దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే 'సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్' (SIIMA 2026) వేడుక బెంగళూరులోని కోరమంగళ ఇండోర్ స్టేడియంలో అత్యంత ఘనంగా ప్రారంభమైంది. సినీ తారల పలకరింపులు, రంగురంగుల కాంతుల నడుమ తొలి రోజు టాలీవుడ్, కన్నడ చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రతిభావంతులకు అవార్డులను అందజేశారు.
ఈ ఏడాది సైమా వేడుకల్లో యువ నటీనటుల విజయం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సూపర్‌యోధ కాన్సెప్ట్‌తో వచ్చి బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధించిన 'మిరాయ్' చిత్రంలో అద్భుత నటనకు గాను యంగ్ హీరో తేజ సజ్జా 'ఉత్తమ నటుడు' అవార్డును దక్కించుకున్నారు. మరోవైపు 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలో మెప్పించిన నటి ఐశ్వర్య రాజేష్ ఉత్తమ నటితో పాటు క్రిటిక్స్ విభాగంలోనూ అవార్డులు అందుకొని డబుల్ ధమాకా సాధించారు.
యువ ప్రతిభను ప్రోత్సహించడంలో ముందంజలో ఉండే సైమా.. ఈ సారి కూడా కొత్త నీరుకి సరైన గుర్తింపునిచ్చింది. 'కోర్ట్: స్టేట్ వర్సెస్ ఎ నోబడీ' సినిమాతో హర్ష్ రోషన్ ఉత్తమ డెబ్యూ నటుడిగా, శ్రీదేవి ఉత్తమ డెబ్యూ నటిగా అవార్డులు అందుకున్నారు. అలాగే 'మోగ్లీ' చిత్రానికి గాను సాక్షి మడోల్కర్ డెబ్యూ విభాగంలో అవార్డు గెలుచుకోవడం గమనార్హం. సంగీత విభాగంలో రమణ గోగుల ('గోదారి గట్టు' - సంక్రాంతికి వస్తున్నాం), సమీరా భరద్వాజ్ ('ప్రేమలో' - కోర్ట్) ఉత్తమ గాయకులుగా నిలిచారు.
చిన్ననాటి నుంచే బాలనటుడిగా మెప్పించి, 'హను-మాన్' చిత్రంతో పాన్-ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న తేజ సజ్జా, ఆ తర్వాత 'మిరాయ్'తో కూడా తన మాస్ అండ్ యాక్షన్ ఇమేజ్ను మరోస్థాయికి తీసుకెళ్లారు. టాలీవుడ్లో సరికొత్త తరానికి నాయకత్వం వహిస్తున్న ఈ యువ కథానాయకుడికి సైమా అవార్డు దక్కడంపై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అటు కన్నడ చిత్ర పరిశ్రమలో 'కాంతార: చాప్టర్ 1' చిత్రంతో సంచలనం సృష్టించిన రిషబ్ శెట్టి ఉత్తమ నటుడిగా నిలిచి అందరి దృష్టినీ ఆకట్టుకున్నారు. రెండు రోజుల పాటు సాగే ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుల పండగలో సెప్టెంబర్ 13న జరిగే రెండో రోజు వేడుకలో తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమల విజేతలను ప్రకటించనున్నారు.
[SIIMA Awards 2026 Winners Telugu, SIIMA 2026 Telugu Winners List, Teja Sajja Best Actor SIIMA, Aishwarya Rajesh Best Actress SIIMA 2026, Tollywood SIIMA Awards 2026]
కార్ రేసింగ్ ట్రాక్‌పై విజయ్-అజిత్.. బ్రిటన్‌లో సందడి చేసిన స్టార్ హీరోలు.!
కార్ రేసింగ్ ట్రాక్‌పై విజయ్-అజిత్.. బ్రిటన్‌లో సందడి చేసిన స్టార్ హీరోలు.!
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com
Disclaimer : All content on this website, including text, images, videos, graphics, and audio, is the intellectual property of ObjectOne Information Systems Ltd. and/or its affiliates. Any unauthorized reproduction, distribution, modification, or publication of this material, in whole or in part, is strictly prohibited without prior written consent from ObjectOne Information Systems Ltd.





