
హైదరాబాద్లోని మూసీ నది తీరాన వెలిసిన 400 ఏళ్ల నాటి శ్రీ నదీ నాథ్ గణపతి ఆలయంలోని వినాయకుడి విగ్రహం రోజుకు కొంత చొప్పున ఎత్తు పెరుగుతుందని చెబుతారు. ఈ వినాయకుడిని చేరుకోవడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. ప్రతి బుధవారం ఈ ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. 400 ఏళ్ల క్రితం ఈ విగ్రహం ఒక అడుగున్నర ఎత్తు మాత్రమే ఉండేదని చెబుతారు. ప్రస్తుతం ఈ విగ్రహం ఐదున్నర అడుగుల ఎత్తు ఉంటుంది.





