
బుట్టాయగూడెం: టీషర్ట్, గళ్ల లుంగీ, ముఖానికి మాస్క్ ధరించి అతి సామాన్యుడిలా మారువేషంలో బుట్టాయగూడెం తహసీల్దారు కార్యాలయాన్ని గురువారం సందర్శించి, సిబ్బంది పనితీరును తనిఖీ చేశారు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. కార్యాలయపు ఆవరణ, పలు విభాగాల గుమ్మాల వద్ద నిలబడి వివిధ పనుల కోసం వచ్చిన వారికి సిబ్బంది అందిస్తున్న సేవల తీరును గమనించి మండిపడ్డారు. ఉదయం 11.30 గంటల నుంచి సుమారు గంట పాటు ఆయన ఇక్కడ ఉన్నారు. ఆయనను ఎవరూ గుర్తు పట్టలేనంతగా మారు వేషంలో వచ్చారు. బుట్టాయగూడేనికి చెందిన మాధవరావు అనే విశ్రాంత ఉపాధ్యాయుడు తనకు చెందిన స్థల వివాదం పరిష్కారం కోసం కార్యాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నానని ఆవేదన వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే ఇటువంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని సిబ్బందిని హెచ్చరించారు. చిత్తశుద్ధితో సేవలు అందించాలని ఆదేశించారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.