
ప్రతి ఊరిలోనూ తాగునీటి అవసరాలు తీర్చే వాటర్ ప్లాంట్లు ఉంటున్నాయి. స్థానికంగానే శుద్ధ జలం లభిస్తోందని ప్రజలంతా ఈ నీరే తాగుతారు. రోజూ తాగుతున్నా అసలు ఈ నీరు శుభ్రమైనదేనా..? ప్లాంట్ల నిర్వాహకులు తగిన ప్రమాణాలు పాటిస్తుంటారా..? అనే సందేహం ప్రతి ఒక్కరినీ వెంటాడుతుంది. ఇంట్లోనే నీటి ప్రమాణాలు తెలుసుకునే పరికరాలు ఉంటే... క్షణాల్లోనే పరీక్షించి నీటి నాణ్యతను గుర్తించొచ్చు.
మార్కెట్లో పలు రకాల మల్టీ పారామీటర్ కెమికల్ కిట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో కొన్ని రకాల లిక్విడ్లు, స్ట్రిప్స్ ఉంటాయి. వీటిద్వారా నీటి గాఢత, క్లోరిన్, నైట్రేట్లు, సల్ఫేట్ల మోతాదు, ఫ్లోరైడ్ పరిమాణం తెలుస్తుంది. దీని విలువ రూ.1500-3000 వరకు ఉంటుంది.
ఈ పరికరంతో నీటిలోని టీడీఎస్ స్థాయిని కనుక్కోవచ్చు. కాల్షియం, మెగ్నీషియం, సోడియం ఖనిజాలు ఏ స్థాయిలో ఉన్నాయో చెబుతుంది. విలువ రూ.150-400 మధ్య ఉంటుంది.
ఇది మార్కెట్లో రూ.350 నుంచి రూ.1000 ధరకు లభిస్తుంది. నీటి పీహెచ్ విలువను ఈ పరికరంతో గుర్తించవచ్చు. పీహెచ్ విలువ 6.5 కన్నా తక్కువుంటే ఆ నీరు తాగటం ఆరోగ్యానికి హానికరం.
ఈ పరికరం నీటి రంగులో మార్పు ఆధారంగా క్లోరిన్, ఫ్లోరైడ్, ఐరన్, నైట్రేట్ల స్థాయులను డిజిటల్ తెరపై చూపిస్తుంది. ధర రూ.1,800-4,500 మధ్య ఉంటుంది.
ఆర్వో ప్లాంట్లలో పైపులు, ట్యాంకులు శుభ్రంగా లేకుంటే నీటిలో బ్యాక్టీరియా (ఈ-కోలి వంటి) చేరే అవకాశం ఉంది. ఈ కిట్‌లోని చిన్న బాటిల్లో నీరు పోసి 24-48 గంటలు ఉంచాలి. ఒకవేళ బ్యాక్టీరియా ఉంటే రంగు మారుతుంది. దీని ధర రూ.500-1500 మధ్య ఉంటుంది.
తాగునీటిలో టర్బిడిటీ స్థాయులు 1 ఎన్టీయూ కంటే తక్కువగా ఉండాలి. ఆర్వో ప్లాంట్లలోని నీరు శుభ్రంగానే కనిపించినప్పటికీ మట్టి, ఇసుక, సూక్ష్మ కణాలుంటాయి. ఈ పరికరం ద్వారా నీటిలోని టర్బిడిటీ స్థాయిని గుర్తించవచ్చు. దీని విలువ రూ.4-12వేల వరకు ఉంటుంది.
ఆర్వో ప్లాంట్లలో పాత పైపులు, ట్యాంకుల వల్ల నీటిలో సీసం, ఆర్సెనిక్, క్రోమియం, పాదరసం లాంటి ప్రమాదకర భార లోహాలు చేరే అవకాశం ఉంది. ఈ లోహాలు నీటిలో స్వల్ప మోతాదులో ఉన్నా క్షణాల్లోనే ఈ కిట్‌తో గుర్తించవచ్చు. దీని ధర రూ.1500-3500 వరకు ఉంటుంది.
ఆన్లైన్లో అందుబాటులో ఉన్న పరికరాల్లో ఫలితాలు కచ్చితంగానే వస్తున్నాయి. ఇంట్లో డిజిటల్ టీడీఎస్ మీటర్, పీహెచ్ టెస్టర్, హోం వాటర్ టెస్టింగ్ కిట్ లాంటి పరికరాలు ఉండాలి. నీటిని పరీక్షించే విధానం కొనుగోలు చేసిన పరికరానికి అనుబంధంగా ఉంటుంది.
ప్రసాద్, గ్రామీణ నీటి సరఫరా శాఖ ఎస్ఈ, ఎన్టీఆర్ జిల్లా
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





