
పులివెందుల: వైఎస్‌ఆర్‌ కడప జిల్లా పులివెందులలో సోమవారం అర్ధరాత్రి కాల్పుల కలకలం రేగింది. వినాయక విగ్రహం వద్ద పుష్పనాథ్‌రెడ్డి, విజయ్‌కుమార్‌రెడ్డి వర్గీయుల మధ్య వాగ్వాదం జరిగింది. తనను సన్మానించలేదని పుష్పనాథ్‌ను విజయ్‌ నిలదీయడంతో వాగ్వాదం జరిగి ఘర్షణకు దారి తీసింది. ఈ క్రమంలో హజ్‌ కమిటీ డైరెక్టర్‌ బాషా గన్‌మెన్‌ గాల్లోకి ఒక రౌండ్‌ కాల్పులు జరిపారు. విజయ్‌ ఇంటి వద్ద 3 వాహనాలను పుష్పనాథ్‌ వర్గీయులు ధ్వంసం చేశారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.