
వినాయక వ్రతం ఎలా చేయాలి... ఏయే. శ్లోకాలు చదువుతున్నప్పుడు విఘ్నేశ్వరుడికి వేటివేటితో పూజ చెయ్యాలన్నది వరుస పద్ధతిలో పూర్తి వివరాలను తెలుసుకుందాం. . .
వినాయకుడి పూజా సామాగ్రిని వినాయకుడి దగ్గర పెట్టుకొని కూర్చోవాలి. తరువాత పూజకు కావలసిన వస్తువులను ఒక క్రమ పద్దతిలో ఉంచుకోవాలి. తరువాత ఈ క్రింద తెలిపిన విధంగా పూజ చేస్తూ పూజ ప్రారంభించాలి.
( ముందుగా పసుపు గణపతిని పూజించాలి.. )
దీపారాధన చేయాలి.. కుందిలో మూడు వత్తులు వేసి.. రెండు వత్తులను వెలిగించాలి..( తరువాత చెప్పినప్పుడు మూడో వత్తిని వెలిగించాలి) (రెండు చేతులను జోడించి భగవంతుణ్ణి ఈ శ్లోకం ద్వారా విఘ్నాలు లేకుండా పూజ పూర్తి కావాలని ప్రార్థించవలెను) శ్లో|| శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే॥ శ్లో|| సుముఖశైక దంతశ్చకపిలో గజకర్ణకః! లంబోదరశ్చవికటో విఘ్నరాజోగణాధిపః! ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః వక్రతుండ శ్శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజః షోడశైతాని నామాని యఃపఠేతశృణుయాదపి|| విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తన్య నజాయతే!! అభిప్సితార్థ సిధ్యర్థం పూజితో యస్సురైరపి! సర్వవిఘ్నచ్చిదే తస్మై శ్రీ గణాధిపతయే నమః!!
పూజను ప్రారంభించే ముందు ఆచమనం చేయాలి. అనగా మొదట నీటితో చేతులను శుభ్రం చేసుకొని తరువాత గోకరణం చేతి ముద్రతో నీటిని మూడు సార్లు తాగాలి. ఆచమనానికి చేతిలో తీసుకునే నీటి మొత్తం బఠానీ పరిమాణం అంత మాత్రమే ఉండాలి. మంత్రం చెప్పే ప్రతిసారి చేతిలోని నీటిని తాగాలి
అచమ్య: ఓం కేశవాయ స్వాహా ఓం నారాయణాయ స్వాహా ఓం మాధవామ స్వాహా
ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషీకేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్దాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః.
(కింది శ్లోకాన్ని ఒక్కొక్కటిగా చదువుతూ, కొన్ని నీళ్లు తలపై చల్లుకోవాలి) శ్లో .. అపపత్ర పవిత్రోవా సర్వావస్థాగతోపివా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాంభ్యంతర శ్శుచి:
(మరికొన్ని నీళ్లు చేతిలో పోసుకొని కింది శ్లోకం స్తూ చుట్టూ చల్లుకోవాలి) శ్లో .. ఉత్తిష్టంతు భూతపిశాచా యేతేభూమిభారకాః ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే
ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం త ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోపకు ప్రచోదయాత్ || ఓం మాపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్
మమోపాత్త సమస్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణో రాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వన్తరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్యప్రదేశ్ - కృష్ణా గోదావర్యోర్మద్యదేశే శోభనగృహే- సమస్త దేవతా గో బ్రాహ్మణ హరి హర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాన్ద్రమానేన శ్రీ పరాభవ నామ సంవత్సరే ... దక్షిణాయనే... .. భాద్రపదమాసే.. శుక్లపక్షే ..చతుర్థస్యాం తిధౌ ఇందు వాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిధౌ శ్రీమాన్ (గోత్రః)................. నామధేయస్య......... ధర్మపత్నీ సమేతః ...........శ్రీ మతః ......గోత్రస్య ....నామధేయస్య ధర్మపత్నీ సమేతస్య .. సహకుటుంబస్య, క్షేమ స్థైర్య ధైర్య విజయాయురారోగ్య ఐశ్వర్య అభివృధ్యర్థం ధర్మార్ధ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్ధ సిద్ధ్యర్థం పుత్ర పౌత్రాభి వృధ్యర్థం సర్వాభీష్ట సిద్ధ్యర్థం సకల విద్యా ప్రాప్యర్థం సమస్త మంగళావాప్యర్థం సమస్త దురితోప శాంత్యర్థం వర్షే వర్షే ప్రయుక్త శ్రీ వరసిద్ధి వినాయక దేవతా ముద్దిశ్య శ్రీ వరసిద్ది వినాయక దేవతా ప్రీత్యర్థం పురుషసూక్త విధానూన యావచ్చక్తి ధ్యాస ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే ॥ ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం హరిద్రా బింబే - శ్రీమహాగణాధిపతి దేవతా పూజాం కరిష్యే ।
అంటూ కుడిచేయి ఉంగరం వేలితో నీళ్లు ముట్టుకోవాలి.
తదంగ కలశపూజాం కరిష్యేః (మరలా కుడిచేతి ఉంగరపు వేలిని నీటిలో తాకవలెను)
కలశపూజ: (కలశాన్ని గంధం, పుష్పములు, అక్షతలతో పూజించి కలశముపై కుడిచేతిని ఉంచి, క్రింది శ్లోకము చెప్పుకొనవలెను)
శ్లో‘‘ కలశస్య ముఖే విష్ణుః కంఠేరుద్ర సమాశ్రితః మూలేతత్రస్థితో బ్రహ్మా మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌతు సాగరాః సర్వేసప్తద్వీపా వసుంధరా! ఋగ్వేదోధయజుర్వేదస్సామవేదో హ్యధర్వణః అంగైశ్చసహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః గంగేచ యమునే చైవ గోదావరీ సరస్వతీ! నర్మదే సింధు కావేరీ జలేస్మిం సన్నిధింకురు ‘‘ అయాంతు శ్రీ గణపతి పూజార్థం దురితక్షయ కారకాః కలశోదకేన పూజా ద్రవ్యాణిచ సంప్రోక్ష్యః దేవమాత్మానంచ సంప్రోక్ష్యః





