
© 2026 nimisham.in

చిరంజీవి కెరీర్ ని ఖైదీకి ముందు ఖైదీకి తర్వాత గా చూడాలి. ఖైదీకి ముందు కెరీర్ ని ఒక్కో మెట్టు పేర్చుకుంటూ వచ్చిన చిరు.. ఖైదీ చిత్రంతో విశ్వరూపం ప్రదర్శించారు. టాలీవుడ్ లో నయా స్టార్ గా అవతరించారు. కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ మూవీలో ప్రతి అంశం ఒక అద్భుతం అనే చెప్పాలి. ఖైదీ చిత్రంలోని రగులుతోంది మొగలి పొద అనే సాంగ్ ఐకానిక్.
అలాంటి సాంగ్ అప్పటి వరకు టాలీవుడ్ లో అస్సలు లేదు. హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ.. డ్యాన్స్ కొరియోగ్రఫీ, దర్శకత్వంకి కొత్త అర్థం చెప్పిన పాట అది. సలీం మాస్టర్ పర్యవేక్షణలో శివశంకర్ మాస్టర్ ఆ సాంగ్ ని కంపోజ్ చేశారు. చిరంజీవి, మాధవిలకు అద్భుతమైన డ్యాన్స్ మూమెంట్స్ ఇచ్చారు. చిరు, మాధవి ఇద్దరూ మెలికలు తిరుగుతూ డ్యాన్స్ చేసిన విధానం చాలా కష్టంతో కూడుకున్న ప్రాసెస్.
దీని గురించి ఓ ఇంటర్వ్యూలో శివ శంకర్ మాస్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో సలీం మాస్టర్ అంటే నాకు చాలా గౌరవం, భయం. ఆయన పర్యవేక్షణలో ఎలాంటి తప్పు జరగకూడదు అని మనసులో అనుకుంటూ రగులుతోంది మొగలి పొద సాంగ్ కి కొరియోగ్రఫీ చేశాను. రిహార్సల్స్ చేసి చిరంజీవికి డ్యాన్స్ మూమెంట్స్ చూపించాను. చిరంజీవి మాధవి ఇద్దరూ రిహార్సల్స్ పర్ఫెక్ట్ సింక్ లో చేశారు. ఆ సాంగ్ కొరియోగ్రఫీ తర్వాత నాకు బాడీ పెయిన్స్, వెన్ను నొప్పు వచ్చాయి.
మూడు నెలల పాటు సరిగ్గా నడవలేకపోయాను. ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కోలుకున్నాను. నేను డ్యాన్స్ మాస్టర్ ని.. ఆ సాంగ్ వల్ల నేనే అంత ఇబ్బంది పడితే ఇక చిరంజీవి పరిస్థితి ఊహించుకోండి. మాధవి పరిస్థితి ఊహించుకోండి. ఎంత కష్టం అయినా చిరంజీవి వెనకడుగు వేయకుండా ఆ సాంగ్ చేశారు. మాధవి కష్టం కూడా మరిచిపోలేం. ఇండియాలో డ్యాన్స్ గురించి మాట్లాడాల్సి వస్తే ముందుగా చిరంజీవి గురించే మాట్లాడాలి అంటూ శివశంకర్ మాస్టర్ ప్రశంసలు కురిపించారు.
ఊరకే ఎవరూ మెగాస్టార్ లు అయిపోరు. ఆయన అంతలా కష్టపడుతూ ఇష్టంతో చేశారు కాబట్టే చిరంజీవి గారు మెగాస్టార్ అయ్యారు. రెండు పాములు పెనవేసుకున్నప్పుడు వాటిని చూస్తూ హీరో హీరోయిన్ ఇమాజిన్ చేసుకుంటే ఎలా ఉంటుంది ? అనే ఐడియాలో నుంచి రగులుతోంది మొగలి పొద సాంగ్ పుట్టింది. ఈ ఐడియా వచ్చినప్పుడు అసలు పాములు పెనవేసుకున్నట్లు డ్యాన్స్ ఎలా చేయించాలి అని చాలా ఆలోచించాం. చిరంజీవి, మాధవికి పాముల లాగా గెటప్ వేసి డ్యాన్స్ చేయించినట్లు శివశంకర్ మాస్టర్ తెలిపారు.
Film Critic & Entertainment Desk • Nimisham
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Nimisham.
స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఈ ముఖ్యమైన సమాచారాన్ని పంచుకోండి.








