
Gundeninda Gudigantalu: గుండె నిండా గుడిగంటలు శుక్రవారం ఎపిసోడ్‌ రోహిణి, మనోజ్‌ వ్యవహారంతో పాటు మీనా కొత్త ఆర్డర్‌ కోసం పడుతున్న ఇబ్బందులతో ఆసక్తికరంగా సాగింది. వ్రతానికి కూర్చోకుండా బార్‌కు వెళ్లిన రోహిణిపై ప్రభావతి ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అదే సమయంలో బాలు కూడా బార్‌కు వెళ్లానని చెప్పడంతో పరిస్థితి సద్దుమణుగుతుంది. ఇంతలో ఇంట్లోకి పాకుతూ వచ్చిన మనోజ్‌ రచ్చ చేయడంతో ప్రభావతి మరోసారి రోహిణిని తిడుతుంది.మౌనికను సాగనంపే సమయంలో మీనా పుట్టింటి గురించి ప్రభావతి అవమానకరంగా మాట్లాడటంతో శృతి, సత్యం ఆమెకు కౌంటర్లు ఇస్తారు.



