
పీలేరు: పీలేరుకు చెందిన ఇనుగొండ దీక్షిత జాతీయస్థాయి బాల్‌ బ్యాడ్మింటన్‌ పోటీల్లో పాల్గొనేందుకు రాష్ట్రజట్టుకు ఎంపికైంది. దీక్షిత తండ్రి హరి కువైట్‌కు వెళ్లారు. తల్లి ఉపారాణి పీలేరులోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నారు. దీక్షిత ఇటీవల మార్కాపురంలో జరిగిన అండర్‌-14 బాల్‌ బ్యాడ్మింటన్ పోటీల్లో చిత్తూరు జిల్లా తరఫున బరిలోకి దిగింది. పోటీల్లో చిత్తూరు జిల్లా జట్టు రాణించలేకపోయినా దీక్షిత మెరుగైన ప్రదర్శన కారణంగా ఆమెను ఛత్తీస్‌గఢ్‌లో జరగనున్న పోటీల్లో పాల్గొనేందుకు రాష్ట్రజట్టుకు ఎంపిక చేశారు. విద్యార్థిని తల్లి ఉషారాణి సైతం బాల్‌ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. ఆమె రెండు పర్యాయాలు జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనడం విశేషం. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
