
గురుగ్రామ్, సెప్టెంబర్ 14: ఆదివారం ఆమె తన బైకర్ గ్రూప్ సభ్యులతో కలిసి గురుగ్రామ్‌లోని గోల్ఫ్ కోర్స్ రోడ్‌పై వెళ్తున్నారు. ఈ సమయంలో ఓ మారుతి సుజుకి సియాజ్ కారు ఆమె బైక్‌ను వెంబడించింది. కారులో ఉన్నవారు దూకుడుగా ప్రవర్తించడంతో పాటు, మద్యం సేవించినట్లు కనిపించారని సియా ఆరోపించింది. కారు తమకు కొంత దూరం డిస్టెన్స్ పాటించాలని తాను సూచించినప్పటికీ.. వారు బైక్‌ను ఆపాలని కోరినట్లు సియా చెప్పింది. దీంతో తాను ముందుకు వెళ్తూనే ఉండగా, వెనుక వస్తున్న తన స్నేహితుడు కారును అడ్డుకునేందుకు ప్రయత్నించాడని, కారు తనను వెంబడించడం కొనసాగించిందని వాపోయింది.





