
© 2026 nimisham.in

సౌత్ ఇండియన్ సినీ పరిశ్రమలో సీనియర్ హీరోయిన్లలో ఒకరిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న త్రిష(Trisha).. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా కొనసాగుతున్నారు. వయసుకు తగ్గ పాత్రలతో పాటు విభిన్నమైన కథలను ఎంచుకుంటూ కెరీర్లో మరో దశను ఆస్వాదిస్తున్న ఆమె, తాజాగా ఓ క్రేజీ వెబ్ సిరీస్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi) నటించిన విశ్వంభర(Vishwambhara)లో ఇప్పటికే నటించిన త్రిష.. ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకోనున్నారు.
టాలెంటడ్ డైరెక్టర్ నందినీ రెడ్డి(Nandini Reddy) ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించనున్నారని సమాచారం. దాదాపు ఏడాదిన్నరగా ఈ కథపై వర్క్ చేస్తున్న నందినీ రెడ్డి.. రీసెంట్ గా స్క్రిప్ట్‌ను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్ కోసం రూపొందనున్న ఈ వెబ్ సిరీస్‌లో త్రిష లీడ్ రోల్ లో కనిపించనున్నారు. సూపర్‌నేచురల్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ సిరీస్‌కు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయని, త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుందని టాక్.
ఇక వరుస సక్సెస్‌లతో తన మార్కెట్‌ను మరింత పెంచుకున్న త్రిష.. ప్రస్తుతం భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో డిస్కషన్ జరుగుతోంది. మరోవైపు తమిళనాట ఆమె రాజకీయ రంగ ప్రవేశం కూడా హాట్ టాపిక్‌గా మారింది. పర్సనల్ గా ఈ అంశం చర్చనీయాంశంగా ఉన్నప్పటికీ, సినిమాల విషయంలో మాత్రం త్రిష జోరు తగ్గడం లేదు. తాజాగా కార్తి హీరోగా తెరకెక్కనున్న ఓ ప్రాజెక్ట్‌కు కూడా ఆమె ఓకే చెప్పినట్లు సమాచారం. దీంతో థియేటర్ సినిమాలతో పాటు ఓటీటీలోనూ త్రిష మరింత దూకుడు చూపించనున్నారని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
Film Critic & Entertainment Desk • Nimisham
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Nimisham.
స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఈ ముఖ్యమైన సమాచారాన్ని పంచుకోండి.