
© 2026 nimisham.in


Raviteja : రవితేజ ఇరుముడి సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆల్మోస్ట్ 200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి దూసుకుపోతుంది. అయితే ఈ సినిమాతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ తో పాటు మాస్ మహారాజ రవితేజ కూడా బాగా లాభపడ్డాడు. సాధారణంగా రవితేజ ఒక సినిమాకు దాదాపు 20 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు.
అయితే ఇరుముడి సినిమాకు రవితేజ 8 కోట్లు అడ్వాన్స్ రెమ్యునరేషన్ తీసుకొని మిగతాది నైజాం హక్కులను తీసుకున్నారు. నిర్మాతలే ఈ సినిమాని స్వయంగా నైజాంలో రిలీజ్ చేసారు. ఈ సినిమా నైజాంలో షేర్ దాదాపు ఇప్పటి వరకు 55 కోట్లు కలెక్ట్ చేసిందని సమాచారం. జీఎస్టీ, డిస్ట్రిబ్యూటర్స్ కమిషన్, రిలీజ్ ఖర్చులు.. ఇవన్నీ కనీసం పది కోట్లు పోయినా దాదాపు రవితేజకు 45 కోట్లు రెమ్యునరేషన్ గా వెళ్లనుంది. అడ్వాన్స్ 8 కోట్లు ప్లస్ నైజాం లాభాలు కలిపి కనీసం రవితేజ ఇరుముడి సినిమాకు 53 కోట్ల వరకు సంపాదించాడు.






