
Ycp Leader Chintada Ravikumar Case 8 Places 24 Sim Cards Police Suchi 1548834
మహిళా ఎస్ఐపై అసభ్యకర ప్రవర్తన కేసులో వైసీపీ నేత చింతాడ రవి కుమార్ ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారు. ఘటన జరిగిన తొమ్మిది రోజుల తర్వాత రవి కుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
మహిళా ఎస్ఐపై అసభ్యకర ప్రవర్తన కేసులో వైసీపీ నేత చింతాడ రవి కుమార్ ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారు. ఘటన జరిగిన తొమ్మిది రోజుల తర్వాత రవి కుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
శ్రీకాకుళం, ఆగస్టు 10: మహిళా ఎస్ఐపై అసభ్యకర ప్రవర్తన కేసులో వైసీపీ నేత చింతాడ రవి కుమార్ ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారు. ఘటన జరిగిన తొమ్మిది రోజుల తర్వాత రవి కుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల శ్రీకాకుళంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా ఓ మహిళా ఎస్ఐ పట్ల రవి కుమార్ అనుచితంగా ప్రవర్తించడంతో పాటు దాడి చేశారంటూ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీంతో అరెస్ట్ భయంతో వైసీపీ నేత పరారయ్యారు. దాదాపు 9 రోజుల్లో ఎనిమిది ప్రాంతాలకు వెళ్లినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. 24 సిమ్ కార్డులు, 21 మొబైల్ ఫోన్లు ఉపయోగించినట్లు పోలీసులు చెబుతున్నారు.
విజయనగరం, బెంగళూరు, విజయవాడ, ఒడిస్సా, అరకు ప్రాంతాల్లో మకాం వేశారు. అరకు నుంచి శ్రీకాకుళంవైపు కారులో వస్తుండగా ఎచ్చెర్ల మండలం చిలకపాలెం వద్ద రవిని టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా ఎందుకు పరారయ్యారని పోలీసులు ప్రశ్నించగా.. తాను ఇంట్లోనే ఉన్నానంటూ వైసీపీ నేత సమాధానం ఇచ్చారు. అయితే పారిపోయినట్లు పోలీసులు.. వీడియోలు, సాక్ష్యాలు చూపించడంతో రవికుమార్ మౌనంగా ఉండిపోయినట్లు సమాచారం.
మిగిలిపోయిన అర్హులకూ ‘నేతన్నల సేవలో’ పథకం కింద ఆర్థిక సాయం: మంత్రి సవిత
ఈ జీవోకు, ఫార్చ్యూన్ ఇండియా కథనానికి సంబంధం లేదు: ఏపీ ప్రభుత్వం క్లారిటీ






