
అమరావతి: ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నట్లు ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. తేమ లేమి సమస్యతో ఇబ్బంది పడుతున్న ప్రతి పంటను కాపాడాలన్నారు. అందుబాటులో ఉన్న ప్రతి నీటి వనరునూ వినియోగించాలని, రైతులకు అండగా క్షేత్రస్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. రాష్ట్రంలోని 284 మండలాల్లో పంటల పరిస్థితిపై నిరంతర పర్యవేక్షణ ఉందని చెప్పారు. ‘‘రాష్ట్రంలోని 2.44 లక్షల హెక్టార్లలో పంటలపై ఎల్‌నినో ప్రభావం ఉంది. రక్షణ చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాం. పంట ఆరోగ్య వివరాల నమోదులో పెండింగ్‌ను వేగంగా పూర్తి చేయాలి. ప్రత్యామ్నాయ, తక్కువ నీరు అవసరమయ్యే పంటలను పెద్దఎత్తున ప్రోత్సహించాలి. వ్యవసాయ, జలవనరుల శాఖలు సమన్వయంతో పని చేయాలి’’ అని అధికారులకు దిశానిర్దేశం చేశారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. వరుస సెలవుల నేపథ్యంలో మార్కాపురం (Markapuram) జిల్లా దోర్నాల మండలంలోని పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు (Veligonda project)కు సందర్శకుల తాకిడి పెరిగింది. అల్పపీడన ప్రభావంతో అల్లూరి జిల్లాలో రెండు రోజులుగా భారీ వర్షాలు (Rains) కురుస్తున్నాయి. వినాయక చవితి (Ganesh Chaturthi) వేళ తూర్పుగోదావరి జిల్లా కడియంలోని మురుగన్‌ నర్సరీలో వినూత్నంగా వృక్ష గణపతిని తయారు చేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు (Rains) తూర్పుగోదావరి జిల్లాలోని నిడదవోలు బస్టాండ్ జలమయమైంది.






