
విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.
Jr NTR Shoulder Injury:జూనియర్ ఎన్టీఆర్‌కు జూలై 27న భుజానికి గాయం అయినట్లు ఆయన టీమ్ వెల్లడించింది. అయితే ఈ గాయం ఎలా జరిగిందనే విషయాన్ని మాత్రం అధికారికంగా వెల్లడించలేదు. ఎన్టీఆర్‌ను పరీక్షించిన వైద్యులు కొంతకాలం పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.
వైద్యుల సూచన ప్రకారం ఎన్టీఆర్ ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాల్సి ఉంది. గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి ఈ విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం గురించి అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టీమ్ స్పష్టం చేసింది.
తాజా ప్రకటనలో ఎన్టీఆర్‌కు రేపు కిమ్స్ ఆసుపత్రిలో భుజానికి శస్త్రచికిత్స చేయనున్నట్లు ఆయన టీమ్ తెలిపింది. వైద్య పరీక్షల తర్వాతే ఆపరేషన్ చేయాలని నిర్ణయించినట్లు పేర్కొంది. నిపుణులైన వైద్యుల బృందం ఎన్టీఆర్ చికిత్సను పర్యవేక్షించనుంది.
ఎన్టీఆర్‌కు గాయం గురించి గతంలో కూడా ఆయన టీమ్ అధికారిక ప్రకటన చేసింది. వైద్యుల సూచన మేరకు పూర్తిగా విశ్రాంతి తీసుకుంటున్నారని తెలిపింది. ఆయన త్వరగా, పూర్తిగా కోలుకునేలా వైద్యులు అవసరమైన చికిత్స అందిస్తున్నారని పేర్కొంది.
ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఆయనకు గాయం అయి ఉండొచ్చని కొన్ని వార్తలు వచ్చాయి. అయితే గాయం షూటింగ్ సమయంలోనే జరిగిందని ఎన్టీఆర్ టీమ్ అధికారికంగా ధృవీకరించలేదు.
ప్రస్తుతం ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆపరేషన్ తర్వాత ఆయన ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను టీమ్ వెల్లడించే అవకాశం ఉంది. ఎన్టీఆర్ త్వరగా కోలుకుని తిరిగి సినిమాల షూటింగ్లో పాల్గొనాలని అభిమానులు కోరుకుంటున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను
తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.





