
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Jr NTR Key Surgery: టాలీవుడ్ అగ్రహీరోల్లో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్‌కు ఈ రోజు హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో ఆయన భుజానికి శస్త్రచికిత్స జరగనుంది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న డ్రాగన్ మూవీ షూటింగ్లో అతని భుజానికి గాయం అయింది. కొన్ని రోజులుగా చేతికి కట్టుతోనే షూటింగ్లో పాల్గొంటూ వస్తున్నారు. ఆ సందర్భంలో భుజం నొప్పి మరింత కావడంతో.. డాక్టర్ల సలహా మేరకు నేడు ఆయనకు శస్త్రచికిత్స నిర్వహిస్తున్నట్లు ఆయన కార్యాలయం అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది.
ఈ మేరకు సర్జరీకి సంబంధించిన అన్ని ఏర్పాట్లను కిమ్స్ ఆసుపత్రి యాజమాన్యం పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో డ్రాగన్ సినిమా షూటింగ్‌కు కాస్త అంతరాయం ఏర్పడనున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ భుజానికి ఆపరేషన్ జరగబోతుందనే వార్త తెలియగానే అతని ఫ్యాన్స్ ఆందోళనకు గురవుతున్నారు. ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
మరోవైపు గతంలో ఎన్టీఆర్ రెండు మూడు సార్లు షూటింగ్ సందర్భాల్లో గాయపడ్డ సంగతి తెలిసిందే కదా. ఇక ఎన్టీఆర్ విషయానికొస్తే.. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ లెవల్లో ఈయన ఇమేజ్ ఒక్కసారిగా పెరిగింది. ఆ తర్వాత ‘దేవర’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న తారక్.. ఆ తర్వాత తొలిసారి బాలీవుడ్లో ‘వార్ 2’ డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చాడు. హృతిక్ రోషన్‌తో కలిసి నటించాడు. ఈ సినిమా ఆశించిన మేర సక్సెస్ సాధించలేదు. ఈ చిత్రంలో నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో మెప్పించాడు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కింది. కేవలం ఆరు నెలల గ్యాప్‌లోనే ఈ సినిమాను రిలీజ్ చేసేలా షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు. డ్రాగన్ మొదటి భాగం వచ్చే యేడాది జూన్ 11న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక దసరాకు డ్రాగన్ 2ను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.





