
ఏళ్లుగా దూరంగా ఉంటున్న ముగ్గురు అన్నదమ్ములు, తమ మధ్య ఉన్న గొడవలను పరిష్కరించుకోవడానికి భారతదేశం అంతా రైలులో ప్రయాణిస్తారు. ఈ ప్రయాణంలో వాళ్లు గుళ్లు, చిన్న పట్టణాలు, రైల్వే స్టేషన్ల మీదుగా వెళ్తూ భారతదేశంలోని విభిన్న కోణాలను చూస్తారు. కుటుంబ సంబంధాలు, కామెడీ, ఊహించని సంఘటనలతో నిండిన ఈ సినిమా, సాధారణ ట్రావెల్ సినిమాలకు పూర్తి భిన్నమైన అనుభవాన్ని ఇస్తుంది.
ఒక యువతి నాలుగు ఒంటెలు, తన కుక్కతో కలిసి ఆస్ట్రేలియాలోని విశాలమమైన ఎడారి ప్రాంతాన్ని ఒంటరిగా దాటుతుంది. మనుషులు లేని విశాలమైన భూభాగం, కఠినమైన వాతావరణం, ప్రకృతి అందాలు.. ఇలా ప్రతి దృశ్యం మనల్ని ఆస్ట్రేలియాలోని మరో ప్రపంచానికి తీసుకెళ్తుంది. నిజ జీవిత కథ ఆధారంగా తీసిన ఈ సినిమా, ప్రయాణం అంటే కేవలం ఒక చోటు నుంచి మరో చోటుకి వెళ్లడం కాదని మనకు అర్థమయ్యేలా చేస్తుంది.
టోక్యోలో టాయిలెట్లు శుభ్రం చేసే ఒక సాధారణ వ్యక్తి రోజువారీ జీవితం చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. ఇందులో పెద్ద సాహసాలు, టూరిస్ట్ ప్రదేశాలు ఉండవు. కానీ టోక్యో వీధులు, పార్కులు, చిన్న రెస్టారెంట్లు, నగర జీవితాన్ని చాలా ప్రశాంతంగా మనకు పరిచయం చేస్తుంది. సాధారణ జీవితంలో కూడా అందాన్ని వెతకవచ్చని చెప్పే ఈ సినిమా, జపాన్ను పూర్తిగా కొత్త కోణంలో చూపిస్తుంది.
కొలంబియాలోని దట్టమైన అమెజాన్ వర్షారణ్యాలలో రెండు వేర్వేరు కాలాల్లో జరిగిన ప్రయాణాల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. అక్కడి గిరిజన ప్రజల జీవితం, వారి నమ్మకాలు, ప్రకృతితో వారికున్న బంధం.. ఇలా టూరిస్టులు సాధారణంగా చూడలేని అమెజాన్‌లోని ఒక రహస్య ప్రపంచాన్ని ఈ సినిమా మనకు చూపిస్తుంది. ఈ సినిమాను బ్లాక్ అండ్ వైట్‌లో చిత్రీకరించడం వల్ల దీని అనుభవం మరింత ప్రత్యేకంగా ఉంటుంది.
పసిఫిక్ మహాసముద్రంలోని వనువాటు (Vanuatu) దీవుల సమూహంలో ఉన్న టన్నా అనే మారుమూల ప్రాంతంలో నివసించే యాకెల్ గిరిజన ప్రజల జీవితాన్ని ఈ సినిమా మనకు పరిచయం చేస్తుంది. వారి సంప్రదాయ జీవనశైలి, సంస్కృతి, ప్రేమ, సామాజిక కట్టుబాట్ల మధ్య జరిగే ఈ కథ, మనం సాధారణ సినిమాల్లో చూడని ఒక ప్రపంచాన్ని కళ్లముందు ఆవిష్కరిస్తుంది. ఈ సినిమాలోని ప్రకృతి దృశ్యాలు, ఆ దీవి ప్రత్యేక సంస్కృతి కలిసి, ఇంట్లో కూర్చునే ఒక కొత్త ప్రపంచాన్ని చుట్టివచ్చిన అనుభూతినిస్తాయి.
ఈ 5 సినిమాలు ఒకేలాంటి ట్రావెల్ సినిమాలు కాదు. భారతీయ రైలు ప్రయాణం, ఆస్ట్రేలియా ఎడారి, జపాన్ నగర జీవితం, అమెజాన్ అడవులు, పసిఫిక్ దీవిలోని గిరిజన సంస్కృతి.. ఇలా ప్రతి సినిమా పూర్తిగా భిన్నమైన ప్రపంచాన్ని మనకు చూపిస్తుంది. ప్రయాణాలు చేయలేని సమయంలో, సినిమా ద్వారా కొత్త ప్రదేశాలు, సంస్కృతులను అనుభవించాలనుకుంటే ఈ 5 సినిమాలు మంచి ఛాయిస్!





