
ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ, ప్రపంచ ఛాంపియన్ అర్జెంటీనా జట్టును కేరళకు తీసుకువచ్చే ప్రయత్నం విఫలం కావడంపై తీవ్ర వివాదం రాజుకుంది. గత వామపక్ష ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ వ్యవహారంపై నియమించిన విచారణ కమిటీ తన నివేదికను ప్రస్తుత వి.డి. సతీశన్ ప్రభుత్వానికి సమర్పించింది. ఇందులో తీవ్రమైన ఆర్థిక అవకతవకలు జరిగినట్టు తేలడంతో ప్రభుత్వం తదుపరి చర్యలకు సిద్ధమవుతోంది. రేపు జరగనున్న కేబినెట్ సమావేశంలో దీనిపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.క్రీడల శాఖ ప్రత్యేక కార్యదర్శి ఎన్. ప్రశాంత్ నేతృత్వంలో జరిగిన ఈ విచారణలో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అర్జెంటీనా మ్యాచ్ కోసం స్పాన్సర్‌ను ఎంపిక చేసిన విధానం, ఆర్థిక లావాదేవీలు, కొచ్చిలోని జవహర్లాల్ నెహ్రూ అంతర్జాతీయ స్టేడియం అప్పగింత వంటి అంశాల్లో ప్రభుత్వ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించినట్టు నివేదిక స్పష్టం చేసింది. ఒక నిర్దిష్ట కంపెనీకి ప్రయోజనం చేకూర్చేందుకు ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారని కూడా నివేదికలో పేర్కొన్నారు.అసలు అర్జెంటీనా జట్టు కేరళకు వస్తుందనడానికి ఎలాంటి అధికారిక పత్రాలు, ఒప్పందాలు లేవని విచారణలో తేలడం గమనార్హం. ఫిఫా రిజిస్ట్రేషన్, ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్) అనుమతి వంటి తప్పనిసరి క్లియరెన్సులు లేకుండానే ఈ ప్రక్రియను వేగంగా ముందుకు నడిపారని నివేదిక గుర్తించింది.ఈ వ్యవహారంలో గత క్రీడల శాఖ మంత్రి వి. అబ్దురహిమాన్ పాత్రపై కమిటీ తీవ్ర ఆరోపణలు చేసింది. కీలక నిర్ణయాలన్నీ ఆయనే తీసుకున్నారని, నిబంధనలను ఏమాత్రం పట్టించుకోలేదని తెలిపింది. ఈవెంట్‌కు సంబంధించిన ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ మంత్రి కార్యాలయం
Found this helpful?
Share this story with your network










