
ఈ సాంకేతికతకు ప్రత్యేకత ఏమిటంటే.. కేవలం చెక్క ముక్కతో నీటిని తయారు చేయడం కాదు. సహజ చెక్క నిర్మాణాన్ని ప్రత్యేకంగా మార్చి, దానిలో నీటిని ఆకర్షించే పదార్థాన్ని జోడించి ఒక హైబ్రిడ్ వ్యవస్థను రూపొందించారు. దీనికి సౌరశక్తిని నిల్వ చేసుకునే మరో పొరను జత చేయడంతో పగటి సమయంలో మాత్రమే కాకుండా తక్కువ వెలుతురు ఉన్న సమయంలోనూ నీటిని విడుదల చేయడానికి వీలైంది. బయట నిర్వహించిన పరీక్షల్లో ఈ వ్యవస్థ రోజుకు ఒక కిలో సోర్బెంట్కు గరిష్ఠంగా 1.72 లీటర్ల వరకు మంచినీటిని ఉత్పత్తి చేసింది.