
22ఏ భూముల సమస్యలకు పరిష్కారం మొగల్తూరులో నిషేధిత జాబితా నుంచి తొలగించిన ప్రాంతం ఈనాడు డిజిటల్, భీమవరం, నరసాపురం, న్యూస్‌టుడే: గత వైకాపా ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో రెవెన్యూ రికార్డుల్లో పట్టాభూములుగా నమోదై క్రయవిక్రయాలు జరిగిన భూములను సైతం 22ఏలో చేర్చింది. పట్టాదారు పాస్‌ పుస్తకాలున్నా ఆన్‌లైన్‌లో మాత్రం నిషేధిత జాబితాలో చూపించడంతో వైద్యం, పిల్లల విద్య, వివాహ, ఇతర అవసరాలకు క్రయవిక్రయాలు చేసే వీల్లేక రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు. భూ సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టిన కూటమి ప్రభుత్వం 22ఏ భూముల పరిష్కార బాధ్యతలను ఆర్డీవోలకు బదలాయిస్తూ మరింత సరళతరం చేసింది. 22ఏ భూముల పరిష్కారానికి ఉమ్మడి జిల్లాలోనే శ్రీకారం చుట్టారు. గతేడాది ఏలూరులో మేళా నిర్వహించి అర్జీలు స్వీకరించారు. మొత్తంగా 290 వినతులకు 74 ఎకరాలకు విముక్తి కల్పించారు. కలిదిండి మండలంలో ఇబ్బందులు పడుతున్న మాజీ సైనిక కుటుంబాలకు చెందిన 1,700 ఎకరాలకు గాను 1,548 ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగించారు. పశ్చిమలో 254 కేసుల పరిష్కారం ద్వారా 563.65 ఎకరాలు నిషేధిత జాబితా నుంచి బయటపడ్డాయి. మాజీ సైనికులు, స్వాతంత్య్ర సమరయోధులకు కేటాయించినవి, 1954 కంటే ముందు జరిగిన అసైన్‌మెంట్లు, రాజకీయ ప్రేరేపితంగా మార్చిన భూములు, కొందరు రైతుల ప్రైవేటు పట్టా భూములు, కొంత విస్తీర్ణమే 22ఏ కింద ఉన్నవి.. మొత్తం సర్వే నంబరు పెట్టేసినవి, రెవెన్యూ రికార్డుల్లో పట్టా నమోదై క్రయవిక్రయాలు జరిగినవి సైతం 22ఏలో చేర్చినవి, పట్టాదారు పాస్‌ పుస్తకాలున్నా ఆన్‌లైన్‌లో నిషేధిత జాబితాలో చూపిన వాటికి మోక్షం కలగనుంది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




