
సాగర్‌నగర్ : విశాఖ జిల్లా సాగర్ నగర్ బీచ్, రుషికొండ ఐటీ హిల్స్ తీర ప్రాంతాల్లో వినాయక నిమజ్జనానికి జీవీఎంసీ, పోలీసు యంత్రాంగాలు సంయుక్తంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాయి. సోమవారం సాయంత్రం నుంచి విగ్రహాల నిమజ్జనానికి భక్తులు భారీగా తరలిరానున్న నేపథ్యంలో భద్రత కోసం తీరం వద్ద లైఫ్ గార్డులు, ప్రత్యేక సిబ్బంది మోహరించారు. ప్రమాదాల నివారణలో భాగంగా భక్తులను సముద్రం లోపలికి అనుమతించకుండా.. వారి వద్ద నుంచి విగ్రహాలను తీసుకుని సిబ్బందే స్వయంగా నిమజ్జనం చేయనున్నారు. అలాగే పర్యావరణ పరిరక్షణలో భాగంగా, పూజా సామగ్రి సముద్రంలో కలవకుండా ఉండేందుకు జీవీఎంసీ కార్మికులు ప్రత్యేకంగా డంపర్‌ బిన్లను సిద్ధం చేశారు. ఆరిలోవ, పీఎం పాలెం పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





