
Yashasvi Jaiswal Run Out: క్రికెట్ మైదానంలో ఊహించని నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. సింగిల్ తీసే క్రమంలో బౌలర్‌ను ఢీకొని యశస్వి జైస్వాల్ కిందపడిపోవడం, కేఎల్ రాహుల్‌తో సమన్వయ లోపం వెరసి అనూహ్యంగా వికెట్ సమర్పించుకోవాల్సి వచ్చింది. కీపర్ డిక్వెల్లా సంకోచించినా శ్రీలంక కెప్టెన్ నైతికత పక్కనపెట్టి వ్యవహరించిన తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఇన్నింగ్స్ 11వ ఓవర్లో కేశర నువంత బౌలింగ్‌లో కేఎల్ రాహుల్ బంతిని మిడ్-ఆన్ దిశగా ఆడాడు. సులువైన సింగిల్ కోసం రాహుల్ వెంటనే పరుగు ప్రారంభించాడు. అదే సమయంలో బంతిని ఆపే క్రమంలో బౌలర్ నువంత కుడివైపునకు డైవ్ చేయగా, నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న జైస్వాల్‌కు అడ్డుపడ్డాడు. బ్యాలెన్స్ తప్పిన జైస్వాల్ నేరుగా పిచ్‌పై కిందపడిపోయాడు. అప్పటికే రాహుల్ సగం క్రీజు దాటేయడంతో అసలు హైడ్రామా మొదలైంది.
కిందపడిన జైస్వాల్ వెంటనే లేచి పరుగు కోసం ముందుకు అడుగు వేసి పచ్చజెండా ఊపాడు. అప్పటికే ఆగిపోయిన రాహుల్ ఆ సైగ చూసి మళ్లీ క్రీజులోకి పరుగెత్తాడు. సరిగ్గా అదే క్షణంలో జైస్వాల్ వెనక్కి తగ్గి బౌలర్ ఎండ్‌కు చేరుకునే ప్రయత్నం చేశాడు. ఇద్దరూ ఒకే ఎండ్‌కు చేరుకోగా, రాహుల్ ముందుగా క్రీజులో బ్యాట్ పెట్టడంతో జైస్వాల్ రనౌట్‌గా పెవిలియన్ చేరాల్సి వచ్చింది.
ఎక్కువమంది చదివినది: 41 సిక్సర్లు, 39 ఫోర్లతో 487 పరుగులు.. భారీ ప్రపంచ రికార్డ్‌తో టీ20 హిస్టరీనే షేక్ చేశారుగా..!
నిరోషన్ డిక్వెల్లా తడబాటు.. కెప్టెన్ సైగతో అప్పీల్..
Jaiswal dismissed fro 32 runs. #INDvsSL #KLRahul #BCCI #Teamindia ఫీల్డర్ ప్రభాత్ జయసూర్య విసిరిన బంతిని అందుకున్న వికెట్ కీపర్ నిరోషన్ డిక్వెల్లా వెంటనే బెయిల్స్ ఎగరగొట్టలేదు. బౌలర్ డైవ్ చేయడం వల్లే జైస్వాల్ కిందపడ్డాడన్న విషయం కీపర్‌కు అర్థమైంది.
అప్పీల్ చేయాలా వద్దా అన్న సందిగ్ధంలో స్లిప్‌లో ఉన్న కెప్టెన్ ధనంజయ డి సిల్వా (డీడీఎస్) వైపు డిక్వెల్లా చూశాడు. అప్పీల్ చేయడంలో తప్పేముంది అన్నట్లుగా కెప్టెన్ డీడీఎస్ సైగ చేయడంతో డిక్వెల్లా వికెట్లను పడగొట్టాడు. శ్రీలంక కెప్టెన్ అప్పీల్ వెనక్కి తీసుకుంటాడేమో అని అంపైర్లు సైతం ఆరా తీశారు. మొత్తానికి 37 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లతో 32 పరుగులు చేసిన జైస్వాల్ తీవ్ర నిరాశతో మైదానాన్ని వీడాడు.
ఎక్కువమంది చదివినది: IND vs ENG: ప్రపంచ రికార్డ్‌తో వైభవ్ బీభత్సం గుర్తుందా.. బుడ్డోడి ఊచకోతకు బలైన ఇంగ్లాండ్..!
— follow Wade (@7th_umpire_) August 15, 2026 గత ఏడాది నుంచి చూసుకుంటే టెస్ట్ ఫార్మాట్లో యశస్వి జైస్వాల్ ఇలా దురదృష్టవశాత్తూ రనౌట్ కావడం ఇది మూడోసారి. గత ఏడాది ఢిల్లీ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 175 పరుగుల భారీ స్కోర్ వద్ద ఇలాగే రనౌట్‌గా వెనుతిరిగాడు.
2024 ఆరంభంలో మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లోనూ 82 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రనౌట్ బారిన పడ్డాడు. భారీ స్కోర్ల దిశగా దూసుకుపోతున్న ప్రతిసారీ క్రీజులో చిన్నపాటి సమన్వయ లోపం అతడి అద్భుతమైన ఇన్నింగ్స్‌లకు బ్రేకులు వేస్తోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





