
Aug 21 2026 3:58 PM | Updated on Aug 21 2026 4:20 PM
యశ్ కథానాయకుడిగా, గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించిన చిత్రం టాక్సిక్. ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడుదలకు ఇంకా సమయం ఉండగానే ఓవర్సీస్లో అడ్వాన్స్ బుకింగ్స్ జోరందుకున్నాయి. అమెరికాలో టాక్సిక్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఇప్పటికే సుమారు రూ.1.06కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. ఇప్పటివరకు 204 ప్రాంతాల్లో 589 షోలకు కలిపి 5,500 టికెట్లు అమ్ముడయ్యాయట. విడుదలకు ముందు రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలుస్తోంది.
బుక్‌మైషోలోనూ మార్క్ ఇక బుక్‌మైషోలో ‘టాక్సిక్’కు ఇప్పటికే 10లక్షలకు పైగా ఇంట్రెస్ట్స్ నమోదయ్యాయి. ఈ ఘనత సాధించిన 13వ భారతీయ చిత్రంగా ‘టాక్సిక్’ నిలిచింది. యశ్ కెరీర్లో కేజీఎఫ్2 తర్వాత ఆ స్థాయిలో ప్రేక్షకుల నుంచి ఆదరణ పొందిన రెండవ చిత్రమిది కావడం విశేషం. నేడు భారత్‌లో అడ్వాన్స్ బుకింగ్స్? ఇప్పటివరకు అమెరికాలో మాత్రమే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కాగా.. భారత్‌లో బుకింగ్స్ ఆగస్టు 21 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. యశ్ క్రేజ్ కారణంగా తొలి రోజు భారీ ఓపెనింగ్ వస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ ఇదే జోరులో కొనసాగితే తొలి రోజే రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు. టికెట్ ధరలు భారీగా ఉండే ఛాన్స్ తెలుగు రాష్ట్రాల్లో ఉదయం 6 గంటల ప్రత్యేక షోలకు టికెట్ ధరలు రూ.500–600 వరకు ఉండొచ్చని తెలుస్తోంది. సాధారణ షోల టికెట్ ధరలు కూడా సాధారణ ధరల కంటే రూ.50–100 వరకు అధికంగా ఉండే అవకాశం ఉంది. ముంబై, ఢిల్లీలో కొన్ని ప్రీమియం షోలకు టికెట్ ధరలు ఏకంగా రూ.2,600 వరకు ఉండొచ్చని సమాచారం.
‘కేజీఎఫ్ 2’ తర్వాత దాదాపు నాలుగేళ్లకు యశ్ మళ్లీ తెరపైకి వస్తుండటంతో ‘టాక్సిక్’పై అంచనాలు తారాస్థాయికి చేరాయి. కియారా అద్వానీ, నయనతార, హ్యూమా ఖురేషీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రంపై ఇప్పుడు అందరి దృష్టి భారత్ అడ్వాన్స్ బుకింగ్స్‌పైనే ఉంది.
ఇదీ చదవండి: ‘టాక్సిక్’కు ‘ఏ’ సర్టిఫికేట్..! కంటెంట్ సంగతేంటి?
హైదరాబాద్: నూతన వధూవరులకు వైఎస్ జగన్ ఆశ్వీరాదం(ఫొటోలు)
‘ఇరుముడి’మూవీ ప్రెస్‌మీట్...బేబీ నక్షత్ర ఏం చెప్పిందో తెలుసా?
నలుపు చీరలో వితిక షేరు గ్లామర్ ఫోటోలు (ఫొటోలు)
‘ధర్మస్థల నియోజకవర్గం’ మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు)
హైదరాబాద్ : హైటెక్స్‌లో హిమ్టెక్స్ ప్రదర్శన (ఫొటోలు)
బేత్వా నదిని దాటి బడికి.. ప్రాణాలను పణంగా పెడుతున్న చిన్నారులు, వైరల్‌గా మారిన వీడియో
పగటి కలలు కనొద్దు.. రామ్ దేవ్ బాబాకు కంగనా దిమ్మదిరిగే కౌంటర్
శోకసంద్రంలో టాలీవుడ్ ప్రముఖ నటి షావుకారు జానకి (94) కన్నుమూత





