Movie topic hub

Trikala Review

Dedicated page for review updates about Trikala. Crawled stories appear below.

Review Stories

త్రికాల మూవీ రివ్యూ.. సరికొత్త మైథాలజీ డార్క్ ఫాంటసీ థ్రిల్లర్ ఎలా ఉందంటే

ప్రస్తుతం ఫ్యామిలీ డ్రామాల కంటే యాక్షన్‌, మైథాలజీ మూవీస్‌ ఎక్కువగా ఆడుతున్నాయి. అలాంటి వాటికే ఆడియెన్స్ ప్రయారిటీ ఇస్తున్నారు. చూసేందుకు ఇష్టపడుతున్నారు. లార్జర్‌ దెన్‌ లైఫ్ మూవీస్‌ ట్రెండ్ నడుస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే చాలా సినిమాలు ఈ జోనర్‌ లో వస్తున్నాయి. అందులో భాగంగా ఇప్పుడు `త్రికాల` అనే వచ్చింది. కొత్త తరహా మైథలాజికల్ డార్క్ థ్రిల్లర్‌గా తెర‌కెక్కిన‌ ఈ సినిమాకి `ఎ స్క్రిప్ట్ ఆఫ్ గాడ్` అనేది స‌బ్‌టైటిల్. దర్శకుడు మణి తెల్లగూటి తెరకెక్కించిన ఈ సినిమా కర్మ సిద్ధాంతం, పునర్జన్మ, తాంత్రిక శక్తులు, మానసిక భయం, మానవ భావోద్వేగాలను ఒకే కథలో మిళితం చేసిన విజువల్ వండ‌ర్ గా ఉందని టీజర్‌, ట్రైలర్‌ చూస్తే అర్థమవుతుంది. ఇందులో అజయ్‌, అర్జున్‌ అంబటి, శ్రద్ధా దాస్, మాస్టర్‌ మహేంద్రన్‌ వంటి వారు ప్రధాన పాత్రలు పోషించారు. చాగంటి ప్రొడ‌క్ష‌న్ ‘త్రికాల’ సినిమాను వ‌ర‌ల్డ్ వైడ్‌గా థియేట‌ర్‌ల‌లో విడుద‌ల చేసింది. గురువారం (మే 28)న విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందనేది రివ్యూలో తెలుసుకుందాం. కొన్ని శ‌తాబ్దాల క్రితం కుమారి ఖండం అనే ఒక పౌరాణిక భూభాగంలో ఈ కథ ప్రారంభమవుతుంది. అక్కడి మునులు అత్యంత శక్తివంతమైన తాంత్రిక గ్రంథాలు, ప్రాచీన సాంకేతిక రహస్యాలను అసురుల చేతికి చిక్కకుండా రహస్య ప్రదేశంలో దాచిపెడతారు. ఆ సీక్రెట్స్‌ను కాపాడేందుకు `శక్తి యోథా` అనే దైవిక ఆయుధాన్ని సృష్టించి, దానిని వీరరాజు త్రికాల వర్మకు అప్పగిస్తారు. అసుర శక్తులపై పోరాడుతూ అతడు మరణించగా, మునులు అతని ఆత్మను ఒక మాయా అండంలో బంధిస్తారు. కలియుగంలో ప్రపంచానికి భారీ ముప్పు వచ్చినప్పుడు ఆ ఆత్మ మళ్లీ మేల్కొంటుందని వారు చెబుతారు. ప్రస్తుతం శివ (మాస్టర్ మహేంద్రన్) అనే యువకుడు

త్రికాల మూవీ రివ్యూ.. ప్రేక్షకులను మెప్పించిందా

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. భారతీయ సనాతన ధర్మంలో దాగి ఉన్న ఆధ్యాత్మిక రహస్యాల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘త్రికాల’. మైథాలిజిలక్ ఫిక్షనల్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజు ఆడియన్స్ ముందుకు వచ్చింది. శ్రద్ధాదాస్ లీడ్ రోల్లో యాక్ట్ చేయడంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ఈ రోజు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం. కథ విషయానికొస్తే.. కొన్ని శ‌తాబ్దాల క్రితం “కుమారి ఖండం” అనే ఒక పౌరాణిక భూభాగంలో నేపథ్యంలో ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. అక్కడున్న మునులు, ‌ఋషులు అందరు అత్యంత శక్తివంతమైన తాంత్రిక గ్రంథాలు రాక్షసుల చేతికి చిక్కకుండా కాకుండా ఓ రహస్య ప్రాంతంలో దాచిపెడతారు. అంతేకాదు దాన్ని కాపాడానికి ‘శక్తి ఏథా’ అనే ఓ దైవిక పరమైన ఆయుధాన్ని సృష్టిస్తారు. దాన్ని ఆ ప్రాంతాన్ని పాలించే త్రికాల వర్మ అనే రాజుకు అప్పగిస్తారు. అయితే ఆ తాంత్రిక శక్తుల కోసం అసురులు వచ్చినపుడు రాజు వారిపై పోరాడుతూ కన్నుమూస్తాడు. అయితే మునులు మాత్రం రాజు ఆత్మను ఓ అండంలో భద్రపరుస్తారు. కలియుగంలో ప్రపంచానికి పెద్ద ప్రమాదం పొంచి ఉన్నపుడు ఆ ఆత్మ మేల్కొని దుష్ట శక్తులను అంతం చేస్తుందని చెబుతారు. ఆ తర్వాత కట్ చేస్తే

Trikala Review | nimisham.in | nimisham.in