బిగ్ బాస్ తెలుగు సీజన్-10 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీల హడావుడి మొదలైంది. దశావతారం థీమ్ తో సెప్టెంబర్ 6న గ్రాండ్ గా లాంచ్ అయిన ఈ సీజన్ లో మొదట 10 మంది కంటెస్టెంట్లు మాత్రమే హౌస్ లోకి వెళ్లారు. ఆ తర్వాత మిడ్-వీక్, వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో ఆటను రసవత్తరంగా మార్చాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఇప్పుడు మదన్ గలాం( Madan_Galam) వైల్డ్ కార్డ్ ఎంట్రీ పోస్టర్ వైరల్ అవుతోంది. బ్లూ రాయల్ బ్లేజర్ లో థమ్స్ అప్ ఇస్తూ ఉన్న ఈ పోస్టర్ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం హౌస్ లో త్రిగుణ్, రోహిత్ మధ్య గొడవలు, బాయ్స్ హాస్టల్ లాంటి వాతావరణంతో టీఆర్పీ పీక్స్ లో ఉంది. ఈ టైమ్ లో వైల్డ్ కార్డ్ లు వస్తే ఆటమొత్తం మారిపోతుందని విశ్లేషకులు అంటున్నారు. గతంలో కూడా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు హౌస్ ని షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఈసారి మేకర్స్ మొత్తం 8 మంది వరకు వైల్డ్ కార్డ్ లను ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అందులో అగ్నిపరీక్ష 2 నుంచి ఇద్దరు..మరికొంత మంది సెలబ్రిటీలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ లిస్ట్ లో ఇప్పుడు మదన్ గాలం పేరు బలంగా వినిపిస్తోంది. అయితే మదన్ గాలం వైల్డ్ కార్డ్ ఎంట్రీపై అధికారికంగా బిగ్ బాస్ టీమ్ నుంచి ఎలాంటి కన్ఫర్మేషన్ రాలేదు. ఒకవేళ మదన్ నిజంగానే హౌస్ లోకి వైల్డ్ కార్డ్ గా వస్తే మాత్రం గేమ్ మొత్తం మారిపోతుందని పాత కంటెస్టెంట్లకు గట్టి పోటీ ఇస్తాడని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై క్లారిటీ రావాలంటే వీకెండ్ లో నాగార్జున చెప్పే వరకు ఆగాల్సిందే.
[Bigg Boss Telugu 10 Wild Card Entry, Madan Galam Bigg Boss 10, Bigg Boss 10 Telugu wild card contestants, Star Maa Bigg Boss 10, Nagarjuna Bigg Boss 10]
Bigg Boss Season-10 Telugu : చరణ్, చైత్రలకి నో సీక్రెట్ రూమ్.. హై రిస్క్‌లో పదకొండు మంది!
Bigg Boss Season-10 Telugu : చరణ్, చైత్రలకి నో సీక్రెట్ రూమ్.. హై రిస్క్‌లో పదకొండు మంది!
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com
Disclaimer : All content on this website, including text, images, videos, graphics, and audio, is the intellectual property of ObjectOne Information Systems Ltd. and/or its affiliates. Any unauthorized reproduction, distribution, modification, or publication of this material, in whole or in part, is strictly prohibited without prior written consent from ObjectOne Information Systems Ltd.
