
కొలంబియాకు చెందిన మిరియమ్ (67) అనే మహిళకు చిన్నప్పటి నుంచీ గాసిప్స్ వినడమంటే మహా ఆసక్తి. చివరికి దీనినే ఉపాధిగా ఎంచుకుందట. ఇరుగుపొరుగు వారు మాట్లాడుకునే మాటలు వింటూ వాటిలో కొన్ని రహస్యాలను అవసరమైన వారికి చేరవేస్తూ డబ్బు సంపాదిస్తోందట. కొలంబియాకు చెందిన మిరియమ్ (67) అనే మహిళకు చిన్నప్పటి నుంచీ గాసిప్స్ వినడమంటే మహా ఆసక్తి. చివరికి దీనినే ఉపాధిగా ఎంచుకుందట. ఇరుగుపొరుగు వారు మాట్లాడుకునే మాటలు వింటూ వాటిలో కొన్ని రహస్యాలను అవసరమైన వారికి చేరవేస్తూ డబ్బు సంపాదిస్తోందట. అలా రెండు ఇళ్లు కూడా కొనుక్కుందట. ఈ నేపథ్యంలో మిరియమ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.. గాసిప్స్ అంటే విపరీతమైన మక్కువ ఉన్న మిరియమ్‌.. తనను తాను ప్రొఫెషనల్ ‘చిస్‌మోసా’ (chismosa)గా చెప్పుకుంటుంది. స్పానిష్‌లో ‘చిస్మోసా’ అంటే గాసిప్ అని అర్థమట. ‘నాకు గాసిప్స్ అంటే చాలా ఇష్టం. అందుకే ఏ ఇద్దరు మాట్లాడుకుంటున్నా చెవులు రిక్కించి వింటుంటా. అది ఎంతలా అంటే నేను ఎదుటి వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు కూడా మరో చెవితో ఇతరులు ఏం మాట్లాడుకుంటున్నారో గమనిస్తుంటా. ప్రతిచోటా గాసిప్స్‌ ఉంటాయి. కొన్నిసార్లు ఎలాంటి గాసిప్‌ లేదంటే మనమే గాసిప్‌కు కారణమవుతుంటాం. వీటికి అంతం ఉండదు. అందుకే వీటి నుంచే ఆదాయం పొందాలనుకున్నా. ఇందుకోసం నాకంటూ కొన్ని నియమాలు పెట్టుకున్నా. ఈ క్రమంలో గాసిప్స్ సేకరించడానికి ఉదయాన్నే ఇంటికి అవతల ఒక చోట కూర్చుంటా. దారిన పోయే వారు మాట్లాడుకునే విషయాల్ని జాగ్రత్తగా వింటుంటా. ముఖ్యమైన సమాచారాన్ని మర్చిపోకుండా నోట్‌బుక్‌లో రాసుకుంటా. కొన్ని సందర్భాల్లో ఇది ఆధారంగానూ ఉపయోగపడుతుంది..’ అని చెబుతోంది. ఇలా ఇతరులకు సంబంధించిన సమాచారాన్ని, రహస్యాలను పంచుకోవడం ద్వారా డబ్బు సంపాదించే మిరియమ్‌.. ఎలాంటి ఆధారం లేకుండా వాటిని విక్రయించదట. ఇలా వచ్చే మొత్తంతో రోజువారీ అవసరాలు తీర్చుకోవడమే కాకుండా కొంత మొత్తాన్ని పొదుపు చేసి, రెండు ఇళ్లు కూడా కొనుక్కుందట! ‘ఎలాంటి ఆధారం లేకుండా ఒకరి రహస్యాలను మరొకరికి చెప్పను. నా కస్టమర్లలో ఎక్కువమంది మా చుట్టుపక్కల నివసించే వారే. వారు తమకు తెలిసిన వారి జీవితాల్లో ఏం జరుగుతోందో తెలుసుకోవడానికి నా దగ్గరకు వస్తుంటారు. ప్రతిగా వారి నుంచి డబ్బులు తీసుకుంటా. కొంతమంది పెళ్లి సంబంధాల గురించి విచారించేటప్పుడు కూడా నా సహాయం తీసుకుంటారు. ఇరుగుపొరుగు వారి గురించి ఆరా తీస్తుంటారు. అలాగే మరికొంతమంది తమ సమాచారాన్ని గోప్యంగా ఉంచడానికి కూడా డబ్బులు ఇస్తుంటారు. నేను నమ్మకమైన సమాచారం ఇవ్వడం వల్లే నా దగ్గరకు వచ్చిన వాళ్లు మళ్లీ వస్తుంటారు..’ అని చెబుతుంది మిరియమ్. ఈ క్రమంలో స్థానికులు ఈమెను ‘క్వీన్ ఆఫ్ గాసిప్’ అని పిలుస్తుంటారట! .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. For Editorial Feedback eMail: For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in © 1999 - 2026 Ushodaya Enterprises Pvt.Ltd, . Powered By Margadarsi Computers This website follows the DNPA Code of Ethics . Privacy and cookie settings