ఉన్నాయన్న వార్తలపైనా ఆకిబ్ జావేద్ స్పందించారు. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయగల ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ ఉబైద్ షాను జట్టులోకి తీసుకోవాలని తాను సూచించినట్లు తెలిపారు. వికెట్ కీపర్-బ్యాటర్ ఘాజీ ఘోరీకి అవకాశం ఇవ్వాలని, మహమ్మద్ రిజ్వాన్ స్థానంలో అతడిని ఆడించాలని తాను అభిప్రాయపడినట్లు చెప్పారు. అయితే తుది జట్టు ఎంపికలో తన సూచనలు పూర్తిగా అమలు కాలేదని పేర్కొన్నారు. హెడ్డింగ్లీ, లార్డ్స్‌లో జరిగిన తొలి రెండు టెస్టుల్లో పాకిస్థాన్

Silver: వెండి కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్త.. ఈ విషయం తెలుసుకోకపోతే మీకే నష్టం.. చాలామంది ఇది పట్టించుకోరు.. ఈ వార్తకు సంబంధించిన
Gold Funds: మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్లకు గత మూడేళ్ల కాలంలో కొన్ని రకాల గోల్డ్ ఫండ్స్ ఊహించని రీతిలో భారీ లాభాలు అందించాయి. వాల్యూ రీసెర్చ్ నివేదిక ప్రకారం గత 3 సంవత్సరాల కాలంలో లంప్ సమ్ పెట్టుబడిపై ఏడాదికి 25 శాతం కంటే ఎక్కువ కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ (CAGR) రాబడిని అందించిన టాప్-5 పథకాల గురించిన వివరాలు ఎకనామిక్ టైమ్స్ విశ్లేషించింది. ఇందులో నాలుగు గోల్డ్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఉన్నాయి. ఎస్బీఐ, యాక్సిస్ వంటి దిగ్గజ సంస్థల స్కీమ్స్ ఈ జాబితాలో ఉన్నాయి. మరి వాటి గురించి తెలుసుకుందాం.యూటీఐ గోల్డ్ ఈటీఎఫ్యూటీఐ మ్యూచువల్ ఫండ్ తీసుకొచ్చిన యూటీఐ గోల్డ్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్ (UTI Gold ETF FoF) గడిచిన మూడు సంవత్సరాల కాలంలో సగటున వార్షిక రాబడి 36.14 శాతంతో అందించింది. ఇందులో మూడేళ్ల క్రితం రూ.1 లక్ష లంప్ సమ్ విధానంలో ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇప్పుడు ఆ విలువ రూ.2.52 లక్షలు అవుతుంది.Read Also: NFOs: మ్యూచువల్ ఫండ్స్‌లో మరో 3 కొత్త స్కీమ్స్.. ఈరోజు నుంచే షురూ.. రూ.100 ఉన్నా చేరొచ్చు!క్వాంటమ్ గోల్డ్ ఈటీఎఫ్క్వాంటమ్ మ్యూచువల్ ఫండ్ నుంచి వచ్చిన క్వాంటమ్ గోల్డ్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్ (Quantum Gold ETF FoF) గత మూడేళ్ల రిటర్న్స్ చూసుకుంటే సగటున ఏడాదికి 35.98 శాతం రాబడులు ఇచ్చింది. మూడేళ్ల క్రితం లంప్ సమ్‌గా రూ.1 లక్ష పెట్టి ఇప్పటి వరకు కొనసాగినట్లియితే ఆ విలువ రూ.2.51 లక్షలు అవుతుంది.ఎస్బీఐ గోల్డ్ ఫండ్ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ తీసుకొచ్చిన ఎస్బీఐ గోల్డ్ ఫండ్ (SBI Gold Fund) గడిచిన 3 ఏళ్లలో సగటున వార్షిక రాబడి 35.77 శాతం చొప్పున అందించింది. ఇందులో లంప్ సమ్ విధానంలో మూడేళ్ల క్రితం రూ.1 లక్ష పెట్టినట్లియితే ఇప్పుడు ఆ విలువ

ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన కెనరా బ్యాంక్ తమ కస్టమర్లకు షాకిచ్చింది. ఏటీఎం లావాదేవీల ఛార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా నెలవారీ ఉచిత ఏటీఎం ట్రాన్సాక్షన్ల పరిమితిని తగ్గించింది. ఇదే కాకుండా సేవింగ్స్ అకౌంట్లో సరిపడ బ్యాలెన్స్ లేకుండా విత్ డ్రా చేయడానికి ప్రయత్నిస్తే భారీగా పెనాల్టీలు విధించనున్నట్లు వెల్లడించింది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచే ఈ కొత్త ఛార్జీలను అమల్లోకి తెచ్చినట్లు స్పష్టం చేసింది. ఖాతాదారులు దీనిని గమనించాలని, ఇందుకనుగుణంగా లావాదేవీలు నిర్వహించుకోవాలని సూచించింది. ఇప్పటికే కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు ప్రైవేట్ బ్యాంకులు ఏటీఎం ఉచిత లావాదేవీల పరిమితిని తగ్గిస్తున్నాయి. ఈ క్రమంలో కెనరా బ్యాంక్ కూడా అదే నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు కెనరా బ్యాంక్ ఏటీఎంలో ఉచిత ట్రాన్సాక్షన్ల పరిమితి ఆరుగా ఉండేది. ఇప్పుడు దానిని 5కి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో నెలకు కేవలం ఐదు లావాదేవీలు మాత్రం ఏటీఎంలలో ఉచితంగా చేసుకోవచ్చు. ఆ పైబడి చేస్తే ఛార్జీలు కట్ అవుతాయి. బ్యాలెన్స్ చెకింగ్, మినీ స్టేట్మెంట్ వంటి వాటిని కూడా ఉచిత పరిమితిలో చేర్చారు. ఉచిత లావాదేవీల తర్వాత అకౌంట్లో డబ్బులు లేకపోయినా విత్ డ్రాకు ప్రయత్నిస్తే రూ.23 ప్లస్ జీఎస్టీ పడుతుంది ఏటీఎంలో ఉచిత లావాదేవీల తర్వాత ప్రతీ ట్రాన్సాక్షన్‌కు రూ.23 ప్లస్ జీఎస్టీ పడుతుంది. ఇప్పటివరకు ఇది రూ.20గా ఉండగా.. ఇప్పుడు మరో రూ.3 పెంచారు. అయితే సీనియర్ సిటిజన్లు నెలకు 8 ఉచిత ఏటీఎం లావాదేవీలు చేసుకోవచ్చు. ఈ లిమిట్ దాటాక వారికి ఒక్కొ ట్రాన్సాక్షన్‌కు రూ.5 ప్లస్ జీఎస్టీ పడుతుంది. సీనియర్ సిటిజన్ల లావాదేవీల పరిమితి ఎప్పటిలాగే ఉంచింది. ఇప్పటినుంచి మెట్రో సిటీల్లోని కెనరా బ్యాంక్ ఏటీఎంలో నెలకు 5 ఉచిత లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. ఇతర బ్యాంక్ ఏటీఎంలో 3 ట్రాన్సాక్షన్లు ఫ్రీగా చేసుకోవచ్చు. అయతే కెనరా బ్యాంక్ ప్లాటినం, బిజినెస్, సెలక్ట్ వంటి కార్డ్స్‌కు గ్రీన్ పిన్

ఆ హీరో ఫ్యాన్స్ మీరున్న సిటీలో మీ కళ్ళ ముందు ఉండే ఉంటారు.. అచ్చు ఆ హీరోలాగానే హెయిర్ స్టైల్, డ్రెస్, ఫేస్ కట్స్ తో 24 అవర్స్ ఆన్ మై హీరో యాటిట్యూడ్ అనేలా ఉండటం కూడా ఆ హీరో ఫ్యాన్స్ నైజం. కానీ ఆ హీరో సుమారు 270 చిత్రాల్లో చేస్తే 180కి పైగా ప్లాప్స్. పైగా ముప్పై ఏళ్ల పాటు సరైన సోలో హిట్ లేదు. నిజం సైతం నిజామా అని ఆశ్చర్యపోయినా కూడా ఇది నిజమే. కానీ తన క్రేజ్, స్టార్డమ్ ఏమాత్రం చెక్కు చెదరలేదు. ఆయనే భారతీయ సినీ యవనికపై 'డిస్కో డాన్సర్'గా ముద్ర వేసుకున్న హీరో మిథున్ చక్రవర్తి. . 1976లో ప్రముఖ దర్శకుడు మృణాల్ సేన్ తెరకెక్కించిన 'మృగయ' అనే క్లాసిక్ చిత్రంతో నటుడిగా అరంగేట్రం చేసిన మిథున్, తొలి సినిమాతోనే ఉత్తమ నటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డును అందుకొని అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత 1982లో వచ్చిన 'డిస్కో డాన్సర్' సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించారు. అప్పట్లోనే ఈ చిత్రం 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఆ కాలపు అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అక్కడ నుంచి మిథున్ ఇండియాలోనే మోస్ట్ డిమాండింగ్ స్టార్లలో ఒకరిగా మారారు. అయితే కాలం మారే కొద్దీ కథల ఎంపికలో వేగం, క్వాలిటీ కంటే క్వాంటిటీకే ఆయన ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. 90ల కాలంలో ఏడాదికి పదుల సంఖ్యలో, తక్కువ బడ్జెట్ మరియు వేగంగా పూర్తయ్యే సినిమాల్లో నటిస్తూ రికార్డులు క్రియేట్ చేశారు. దీనివల్ల ఆయన ఖాతాలో ఓటములు ఎక్కువగా చేరుతూ వచ్చాయి. 1993 నుంచి 1998 మధ్యకాలంలోనే ఆయన నటించిన 33 చిత్రాలు వరుసగా ప్లాప్ అయ్యాయి. అలా తన మొత్తం కెరీర్లో 350కి పైగా చిత్రాల్లో నటించగా, ఏకంగా 180కి పైగా సినిమాలు తీవ్రమైన డిజాస్టర్లుగా మిగిలిపోయాయి. దాదాపు 30 ఏళ్ల పాటు బాక్సాఫీస్

టీ5 సిరీస్‌లో వివో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. 7,050mAh బ్యాటరీ, 6.83 అంగుళాల 3డీ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లేతో ఈ ఫోన్ వచ్చింది. 144Hz వరకు రిఫ్రెష్ రేట్, 50MP కెమెరా, 4కే వీడియో రికార్డింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సెప్టెంబర్ 9 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయాలు ప్రారంభం కానున్నాయి.వివో టీ5 5జీ ధర రూ.34,999 నుంచి మొదలవుతుంది. 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర ఇది. 8జీబీ + 128జీబీ మోడల్ రూ.39,999, 8జీబీ + 256జీబీ ధర రూ.44,999. టాప్ వేరియంట్ 12జీబీ + 256జీబీ ధర రూ.49,999గా కంపెనీ నిర్ణయించింది. యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డులతో రూ.4,000 వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. రాయల్ బ్రాంజ్, సిల్వర్ గ్రీన్ రంగుల్లో ఫోన్ అందుబాటులో ఉంటుంది.ఫోన్లో 6.83 అంగుళాల 1.5కే 3డీ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే ఉంది. 1260×2800 పిక్సెల్ రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్, 2,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, హెచ్డీఆర్10+ సపోర్ట్ ఉన్నాయి. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం ఐపీ68, ఐపీ69 రేటింగ్స్ ఇచ్చారు.4nm మీడియాటెక్ డైమెన్సిటీ 7500 టర్బో చిప్సెట్, మీడియాటెక్ ఎన్పీయూ 850 ప్రాసెసర్‌తో ఫోన్ పనిచేస్తుంది. ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ ఉన్నాయివెనుక రెండు కెమెరాలు ఉన్నాయి. 50MP సోనీ ఐఎంఎక్స్882 మెయిన్ కెమెరాకు ఓఐఎస్ సపోర్ట్ ఉంది. దీనికి 8MP అల్ట్రావైడ్ కెమెరా జత చేశారు. ముందు 32MP సెల్ఫీ కెమెరా ఇచ్చారు. 4కే వీడియో రికార్డింగ్

ఆరోగ్యంగా ఉండాలని, బరువు తగ్గాలి అనుకునేవారు ఈ రోజుల్లో తాము చేసే వంటలో నూనె తగ్గించడం మొదలుపెడుతున్నారు. కానీ, నూనె తగ్గించి, వంట చేయడం వల్ల కూర రుచిగా ఉండదు అనే భావన చాలా మందికి ఉంటుంది. కానీ, ప్రముఖ సెలబ్రెటీ షెఫ్ రణ్ వీర్ బ్రార్ రీసెంట్ గా ఓ సీక్రెట్ బయట పెట్టారు. వంటలో రుచి కొంచెం కూడా తగ్గకుండా, అతి తక్కువ నూనెతో కూడా రుచిగా, ఆరోగ్యకరంగా ఎలా చేయాలో ఆయన చెప్పారు. ఆ ట్రిక్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం.. దాదాపు అందరి ఇంట్లోనూ... పెద్ద పెద్ద ఆయిల్ క్యాన్లు, బాటిల్స్ వాడుతూ ఉంటారు. వాటితోనే నేరుగా.. కూరలోని నూనె పోసేస్తూ ఉంటారు. లేదంటే.. ఆ నూనె డబ్బాల్లో పెద్ద గరిటెలు పెడుతూ ఉంటారు. దీని వల్ల మనకు తెలీకుండానూ కూరలో నూనె ఎక్కువ వాడేస్తూ ఉంటాం. దీని వల్ల, మనం తెలీకుండానే నూనె ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. అందుకే, ముందు.. ఆ నూనె డబ్బాను మార్చేయాలి. పెద్ద మూత ఉన్న నూనె డబ్బాను తీసేసి.. దాని ప్లేస్ లో చిన్న లేదా సన్న మూతి ఉన్న నూనె బాటిల్ పెట్టాలి. దీని వల్ల.. కాస్త తక్కువ నూనె గా వాడతాం. అనుకోకుండా, నూనె ఎక్కువగా పడే అవకాశమే ఉండదు. మనం కూరకు పోపు లేదా తాలింపు వేసేటప్పుడు పోపు గింజలు మాడిపోకుండా ఉండటానికి మనం ఎక్కువ నూనెలు వాడుతూ ఉంటాం. కానీ, అలా జరగకుండా ఉండేందుకు సింపుల్ చిట్కా వాడొచ్చు. తాలింపు వేసేటప్పుడు నూనె చాలా తక్కువగా వేసి, గింజలు చిటపటలాడాక కొద్దిగా నీటిని చిలకరించండి. ఇలా చేయడం వల్ల మసాలాలు మాడిపోవు, పైగా నూనె తక్కువైనా మసాలా సువాసన, రుచి వంటకానికి బాగా పడతాయి. కర్రీలు, కూరలు లేదా పులుసులు వండిన తర్వాత పైభాగంలో నూనె తేలుతూ కనిపిస్తుంది. వంట పూర్తయి సర్వ్ చేసే ముందు, పైన

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. CPS Pension Issue: ముప్పై నుంచి ముప్పై ఐదేళ్ల పాటు తమ జీవితంలోని అత్యంత విలువైన సమయాన్ని ప్రభుత్వ సేవకే అంకితం చేసిన ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత సీపీఎస్ వల్ల తీవ్రంగా నష్టపోతున్నారు. రిటైర్మెంట్ అనంతరం ప్రశాంతంగా, గౌరవంగా బతకాలన్న ప్రతి ఉద్యోగి ఆశలను కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) అట్టడుగుకు తొక్కిపారేస్తోంది. ఐదేళ్ల పాటు పదవిలో ఉండి దిగిపోయే ఎంపీలు, ఎమ్మెల్యేలకు వేలల్లో పెన్షన్లు, అలవెన్సులు కల్పించుకుంటున్న పాలకులు... జీవితాంతం ప్రజాసేవలో తరించిన ఉద్యోగికి మాత్రం రిటైర్మెంట్ తర్వాత కనీస అవసరాలు తీర్చలేని పెన్షన్ ఇస్తూ చీకటిలోకి నెట్టేస్తున్నారు. ఇటీవల పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో వెలుగుచూసిన ఒక ఘటన సీపీఎస్ ఉద్యోగుల పాలిట ఎంతటి నరకమో కళ్లకు కడుతోంది. ఏపీ ప్రభుత్వం ప్రతినెలా పేదలు, వృద్ధులకు ఇచ్చే సామాజిక భద్రతా పెన్షన్ నెలకు రూ. 4,000 కాగా, సుదీర్ఘ కాలం పాటు ప్రభుత్వంలో వివిధ హోదాల్లో పనిచేసి రిటైర్ అయిన ఒక సీపీఎస్ ఉద్యోగి చేతికి వస్తున్న నెలవారీ పెన్షన్ కేవలం రూ. 3,882 మాత్రమే... ఏ సమస్యా లేకుండా ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే సామాజిక పింఛను కంటే, ముప్పై ఏళ్లు చెమటోడ్చి సేవ చేసిన ఉద్యోగికి వచ్చే పింఛను తక్కువగా ఉందంటే... ఈ దేశంలో ప్రభుత్వ ఉద్యోగి అదృష్టవంతుడా...లేక దౌర్భాగ్య స్థితిలో ఉన్నాడా అనేది నిర్ణయించే విచక్షణ పాలకులకే వదిలేయాలని ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఎదురైన ఈ దారుణమైన పరిస్థితిని ఉదాహరణగా చూపిస్తూ తెలంగాణలోని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర దిగ్భ్రాంతి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రేపు తమకు కూడా రిటైర్మెంట్ తర్వాత ఇదే
టీవీలో వినోదం అనేది ఎప్పుడూ దొరుకుతూనే ఉంటుంది. ఏ టైంలో అయినా సరే ఏ ఛానెల్ పెట్టినా బుల్లితెరపై ఛానెల్స్‌లో ఏదో ఒక సినిమా వస్తూనే ఉంటుంది. అలా బుల్లితెరపై 24 గంటలు వినోదానికి అయితే కొరత ఉండదు. ఇంట్లో ఉండే వారికి, మహిళలకు బుల్లితెర అనేది రిలాక్స్, ఎంటర్టైన్మెంట్ మోడ్‌ను ఇస్తుంది. ఇక రేపు అంటే గురువారం అన్ని ఛానెల్స్‌లో ప్రసారం అయ్యే సినిమాల లిస్ట్ ఓ సారి చూద్దాం.డీడీ యాదగిరి చానెల్లో మధ్యాహ్నం రెండు గంటలకు ఉడతా ఉడతా ఊచ్ రానుంది. ఈటీవీ ప్లస్‌లో రాత్రి తొమ్మిదిన్నరకి మీ శ్రేయోభిలాషి రానుంది. ఈటీవీలో మధ్యాహ్నం 12 గంటలకు, రాత్రి పదిన్నరకి సందడే సందడి రానుంది. ఈటీవీ సినిమాలో ఏడు గంటలకు ఓ చినదాన, ఉదయం 10 గంటలకు జగదేకవీరుని కథ, ఒంటి గంటకు మహానగరంలో మాయగాడు, సాయంత్రం నాలుగు గంటలకు మా ఆవిడ కలెక్టర్, ఏడు గంటలకు బలరామకృష్ణులు, రాత్రి పది గంటలకు గుండా, మిడ్ నైట్ ఒంటి గంటకు మళ్లీ ఓ చినదాన మూవీని రిపీట్ మోడ్‌లోనే ప్రసారం చేయనున్నారు.జెమినీ లైఫ్‌లో ఉదయం 11 గంటలకు 1940లో ఒక గ్రామం, సాయంత్రం నాలుగున్నరకి జగపతి చిత్రాలు రానున్నాయి. జెమిని టీవీలో ఉదయం 9 గంటలకు సాంబ, మూడు గంటలకు రచ్చ రానున్నాయి. జెమినీ మూవీస్‌లో మిడ్ నైట్ ఒకటిన్నరకి స్వప్నలోకం, ఉదయం నాలుగున్నరకి అందరూ దొంగలే, ఉదయం ఏడు గంటలకు రావుగారిల్లు, పది గంటలకు బిల్లా, ఒంటి గంటకు లోఫర్, నాలుగు గంటలకు పూలరంగడు, ఏడు గంటలకు సీమసింహం, రాత్రి పది గంటలకు వేటగాడు ప్రసారం కానున్నాయి.జీ తెలుగులో ఉదయం 9 గంటలకు నువ్వులేక నేనులేను, సాయంత్రం ఐదు గంటలకు పిండం రానున్నాయి. జీ సినిమాలు ఛానెల్లో ఉదయం 7 గంటలకు స్టూడెంట్ నెంబర్ 1, 9 గంటలకు మిస్టర్ మజ్ను, 12 గంటలకు హనుమాన్, 3 గంటలకు రంగ్

Gold, Silver Prices: బంగారం, వెండి ధరల తగ్గింపు పర్వం కొనసాగుతోంది. గతంలో పరుగులు పెట్టిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు రికార్డు స్థాయిలో దిగి వస్తున్నాయి. దీంతో మహిళలకు భారీ ఊటర కలిగిస్తున్నాయి. బంగారం, వెండి ధరలు తగ్గుముఖంపై వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ తగ్గింపు దోరణి ఇలాగే కొనసాగితే బాగుండని కోరుతున్నారు. ప్రస్తుతం సెస్టెంబర్ 2న భారీగా తగ్గింది. తులం బంగారంపై ఏకంగా 2,070 రూపాయలు తగ్గింది. వెండిపై 5 వేల రూపాయలు తగ్గింది. సెప్టెంబర్ ఆరంభంలో బంగారం, వెండి ధరలు గణనీయంగా తగ్గాయి. ఆభరణాల వ్యాపారుల ప్రకారం.. సెప్టెంబర్ 2వ తేదీన 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,52,020గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,39,350 వద్ద ట్రేడవుతోంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. ఆగస్ట్ 24న 1,63,970 ఉండగా, ప్రస్తుతం 1,52,020 వద్ద కొనసాగుతోంది. అలాగే మొత్తంగా 11,950 వరకు తగ్గింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,53,400గా ఉండగా, సెప్టెంబర్ 2 నాటికి 10 గ్రాములకు అది రూ.1,39,350కు పడిపోయింది. అలాగే18 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.1,22,930 నుండి రూ.1,14,020కి పడిపోయింది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడలలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,070 తగ్గి రూ.1,52,020 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.1,900 తగ్గి రూ.1,39,350 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.1,550 తగ్గి రూ.1,14,020 గా నమోదైంది. వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. ఆగస్టు 24న గ్రాము వెండి ధర రూ.260 ఉండగా, సెప్టెంబర్ 2 నాటికి అది గ్రాముకు రూ.245కు పడిపోయింది. అంటే, సుమారు వారం రోజుల్లో వెండి ధర గ్రాముకు రూ.15 మేర తగ్గిందని
30 ఏళ్ల వయసు దాటిన తర్వాత ఎముకలు బలహీనపడుతూ వస్తాయి. దీంతో తరచూ ఎముకల నొప్పి వేధిస్తుంది. ఇలా జరగకుండా ఉండాలంటే కాల్షియం, విటమిన్ డి వంటి పోషకాలు ఎక్కువగా ఉండే గింజలు, విత్తనాలు డైట్లో చేర్చుకోవడం చాలా అవసరం. ఈ నేపథ్యంలో 30 ఏళ్లలోనూ ఎముకలను బలంగా ఉంచే ఆ గింజలు ఏంటో తెలుసుకుందాం. అన్ని గింజలతో పోలిస్తే బాదం గింజల్లో కాల్షియం, మెగ్నీషియం చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వయసు పెరిగినా ఎముకలు బలంగా ఉండాలంటే రోజూ నాలుగైదు బాదం గింజలు నానబెట్టి తినడం చాలా మంచిది. గుమ్మడి గింజల్లో మెగ్నీషియం, ఫాస్పరస్ ఎక్కువగా లభిస్తాయి. రోజూ గుప్పెడు గుమ్మడి గింజలు తినడం ద్వారా ఎముకలు పెలుసుబారకుండా చూసుకోవచ్చు. నువ్వుల్లో ఎముకల బలానికి సహాయపడే కాల్షియం, జింక్ ఎక్కువగా లభిస్తాయి. అందుకే పిల్లలతో పాటు పెద్దలు ఎముకలు బలానికి నువ్వులతో చేసిన ఆహారాలు తినడం చాలా మంచిది. చియా సీడ్స్‌లో కాల్షియంతో పాటు ఫాస్పరస్, ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎముకల బలాన్ని పెంచడంలో సహాయపడతాయి. వాల్‌నట్స్‌లో హెల్తీ ఫ్యాట్స్, మెగ్నీషియం మెండుగా ఉంటాయి. ఇవి ఎముకల బలాన్ని పెంచుతాయి. ఆస్టియోపోరోసిస్ రాకుండా కాపాడుతాయి. అవిసె గింజల్లో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో ఇంఫ్లమేషన్ తగ్గించి ఎముకలను బలంగా ఉంచుతాయి. పిస్తా గింజల్లో విటమిన్ బి6, పొటాషియం వంటి పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. రోజూ గుప్పెడు పిస్తా గింజలు తింటే ఎముకలను బలంగా ఉంచుకోవచ్చు. పొద్దుతిరుగుడు గింజల్లో మెగ్నీషియం, కాపర్, విటమిన్ ఇ వంటి ఆవశ్యక పోషకాలు ఉంటాయి. ఇవి ఎముకలను హెల్తీగా ఉంచుతాయి
13 Year Old AI App Developer Zhu Shuhan : సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించాలంటే విపరీతమైన కోడింగ్ నైపుణ్యాలు ఉండాల్సిన అవసరం లేదని, మంచి ఆలోచన ఉంటే కృత్రిమ మేధ (ఏఐ)తో అద్భుతాలు సృష్టించవచ్చని నిరూపించింది ఓ 13 ఏళ్ల పాఠశాల విద్యార్థిని. చైనాకు చెందిన ఝూ షుహాన్ అనే 13 ఏళ్ల చిన్నారి ఒక్క లైన్ కోడింగ్ కూడా రాయకుండానే ఒక వినూత్నమైన ఏఐ స్టడీ అసిస్టెంట్ యాప్‌ను తయారుచేసి అందరినీ ఆశ్చర్య పరిచింది. తన ఆలోచనతో తయారుచేసిన ఈ ఉత్పత్తులను విక్రయించడం ద్వారా కేవలం మూడు రోజుల వ్యవధిలోనే 18,000 యువాన్లు (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.2.5 లక్షలకు పైగా) అర్జించి సంచలనం సృష్టించింది.'వర్చువల్ పేరెంట్' యాప్ వెనుక అసలు కథ ఇదే..!ఝూ షుహాన్ రూపొందించిన ఈ డిజిటల్ అప్లికేషన్‌కు 'జై చాంగ్' అని నామకరణం చేసింది. ఇంగ్లీష్‌లోకి దాన్ని అనువదిస్తే 'ఆన్ సైట్' అంటే అందుబాటులో ఉండటం అని అర్థం వస్తుంది. తల్లిదండ్రులు తమ పిల్లలు చదువుకునే సమయంలో వారిపై నిఘా ఉంచడాన్ని, పర్యవేక్షించడాన్ని సులభతరం చేసేందుకు ఈ యాప్ ఎంతో తోడ్పడుతుంది. పిల్లలు తమ ఫోటోను అప్లోడ్ చేసిన వెంటనే.. ఈ యాప్ ఒక 'వర్చువల్ పేరెంట్' లేదా 'డిజిటల్ పేరెంట్ క్లోన్' రూపంలో మారి బాధ్యతలు స్వీకరిస్తుంది.విద్యార్థి తన చదువును పక్కన పెట్టి మొబైల్ ఫోన్‌తో ఆడుకుంటున్నా లేదా తను కేటాయించిన స్థానాన్ని వదిలి పక్కకు వెళ్లినా.. కెమెరా సాంకేతికత ద్వారా పసిగట్టి తక్షణమే తల్లిదండ్రులకు హెచ్చరిక సందేశాలను పంపుతుంది. "నా తల్లిదండ్రులు నిరంతరం ఉద్యోగ వ్యాపారాల్లో బిజీగా ఉండటం వల్ల నేను చదువుకునే సమయంలో నా పక్కన ఉండేందుకు సమయం దొరికేది కాదు. దాంతో హోమ్‌వర్క్ చేసే సమయంలో దారితప్పి రహస్యంగా ఫోన్ వాడేదాన్ని. నా తోటి విద్యార్థుల్లో చాలామంది స్వయం క్రమశిక్షణ లేక ఇదే విధమైన సమస్య ఎదుర్కొంటున్నారు. అందుకే

సోషల్ మీడియా ద్వారా మొదలైన పరిచయం.. ప్రేమగా మారింది. ఆ తర్వాత పెళ్లి హామీ.. చివరకు అది భారీ మోసంగా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన యువతిని ప్రేమ పేరుతో నమ్మించి, పెళ్లి చేసుకుంటానంటూ శారీరకంగా దగ్గరైన ఓ యువకుడు మాస్టర్ ప్లాన్ వేశాడు.. ఆమెతో పాటు ఆమె తల్లి నుంచి రూ.34 లక్షలు తీసుకుని మోసం చేసిన ఘటన హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. ఆ తర్వాత ప్రేమ, పెళ్లి పేరుతో నమ్మకం కలిగించిన యువకుడు.. ఈ విధంగా భారీ మోసానికి తెరలేపినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఎన్. చందు అనే వ్యక్తి ఇన్స్టాగ్రామ్ ద్వారా బాధిత యువతితో పరిచయం పెంచుకున్నాడు. కొద్దికాలానికే ప్రేమిస్తున్నానని, త్వరలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెతో సన్నిహిత సంబంధం కొనసాగించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.. ఈ క్రమంలోనే.. ప్రేమను ఆసరాగా చేసుకున్న చందు.. తన వ్యాపారాన్ని విస్తరించేందుకు అత్యవసరంగా డబ్బులు కావాలని చెప్పి దశలవారీగా బాధితురాలు, ఆమె తల్లి నుంచి మొత్తం రూ.34 లక్షలు తీసుకున్నట్లు బాధితురాలు ఆధారాలతో పాటు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పెళ్లి తర్వాత అన్నీ సర్దుకుంటాయని నమ్మబలికి డబ్బులు తీసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. అప్పటికే పెళ్లైన వ్యక్తి.. నిజం దాచిపెట్టాడా?.. దర్యాప్తులో కీలకంగా మారిన అంశం ఏమిటంటే.. చందు అప్పటికే మరో మహిళను వివాహం చేసుకున్నాడని, ఆ విషయాన్ని పూర్తిగా దాచిపెట్టి బాధితురాలితో ప్రేమ వ్యవహారం కొనసాగించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయాన్ని బాధితురాలు తర్వాత తెలుసుకున్నట్లు పోలీసుల ముందు వెల్లడించింది. తనను మోసం చేశారని తెలుసుకున్న బాధితురాలు చందును నిలదీయగా, ఆమెపై దాడి చేసి దుర్భాషలాడడంతో పాటు బెదిరింపులకు పాల్పడినట్లు ఫిర్యాదు చేయడంతో దీంతో బాధితురాలు పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డబ్బు లావాదేవీలకు

పర్వతారోహణ చేయాలన్న కోరిక చాలామందికి ఉంటుంది. కానీ కెరీర్ బిజీ, కుటుంబ బాధ్యతలు, ఇది సరైన వయసు కాదేమోనన్న సందిగ్ధత.. ఇలా వివిధ కారణాల వల్ల కొంతమంది ఈ కలను నెరవేర్చుకోలేకపోతారు. నిజానికి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇవేవీ అడ్డు కాదంటోంది శివానీ మెహ్రోత్రా. పర్వతారోహణ చేయాలన్న కోరిక చాలామందికి ఉంటుంది. కానీ కెరీర్ బిజీ, కుటుంబ బాధ్యతలు, ఇది సరైన వయసు కాదేమోనన్న సందిగ్ధత.. ఇలా వివిధ కారణాల వల్ల కొంతమంది ఈ కలను నెరవేర్చుకోలేకపోతారు. నిజానికి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇవేవీ అడ్డు కాదంటోంది శివానీ మెహ్రోత్రా. నాలుగు పదుల వయసుకి చేరువలో ఉన్నప్పుడు మౌంటెనీరింగ్‌పై ఆసక్తి పెంచుకున్న ఆమె.. ఇటీవలే తన 43 ఏళ్ల వయసులో యూరప్‌లోనే ఎత్తైన పర్వతం మౌంట్ ఎల్బ్రస్ను అధిరోహించింది. తద్వారా ‘వయసు సంఖ్య మాత్రమే’ అని నిరూపించి వార్తల్లో నిలిచింది. మరి, వృత్తిరీత్యా యోగా టీచర్ అయిన శివానీకి పర్వతాహరోణ చేయాలన్న ఆలోచన ఎలా కలిగింది? తెలుసుకుందాం రండి.. నిద్ర లేచింది మొదలు ఇంట్లో బాధ్యతలు, కెరీర్ బిజీలో పడిపోయి.. తమ అభిరుచుల్ని సైతం పక్కన పెట్టేస్తుంటారు చాలామంది మహిళలు. కానీ కొందరు మాత్రం కాస్త లేటు వయసులోనైనా వీటిపై దృష్టి పెడుతూ తమను తాము నిరూపించుకుంటారు.. ఇతరులకు స్ఫూర్తినిస్తుంటారు. శివానీ కూడా ఇదే కోవకు చెందుతుంది. ఉత్తరప్రదేశ్ సీతాపుర్‌కు చెందిన ఆమె.. వివాహం తర్వాత లక్నోలో స్థిరపడింది. పెళ్లయ్యాక గృహిణిగా, అమ్మగా బిజీగా మారిపోయింది. స్వతహాగా ఫిట్నెస్ లవర్ అయిన ఆమె.. సాహసాలు చేయడానికీ మక్కువ చూపుతుంది. ఈ ఇష్టమే తనను పర్వతారోహణ వైపు అడుగులేసేలా చేసిందంటోంది శివానీ. ‘ఓసారి స్నేహితులతో కలిసి మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కి ట్రెక్కింగ్‌కి వెళ్లా. అప్పుడే నాకు పర్వతారోహణ పరిచయమైంది. ఈ అనుభవాన్ని ఎంతో ఎంజాయ్ చేశా. ఇక ముందూ మౌంటెనీరింగ్ చేయాలన్న కోరిక నాలో మొదలైంది. ఈ క్రమంలోనే కశ్మీర్, లద్దాఖ్, హిమాచల్‌ప్రదేశ్‌లోని పలు

ముందుగా ప్రకటించినట్టు ఈ నెల 31న 'సిగ్మా'ను విడుదల చేయడానికి మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ద్వారా విజయ్ తనయుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తనయుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా అరంగేట్రమ్ చేస్తున్న సినిమా 'సిగ్మా'. సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. ఇదే నెల 31న ఈ సినిమా విడుదల కాబోతోంది. తాజాగా డబ్బింగ్ పూర్తయ్యిందని, మిగిలిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోందని మేకర్స్ తెలిపారు. ఈ సందర్భంగా లైకా ప్రొడక్షన్స్ ప్రతినిధి జి.కె.ఎం. తమిళ్ కుమరన్ మాట్లాడుతూ, 'సినిమా ఇప్పుడు ఫైనల్ షేప్ తీసుకుంటుండటం మాకు ఎంతో సంతృప్తిని ఇస్తోంది. జేసన్ సంజయ్‌ను దర్శకుడిగా పరిచయం చేయడం మా కోసం ఎంతో ప్రత్యేకమైన అనుభవం. ఇది ఆయన తొలి చిత్రం అయినప్పటికీ, ప్రతి దశలో ఆయన చూపించిన స్పష్టత, నమ్మకం, క్రమశిక్షణ, అనుభవజ్ఞుడైన దర్శకుడిని తలపించాయి. సందీప్ కిషన్‌తో పాటు నటీనటులు, సాంకేతిక నిపుణులు, చిత్ర బృందం అందరూ ఎంతో అంకితభావంతో పనిచేశారు' అని అన్నారు. దర్శకుడు జేసన్ సంజయ్ మాట్లాడుతూ, 'డబ్బింగ్ పూర్తి కావడం మా ప్రయాణంలో ఎంతో సంతృప్తినిచ్చే మైలురాయి. ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు 'సిగ్మా'ను తీసుకురావడానికి మరో అడుగు దగ్గరయ్యాం. నా విజన్‌ను నమ్మి, పూర్తి సృజనాత్మక స్వేచ్ఛ ఇచ్చిన మా నిర్మాత సుభాస్కరన్ సర్, జి.కె.ఎం. తమిళ్ కుమరన్ సర్, లైకా ప్రొడక్షన్స్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు. వారి ప్రోత్సాహం వల్లనే నేను అనుకున్న విధంగా ఈ సినిమాను తెరకెక్కించగలిగాను. త్వరలోనే ట్రైలర్ ను విడుదల చేస్తాం' అని అన్నారు. రాజు సుందరం, సంపత్ రాజ్, శివ్ పండిట్, అన్బు థాసన్, యోగ్ జాపీ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ ఎస్ సంగీతం అందిస్తుండగా

ఫీచర్ ఫోన్లలో ఇంటర్నెట్ లేకుండా యూపీఐ పేమెంట్లు ఫోన్‌పే UPI 123Pay సర్వీసును ప్రారంభించిన ఫోన్‌పే 20 కోట్లకు పైగా ఫీచర్ ఫోన్ కస్టమర్లకు భారీ బెనిఫిట్స్ PhonePe UPI : స్మార్ట్ ఫోన్ అక్కర్లేదు.. ఇంటర్నెట్ అంతకన్నా అవసరం లేదు.. చేతిలో ఫీచర్ ఫోన్ ఉన్నా చాలు.. ఇకపై ఈజీగా యూపీఐ పేమెంట్లు ఈజీగా చేసుకోవచ్చు. ఇంటర్నెట్ సరిగా లేని ప్రాంతాల్లో కూడా ఈజీగా ఫాస్ట్ యూపీఐ పేమెంట్లు చేయొచ్చు. స్మార్ట్ ఫోన్ లేని ఫీచర్ ఫోన్ యూజర్ల కోసం ఈ కొత్త సర్వీసు అందుబాటులోకి వచ్చింది. అదే.. ఫోన్‌పే కొత్త యూపీఐ సర్వీసు (123Pay).. ఈ సర్వీసు ద్వారా ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ఫీచర్ ఫోన్లలో అందుబాటులోకి వచ్చింది. కంపెనీ ప్రకారం.. SMS ద్వారా మాత్రమే యూపీఐ పేమెంట్లు చేయొచ్చు. డబ్బు పంపడానికి లేదా మర్చంట్ పేమెంట్లు చేసేందుకు ఇకపై ఇంటర్నెట్ అవసరం ఉండదు. ఇప్పటికీ ఫీచర్ ఫోన్లను వాడేవారికి లేదా ఇంటర్నెట్ కనెక్టివిటీ సరిగా లేని ప్రాంతాలలో నివసించే వారికి ఈ ఫీచర్ అద్భుతంగా ఉంటుంది. ఫోన్‌పే (PhonePe UPI 123Pay) ప్రకారం.. భారత్‌లో 20 కోట్లకు పైగా ఫీచర్ ఫోన్ యూజర్లు ఉన్నారుఈ కొత్త సర్వీసు ద్వారా యూపీఐ సిస్టమ్ మరింత అందుబాటులోకి రానుంది. యూపీఐతో పేమెంట్లు : ఫోన్‌పే యూపీఐ 123పే ద్వారా ఒకరి నుంచి మరొకరికి డబ్బు పంపుకోవచ్చు. మర్చంట్లకు పేమెంట్లు చేయడం, బ్యాంకు బ్యాలెన్స్‌లను తనిఖీ చేయడం, గత లావాదేవీల వివరాలను చూడటం వంటి అనేక ముఖ్యమైన పనులను చేసుకోవచ్చు. భవిష్యత్తులో బిల్లు చెల్లింపులు, మొబైల్ రీఛార్జ్‌లు, ఆధార్ ఆధారిత యూపీఐ రిజిస్ట్రేషన్లను కూడా ఈ సర్వీసులను చేర్చాలని కంపెనీ యోచిస్తోంది. ఏ ఫీచర్ ఫోన్లకు సపోర్టు : ప్రస్తుతం ఫోన్‌పే ఈ సర్వీసు కొన్ని ఎంపిక చేసిన ఫీచర్ ఫోన్లలో లభిస్తోంది. HMD 105 2G, HMD 110 2G, నోకియా
Bonus Ceiling Limit: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దసరా ధమాకా అందనుందా?అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. దసరా, దీపావళి పండగల సీజన్ సమీపిస్తున్న వేళ భారీ ఆర్థిక ప్రయోజనం చేకూరే అవకాశం కనిపిస్తోంది. నేషనల్ కౌన్సిల్ ఫర్ జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ (NC-JCM) కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల బోనస్ లెక్కించే గరిష్ట పరిమితిని పెంచాలని డిమాండ్ చేసింది. ప్రస్తుతం ఉన్న రూ.7000 నుంచి రూ.21000లకు పెంచాలని ప్రభుత్వానికి డిమాండ్ చేసింది. ఈ మేరకు ఎన్సీ-జేసీఎం సెక్రెటరీ శివ గోపాల్ మిశ్రా కేబినెట్ సెక్రెటరికీ లేఖ రాశారు. ఆ లేఖలోని ముఖ్యమైన అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.ఇటీవల కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఉద్యోగుల కనీస వేతనాన్ని రూ.21 వేలుగా నిర్ణయించారు. చట్టం ప్రకారం బోనస్ లెక్కించే పరిమితి రూ.7000 లేదా ప్రభుత్వం నిర్ణయించిన కనీస వేతనం వీటిలో ఏది ఎక్కువైతే దాని ఆధారంగా ఉండాలి. ఇదే విషయాన్ని ఉద్యోగుల జేఏసీ డిమాండ్ చేసింది. మే, 2026లో జరిగిన 49వ జేసీఎం సమావేశంలో బోనస్ చట్టంలో మార్పుల ఆధారంగా పరిమితి పెంపును పరిశీలిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఆగస్టు 25, 2026న వెలువడిన ప్రభుత్వ నోటిఫికేషన్ నవంబర్ 21, 2026 నుంచి అమలులోకి వచ్చేలా అమలు చేస్తుండడంతో ఈ పెంపును తక్షణమే వర్తింపజేయాలని జేఏసీ కోరింది. లేదా అక్టోబర్ 20, 2026న వచ్చే దసరా పండుగకు ముందే దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయాలని అభ్యర్థించింది.ఎవరికి లబ్ధిసాధారణంగా లెవెల్ 8 వరకు ఉండే నాన్ గెజిటెడ్, సీ-గ్రేడ్, బీ- గ్రేడ్ ఉద్యోగుకు ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ లేదా అడ్ హాక్ బోనస్ లభిస్తుంది. బోనస్ పరిమితి రూ.21000లకు పెంచితే ఈ కేటగిరీల్లోని ఉద్యోగులందరికీ లబ్ధి చేకూరనుంది. ఒక్కసారిగా బోనస్ మూడు రెట్లు పెరగనుంది. ప్రస్తుతం సాధారణంగా 30.4 రోజుల సగటు ఆధారంగా 60 రోజులు లేదా 70 రోజుల

తెలంగాణను గ్లోబల్ నాలెడ్జ్ హబ్ గా మార్చే లక్ష్యంతో తెలంగాణా ప్రభుత్వం కీలక అడుగులు వేస్తుంది. ఈ మేరకు ప్రభుత్వ లక్ష్య సాధనకు విద్యార్థుల మెరుగైన విద్యా, ఉద్యోగ అవకాశాల కోసం రాష్ట్ర విశ్వవిద్యాలయాలు విదేశీ ఉన్నత విద్యాసంస్థలతో వేగంగా అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. ఇటీవల వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జర్మనీకి చెందిన ప్రతిష్ఠాత్మక రూట్లింగెన్ యూనివర్సిటీతో కీలక ఒప్పందాలు చేసుకుంది.జర్మనీ యూనివర్సిటీతో కాకతీయ విశ్వవిద్యాలయం ఒప్పందం ఈ ఒప్పందాల ద్వారా 3+2 విద్యా నమూనా ప్రవేశపెట్టారు. విద్యార్థులు మొదటి మూడేళ్ల డిగ్రీని స్థానిక విశ్వవిద్యాలయాల్లో పూర్తి చేసి, తర్వాత రెండేళ్ల మాస్టర్స్ కోర్సును జర్మనీలో అభ్యసిస్తారు. కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్, డిజిటల్ బిజినెస్ మేనేజ్మెంట్ వంటి కోర్సుల్లో విద్యార్థులకు ఈ మేరకు అవకాశాలు ఉన్నాయి. కోర్సు పూర్తయిన తర్వాత జర్మనీ విశ్వవిద్యాలయమే మాస్టర్స్ డిగ్రీ అందిస్తుంది.ఏటా 20మంది విద్యార్థులు రూట్లింగెన్ యూనివర్సిటీలో మాస్టర్స్ ఈ విధానంలో కాకతీయ యూనివర్సిటీ నుంచి ఏటా 20 మంది విద్యార్థులు ఎంపికవుతారు. ఇంతకు ముందు తెలంగాణ ఉన్నత విద్యా శాఖ బృందం జర్మనీలోని RWTH ఆచెన్, ఆస్ట్ఫాలియా, గొట్టింగెన్ విశ్వవిద్యాలయాలను సందర్శించి లెటర్స్ ఆఫ్ ఇంటెంట్ మార్పిడి చేసుకుంది. విద్యార్థి-అధ్యాపకుల మార్పిడి, ఉమ్మడి పరిశోధనలు, డ్యూయల్ డిగ్రీలు తదితర అంశాలపై కీలక నిర్ణయాలను తీసుకుని తదనుగుణంగా చేసిన ప్లాన్ కు ఓకే అన్నారు.పలు విదేశీ యూనివర్సిటీలు హైదరాబాద్ లో ఆఫ్‌షోర్ క్యాంపస్లుఅంతేకాదు బోస్టన్ లోని నార్త్ఈస్టర్న్ యూనివర్సిటీ , యూనివర్సిటీ ఆఫ్ లండన్ హైదరాబాద్‌లో ఆఫ్‌షోర్ క్యాంపస్‌లు ఏర్పాటు చేయనున్నాయి. హార్వర్డ్, ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్, ఎంఐటీ, ఎల్ఎస్ఈ వంటి ప్రముఖ సంస్థలతో కూడా వివిధ యూనివర్సిటీలతో చర్చలు సాగుతున్నాయి. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ జపాన్‌లోని హిరోషిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.తెలంగాణ ఆర్టీసీ మరో కీలకనిర్ణయం.. మెట్రో రైళ్ళ తరహాలో బస్సుల్లో కూడా..!

భారతీయ సినిమా ఎనీ టైం గర్వించదగ్గ దర్శకుడు మణిరత్నం. ఆయన దర్శక మార్క్ ఎప్పుడూ ప్రత్యేకమే. సెన్సిటివ్ ఎమోషన్స్, విజువల్ వండర్స్ తో ప్రేక్షకుల హృదయాలని కొల్లగొట్టడంలో దిట్ట. ప్రెజెంట్ యుగంలో రావాల్సిన కధాంశంతో కూడిన చిత్రాలని ఇరవై ఏళ్ళ క్రితమే తెరకెక్కించాడు. ప్రస్తుతం వర్సటైల్ నటుడు 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి, నాచురల్ బ్యూటీ సాయిపల్లవి జంటగా చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని రాబోయే 2027 పొంగల్ (సంక్రాంతి) కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీగా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. రీసెంట్గా విడుదలైన లీక్డ్ పిక్చర్స్, వేగంగా జరుగుతున్న షూటింగ్ స్పీడ్ చూస్తుంటే ప్రేక్షకులకి ఈ మూవీ ఒక మరపురాని అనుభూతిని అందించబోతోందని స్పష్టమవుతోంది. విజయ్ సేతుపతి యాక్టింగ్, సాయిపల్లవి సహజ నటన, మణిరత్నం టేకింగ్, రెహమాన్ సంగీతం కలగలిసిన ఈ ఎమోషనల్ డ్రామా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి! ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. చిత్ర బృందం కోల్‌కతాలోని ప్రసిద్ధ హౌరా బ్రిడ్జి పరిసర ప్రాంతాల్లో దాదాపు 10 రోజుల పాటు మొదటి షెడ్యూల్‌ని పూర్తి చేసుకోగా అక్కడ విజయ్ సేతుపతి, సాయిపల్లవిలపై చిత్రీకరించిన లీక్డ్ పిక్చర్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 2018లో వచ్చిన విజయ్ సేతుపతి క్లాసిక్ హిట్ '96' వైబ్స్‌ను ఈ లీక్డ్ పిక్చర్స్ గుర్తుచేస్తున్నాయంటూ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. కోల్‌కతా షెడ్యూల్ తర్వాత తదుపరి చిత్రీకరణ పుదుచ్చేరిలో జరుపుకోవడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేసింది. సాధారణంగా భారీ సినిమాల చిత్రీకరణకి నెలల తరబడి సమయం పడుతుంది, కానీ మణిరత్నం మాత్రం 40 రోజుల్లోనే పూర్తి చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. మద్రాస్ టాకీస్ మరియు లైకా ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా అత్యున్నత నిర్మాణ విలువల తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ విజువల్ మ్యాజిక్కు ఆస్కార్ విజేత ఎ.ఆర్. రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. మణిరత్నం-రెహమాన్ కాంబినేషన్

ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో కొత్త జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటుతో పాటు రాష్ట్రంలో మరో ఎయిమ్స్‌ను ఏర్పాటు చేసేందుకు అవసరమైన బడ్జెట్ సహాయం అందించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఎంపీ లింగమనేని రమేశ్ కోరారు. ఢిల్లీ, సెప్టెంబర్ 1: ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో కొత్త జవహర్ నవోదయ విద్యాలయాల(జేఎన్వీ) ఏర్పాటుతో పాటు రాష్ట్రంలో మరో ఎయిమ్స్‌ను ఏర్పాటు చేసేందుకు అవసరమైన బడ్జెట్ సహాయం అందించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఎంపీ లింగమనేని రమేశ్ కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రికి వినతిపత్రం సమర్పించారు. ఏపీలో ప్రస్తుతం 28 జిల్లాలు ఉండగా 15 జిల్లాల్లో మాత్రమే నవోదయ విద్యాలయాలు మంజూరైనట్లు తెలిపారు. గ్రామీణ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు నాణ్యమైన రెసిడెన్షియల్ విద్యను అందించడంలో నవోదయ విద్యాలయాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. 2024 డిసెంబర్లో కేంద్ర మంత్రివర్గం ఐదేళ్ల కాలానికి రూ.2,359.82 కోట్ల అంచనా వ్యయంతో దేశవ్యాప్తంగా 28 కొత్త జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు ఆమోదం తెలిపిందని ఎంపీ గుర్తుచేశారు. అదే ప్రాతిపదికన ఏపీలో మిగిలిన 13 జిల్లాల్లో జేఎన్వీల ఏర్పాటుకు ఐదేళ్ల కాలంలో సుమారు రూ.1,096 కోట్ల మేర నిధుల అవసరం ఉంటుందని తెలిపారు. నవోదయ విద్యాలయాల ఏర్పాటుతో పాటు తగిన బడ్జెట్ కేటాయింపులు చేయాలని ఆర్థిక మంత్రిని కోరారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌లో రెండో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) ఏర్పాటు చేయాలని ఎంపీ కోరారు. 2014లో పునర్వ్యవస్థీకరించిన రాష్ట్రంలో జాతీయ స్థాయి విద్యా, వైద్య సంస్థలను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని గుర్తించారని, దాని ఫలితంగా మంగళగిరిలో ఎయిమ్స్ ఏర్పాటైందని వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు వైద్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరో రెండు ఎయిమ్స్‌లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. తద్వారా అత్యున్నత వైద్య సేవలు మరింత అందుబాటులోకి రావడంతో పాటు సూపర్

భారత చరిత్రలో మైలురాయిగా నిలిచిన సిమ్లా ఒప్పందం జరిగి 2026 జులై 2 నాటికి సరిగ్గా 54 ఏళ్లు పూర్తయ్యాయి. 1971లో భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య జరిగిన భీకర యుద్ధం ముగిసిన ఏడాది తర్వాత 1972 జులై 2న ఈ చారిత్రక ఒప్పందం కుదిరింది. అప్పట్లో భారత ప్రధానిగా ఉన్న ఇందిరా గాంధీ.. పాకిస్థాన్ తరఫున జుల్ఫికర్ అలీ భుట్టో ఈ చర్చలలో పాల్గొన సంతకాలు చేశారు. ఈ యుద్ధంలో పాకిస్థాన్‌ను భారత్ ఘోరంగా ఓడించడంతో అప్పటివరకు తూర్పు పాకిస్థాన్‌గా ఉన్న భూభాగం విముక్తి పొంది బంగ్లాదేశ్ అనే కొత్త దేశంగా ప్రపంచ పటంపై ఆవిర్భవించింది.గురుద్వారా కూల్చివేత: పాకిస్థాన్ చర్యపై భారత్ ఫైర్! 1971 యుద్ధంలో పాకిస్థాన్‌ను కోలుకోలేని దెబ్బకొట్టిన భారత సైన్యం ఏకంగా 93 వేల మంది పాక్ సైనికులను యుద్ధ ఖైదీలుగా బంధించింది. అంతే కాకుండా వ్యూహాత్మకంగా ప్రాధాన్యత కలిగిన పాకిస్థాన్‌కు చెందిన దాదాపు 15 వేల చదరపు కిలోమీటర్ల భూభూగాన్ని కూడా భారత్ తన ఆధీనంలోకి తీసుకుంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య తీవ్రస్థాయికి చేరిన ఉద్రిక్తతలను తగ్గించడానికి, శాంతిని నెలకొల్పడానికి సిమ్లా వేదికగా శాంతి చర్చలు ప్రారంభమయ్యాయి.ఈ ఒప్పందంలో భాగంగా భారత్ పెద్ద మనసుతో పాకిస్థాన్‌కు చెందిన 93 వేల మంది యుద్ధ ఖైదీలను సురక్షితంగా తిరిగి అప్పగించింది. అలాగే తాను స్వాధీనం చేసుకున్న 15 వేల చదరపు కిలోమీటర్ల పాక్ భూభాగాన్ని కూడా తిరిగి ఇచ్చేసింది. దీనికి ప్రతిగా ఇరు దేశాల మధ్య ఉన్న అన్ని వివాదాలను కేవలం ద్వైపాక్షిక చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని.. ఇందులో మధ్యవర్తిత్వానికి జోక్యం లేదని పాకిస్థాన్ అంగీకరించింది.భారత్ పై పాకిస్థాన్ న్యూక్లియర్ బాంబ్..? ఎంతకు తెగించార్రా..? సిమ్లా ఒప్పందం ద్వారానే 1971 యుద్ధం తర్వాత ఏర్పడిన కాల్పుల విరమణ రేఖను నియంత్రణ రేఖగా గుర్తించారు. ఒకరి సార్వభౌమాధికారాన్ని, ప్రాంతీయ సమగ్రతను మరొకరు గౌరవించుకోవాలని.. అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోకూడదని ఇరు

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. PRTUTS: పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యల పరిస్కారం కోరుతూ.. నేడు చలో హైదరాబాద్ కార్యక్రమం, ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా కార్యక్రమం చేపడుతున్నట్లు పీఆర్టీయూ రాష్ట్ర సంఘం వెల్లడించింది. 50వేల మందితో ఈ మహాధర్నా కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేండ్లు కావస్తున్నా..ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా పూర్తిస్థాయిలో అమలు కాలేదని టీచర్ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టో హామీల్లో సెంటీమీటర్ కదలిక కూడా లేదని ఆయన ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు 3 డీఏలు పెండింగ్ లో ఉంటేనే గగ్గోలో పెట్టారని.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో 6 డీఏలు పెండింగ్ పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. ఆ సమయంలో బకాయి బిల్లులు రూ.4,000 కోట్లుగా ఉండేవని, కానీ ఇప్పుడు అవి రూ.16,000 కోట్లకు చేరాయని అన్నారు. 4 నెలలుగా ఈహెచ్ఎస్ నిధులు కోత విధించినప్పటికీ, ఏ ఆసుపత్రిలోనూ హెల్త్ కార్డులు ఇప్పటికీ చెల్లడం లేదని ఆయన ఆరోపించారు. మేనిఫెస్టోలోని హామీలను, వాగ్దానాలను అమలు చేయడంలో విఫలమైనందుకు నిరసనగా మంగళవారం ఇందిరా పార్కులో "చలో హైదరాబాద్" అనే భారీ నిరసన చేపట్టనున్నట్లు పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పుల్గం దామోదర్ రెడ్డి ప్రకటించారు. ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల హక్కులు, భవిష్యత్తును కాపాడుకోవాలనే లక్ష్యంతో, పీఆర్టీయూ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు తెలంగాణలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు నేడు హైదరాబాద్‌లోని ఇందిరా పార్కులో భారీ నిరసన చేపట్టారు. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న తమ న్యాయబద్ధమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని

Madanapalle: మదనపల్లెలో ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పంపిణీపై ప్రత్యేక దృష్టి! Madanapalle: ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పథకం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందేలా కృషి చేస్తున్నట్లు 32వ వార్డు అధ్యక్షులు మండిపల్లి (జెసిపి) మధుసూదన్ రెడ్డి తెలిపారు. అర్హత ఉన్న లబ్ధిదారులకు పెన్షన్లు అందజేసి, వారి సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఎన్టీఆర్ పెన్షన్ భరోసా అందించడమే లక్ష్యమని, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తదితర అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు చేరేలా కృషి చేస్తామని తెలిపారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని, పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని చెప్పారు
'Tiger Nageswara Rao' చిత్రానికి క్రిటిక్స్ నుండి సగటున 3.0/5 రేటింగ్ లభించింది. ముఖ్య సమీక్షలు: 123telugu - 3.0/5, GreatAndhra - 2.75/5, Telugu360 - 2.75/5.
'MAD' చిత్రానికి క్రిటిక్స్ నుండి సగటున 3.2/5 రేటింగ్ లభించింది. ముఖ్య సమీక్షలు: 123telugu - 3.0/5, GreatAndhra - 3.0/5, Telugu360 - 3.25/5.
'Bhagavanth Kesari' చిత్రానికి క్రిటిక్స్ నుండి సగటున 3.3/5 రేటింగ్ లభించింది. ముఖ్య సమీక్షలు: 123telugu - 3.25/5, GreatAndhra - 3.0/5, Telugu360 - 3.25/5.
'Pulimada' చిత్రానికి క్రిటిక్స్ నుండి సగటున 3.1/5 రేటింగ్ లభించింది. ముఖ్య సమీక్షలు: 123telugu - 3.0/5, GreatAndhra - 2.75/5, Telugu360 - 3.25/5.

రాకింగ్ స్టార్ యాష్ హీరోగా, వర్సటైల్ నటి నయనతార , ప్రముఖ నటి కియారా అద్వానీ కీలక పాత్రల్లో నటించిన భారీ యాక్షన్ చిత్రం టాక్సిక్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తన ప్రభావాన్ని కొనసాగిస్తోంది. థియేటర్లలో విడుదలై ఆరో రోజుకు చేరుకున్న నేపథ్యంలో, బాక్సాఫీస్ వసూళ్లలో గణనీయమైన మార్పులు నమోదు అయ్యాయి. ఆరో రోజు వసూళ్లలో మునుపటి రోజులతో పోలిస్తే 67.6 శాతం మేర తగ్గుదల (డ్రాప్) కనిపించినప్పటికీ, ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కలిపి ఇప్పటివరకు రూ. 304.05 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి సరికొత్త మైలురాయిని చేరుకుంది. ఈ చిత్రం విడుదలైన మొదటి ఐదు రోజుల్లో భారీ ఓపెనింగ్స్ సాధించి రికార్డు స్థాయి కలెక్షన్లతో దూసుకుపోయింది. యాష్‌కు ఉన్న అంతర్జాతీయ మార్కెట్ క్రేజ్, అలాగే నయనతార, కియారా అద్వానీల సపోర్టింగ్ రోల్స్ ఈ సినిమాకు మంచి ఆదరణ తెచ్చిపెట్టాయి. ఆరో రోజు సాధారణ పనిదినం (వర్కింగ్ డే) కావడంతో వసూళ్లలో 67.6 శాతం మేర తగ్గుదల నమోదైనట్లు బాక్సాఫీస్ విశ్లేషకులు వెల్లడించారు. అయినప్పటికీ, అంతర్జాతీయంగా, దేశీయంగా సాధించిన వసూళ్లతో కలిపి మొత్తం రూ. 304.05 కోట్ల గ్రాస్ మార్కును చేరుకోవడం టాక్సిక్ పవర్ ను చూపిస్తోంది. టాక్సిక్ మూవీ బాక్సాఫీస్ వద్ద రోజురోజుకూ వసూళ్లు తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. ఇండియా నెట్ కలెక్షన్లలో ఇప్పటికే రూ. 200 కోట్ల మార్కును దాటినప్పటికీ, మొదటి రోజు సాధించిన రికార్డు ఓపెనింగ్స్ తర్వాత ప్రతిరోజూ వసూళ్లు పడిపోతున్నాయి. ప్రముఖ ట్రేడ్ వెబ్సైట్ Sacnilk కథనం ప్రకారం, మొదటి సోమవారం ఈ చిత్రం కేవలం రూ. 7.45 కోట్లు మాత్రమే రాబట్టింది. సినిమా విడుదలైనప్పటి నుండి ఇదే అత్యల్ప సింగిల్-డే కలెక్షన్ కావడం గమనార్హం. దీంతో ఈ చిత్రం ఇప్పటివరకు భారత్‌లో సాధించిన మొత్తం నెట్ కలెక్షన్స్ రూ. 221.55 కోట్లకు చేరుకున్నాయి. ఇండియాలో గ్రాస్ వసూళ్లు.. 264.80 కోట్లు కాగా.. ఒవర్ సిస్ లో

జపాన్‌లో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. 15 రోజుల అనుమతితో జపాన్‌కు వచ్చిన ఓ వ్యక్తి ఏకంగా 33 సంవత్సరాల పాటు అక్కడే అక్రమంగా ఉండిపోయాడు. 33 ఏళ్ల తర్వాత అతడికి ఊహించని షాక్ తగిలింది. ఇంటర్నెట్ డెస్క్: జపాన్‌లో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. 15 రోజుల అనుమతితో జపాన్‌కు వచ్చిన ఓ వ్యక్తి ఏకంగా 33 సంవత్సరాల పాటు అక్కడే అక్రమంగా ఉండిపోయాడు. 33 ఏళ్ల తర్వాత అతడికి ఊహించని షాక్ తగిలింది. తాజాగా, పోలీసులకు చిక్కి జైలు పాలయ్యాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. దక్షిణ కొరియాకు చెందిన మున్ జోంగ్-గి అనే వ్యక్తి 1993 సెప్టెంబర్ నెలలో తన తమ్ముడి పాస్‌పోర్ట్‌ను ఉపయోగించి జపాన్లోకి ప్రవేశించాడు. కొరియా కంటే జపాన్‌లో మంచి వేతనాలు లభిస్తాయనే ఉద్దేశంతో మున్ జోంగ్ ఈ అక్రమ మార్గాన్ని ఎంచుకున్నాడు. అతడికి లభించిన టూరిస్ట్ వీసా గడువు కేవలం 15 రోజులు మాత్రమే. కానీ, ఆ గడువు ముగిసిన తర్వాత కూడా మున్ జోంగ్ స్వదేశానికి తిరిగి వెళ్లకుండా జపాన్‌లోనే ఉండిపోయాడు. గడిచిన 33 ఏళ్లుగా మున్ జోంగ్ జపాన్‌లోని షిజుయోకా ప్రిఫెక్చర్ పరిధిలోని యైజు నగరంలో నివసిస్తున్నాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు చిన్నచిన్న దినసరి కూలీ పనులు, తాత్కాలిక పనులు చేసుకుంటూ తన జీవనాన్ని సాగించాడు. ఈ ఏడాది జూన్ నెలలో ఓ గుర్తుతెలియని వ్యక్తి ద్వారా జపాన్‌లో అక్రమంగా నివసిస్తున్న మున్ జోంగ్ గురించి పోలీసులకు తెలిసింది. రంగంలోకి దిగిన షిజుయోకా ప్రిఫెక్చరల్ పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. ఆగస్టు 26వ తేదీన మున్ జోంగ్-గిని అరెస్ట్ చేశారు. అతడిని విచారించగా నేరం అంగీకరించాడు. 33 ఏళ్ల పాటు ఎవరికీ దొరకకుండా అతను ఎలా తప్పించుకున్నాడనే కోణంలో పోలీసులు ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు. మున్ జోంగ్ వయసు 72 సంవత్సరాలు. అతడిని దక్షిణ కొరియాకు డిపోర్ట్ (దేశ బహిష్కరణ) చేస్తారా లేదా
రాష్ట్రంలో కూటమి సర్కార్ వరుసగా తాగు, సాగునీటి ప్రాజెక్టులను ప్రారంభిస్తోంది. 30 ఏళ్లుగా పశ్చిమ ప్రకాశం వాసుల కలగా మిగిలిపోయిన వెలిగొండ ప్రాజెక్టును మొత్తానికి పూర్తి చేసి, కృష్ణమ్మ జలాలను నల్లమల సాగర్‌కు విడుదల చేసి చంద్రబాబు నాయుడు జాతికి అంకితం చేశారు. వెలిగొండ పూర్తయిన వెంటనే ఉత్తరాంధ్ర ప్రజలు ఎన్నాళ్లుగానో గోదావరి రాక కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆ ప్రాజెక్టును కూడా ప్రారంభించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది.పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా అనకాపల్లి వరకు గోదావరి జలాలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. తుని సమీపంలో నర్సీపట్నం రోడ్డును క్రాస్ చేస్తూ నిర్మించిన అక్విడెక్టు నుంచి సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం నీటిని విడుదల చేయనున్నారు. దాంతో దశాబ్దాలుగా ఉత్తరాంధ్రవాసుల కలగా మారిన ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి తొలి అడుగు పడనున్నట్లయింది.READ ALSO కరువు సీమలో కృష్ణా జలాలు.. వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన చంద్రబాబు!తుని - నర్సీపట్నం రహదారిపై నిర్మించిన అక్విడెక్టు గేట్లను ఎత్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను విడుదల చేస్తారు. ఇవి కణితి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు చేరుకుంటాయి. మొదటి దశలో 30 టీఎంసీల నీటిని అనకాపల్లి తరలిస్తారు. తూర్పు గోదావరి జిల్లా పురుషోత్తపట్నం పంప్‌హౌస్ నుంచి పోలవరం ఎడమ కాలువలోకి ఈ నీటిని ఎత్తిపోస్తారు.గోదావరి జలాలను అనకాపల్లి జిల్లాకు విడుదల చేయడం వల్ల 110 చెరువులు నిండటమే కాకుండా, 148000 ఎకరాలకు సాగునీరు దక్కుతుంది. పోలవరం ఎడమ కాలువతో ఏలేరు నది అనుసంధానం కావడం వల్ల ఏలేరు ఆయకట్టు స్థిరీకరణ జరగనుంది. ఫలితంగా పిఠాపురం బ్రాంచ్ కెనాల్ ఆయకట్టు పరిధిలోని 80,700 ఎకరాలు, పంపా ఆయకట్టు పరిధిలో 12 వేల ఎకరాల స్థిరీకరణ జరుగుతుంది.తాండవ, వరాహ, మావిడివాక గెడ్డ నదులు కూడా అనుసంధానం కావడంతో పాయకరావుపేట, అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని చెరువులన్నీ నిండుతాయి. 46,620 ఎకరాలకు సాగు నీరు

కేజీఎఫ్’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత కన్నడ రాకింగ్ స్టార్ యశ్ తదుపరి చిత్రం ప్రకటించడానికి దాదాపు రెండేళ్ల సమయం తీసుకున్నారు. ఆ తర్వాత మరో రెండేళ్ల పాటు సుదీర్ఘంగా షూటింగ్ జరుపుకుని భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘టాక్సిక్’ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి ఫలితాన్ని అందుకోలేకపోయింది. మొదటి నుంచే ఈ సినిమాకు నెగిటివ్ టాక్ రావడంతో వసూళ్లు ఆశించిన స్థాయిలో రాకపోయినా నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 254 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి తన స్టామినాను నిరూపించుకుంది. అయితే ‘టాక్సిక్’ ఆశించిన విజయాన్ని సాధించకపోవడంతో ఇప్పుడు యశ్ నెక్స్ట్ సినిమా ఏంటనేది ఆసక్తికరంగా మారింది. యష్ లైనప్‌లో ప్రస్తుతం బాలీవుడ్ మల్టీస్టారర్ ‘రామాయణ్’ చిత్రం ఉంది. ఇందులో ఆయన రావణుడి పాత్రలో కనిపిస్తుండటంతో, అభిమానులు ‘టాక్సిక్’ రిజల్ట్‌తో సంబంధం లేకుండా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే, యష్ తదుపరి సోలో ప్రాజెక్ట్ కోసం ‘సప్త సాగరాలు దాటి’ ఫేమ్ హేమంత్ ఎం రావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ సినిమాకు హేమంత్‌తో పాటు యశ్ కూడా సహ రచయితగా వ్యవహరిస్తున్నారని టాక్ వినిపిస్తున్నప్పటికీ ‘టాక్సిక్’ ఫలితం తర్వాత ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్తుందో లేదో వేచి చూడాలి. దీనితో పాటు ‘కేజీఎఫ్ 3’ అధికారికంగా ప్రకటించినప్పటికీ అది త్వరలో ఉండే అవకాశం తక్కువ. అలాగే ‘సర్దార్’ దర్శకుడు పి.ఎస్. మిత్రన్ మరియు టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజుతో కూడా యశ్ ప్రాజెక్ట్‌లు చర్చల దశలో ఉన్నాయి

సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో అశ్విత్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ధర్మన్’. లోకనాయకుడు కమల్ హాసన్‌కు చెందిన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ (RKFI) బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ భారీ ప్రాజెక్ట్‌లో టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఒక పవర్ఫుల్ పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో రజనీకాంత్‌కు ధీటైన అల్లుడి పాత్రలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పవర్ఫుల్ రోల్లో రామ్ కనిపించనున్నట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ సొషల్ మీడియాలో వైరల్ గా మారింది. సూపర్ స్టార్ డాక్టర్ గా కనిపించబోతున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ను రాబోయే సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. అందుకు తగ్గట్టే షూటింగ్ ను జెట్ స్పీడ్ లో ఫినిష చేసేలా షెడ్యూల్ ప్లాన్ చేశారట మేకర్స్. ఒకవేళ సంక్రాంతికి వస్తే ఈసారి పోటీ రసవత్తరంగా ఉంటుంది. ఇప్పటికే జనవరి 12న విడుదల, చిరు – బాబీ సినిమా, జార్జిక్రిష్ సినిమాలు రేస్ లో ఉన్నాయి. ఇప్పడు రజనీ సినిమా వస్తే పొంగల్ పోరు జోరుగా ఉంటుంది. కోలీవుడ్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ నటి సిమ్రాన్, రాశీ ఖన్నా కీలక పాత్రలు పోషిస్తున్నారు. రజనీకాంత్ మాస్ స్క్రీన్ ప్రెజెన్స్, రామ్ ఎనర్జీ కలగలిసి రానున్న ఈ మామా-అల్లుళ్ల ఈగో వార్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది

మొబైల్ ఫోన్ల ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ (IMEI) నంబర్‌ను ట్యాంపర్ చేయడం లేదా ఆ నంబర్ మార్పులు చేసిన ఫోన్లను వాడటంపై కేంద్ర టెలికమ్యూనికేషన్ల విభాగం (DoT) తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఇలాంటి చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడిన వారికి మూడేళ్ల వరకు జైలు శిక్ష, రూ.50 లక్షల వరకు జరిమానా లేదా రెండూ విధించవచ్చని సోమవారం స్పష్టం చేసింది.దేశంలో మొబైల్, డిజిటల్ సేవలు వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో టెలికాం ఐడెంటిఫైయర్ల దుర్వినియోగం పౌరుల భద్రతకు, నెట్‌వర్క్‌ల సమగ్రతకు పెను సవాలుగా మారిందని టెలికాం శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే టెలికమ్యూనికేషన్స్ చట్టం, 2023 ప్రకారం కఠిన నిబంధనలను అమలు చేస్తున్నట్లు తెలిపింది. ఈ చట్టంలోని సెక్షన్ 42(3)(c) ప్రకారం IMEI నంబర్లతో సహా ఎలాంటి టెలికమ్యూనికేషన్ ఐడెంటిఫైయర్లను ట్యాంపర్ చేయడం నిషేధం.ఈ నిబంధనలను ఉల్లంఘించడం కాగ్నిజబుల్ (వారెంట్ లేకుండానే అరెస్ట్ చేయదగిన), నాన్-బెయిలబుల్ నేరంగా పరిగణిస్తామని టెలికాం శాఖ స్పష్టం చేసింది. ఈ నేరానికి పాల్పడిన వారికే కాకుండా, దానికి సహకరించిన లేదా ప్రోత్సహించిన వారికి కూడా ఇదే శిక్ష వర్తిస్తుందని సెక్షన్ 42(6) చెబుతోందని వివరించింది. మోసపూరిత మార్గాల్లో, ఫేక్ డాక్యుమెంట్లు సమర్పించి సిమ్ కార్డులు పొందడం కూడా నేరమేనని పేర్కొంది.పౌరులకు పలు కీలక సూచనలు చేసింది. మార్పులు చేసిన IMEI నంబర్లు ఉన్న మోడెమ్‌లు, సిమ్ బాక్సులు వంటి పరికరాలను ఉపయోగించవద్దని హెచ్చరించింది. ముఖ్యంగా, తమ పేరు మీద తీసుకున్న సిమ్ కార్డులను ఇతరులకు అమ్మడం, బదిలీ చేయడం
'Skanda' చిత్రానికి క్రిటిక్స్ నుండి సగటున 2.75/5 రేటింగ్ లభించింది. ముఖ్య సమీక్షలు: 123telugu - 2.75/5, GreatAndhra - 2.5/5, Telugu360 - 2.5/5.
'Leo' చిత్రానికి క్రిటిక్స్ నుండి సగటున 3.5/5 రేటింగ్ లభించింది. ముఖ్య సమీక్షలు: 123telugu - 3.5/5, GreatAndhra - 3.25/5, Telugu360 - 3.25/5.