
జీవీఎంసీపై లోక్‌అదాలత్‌లో ఆగ్రహం ఈ ఇంటికే వాణిజ్య పన్ను వేసింది.. సింధియా, న్యూస్‌టుడే : దుకాణాలకు విధించాల్సిన పన్నును ఇంటికి వెయ్యడంపై జీవీఎంసీపై లోక్‌అదాలత్‌లో న్యాయాధికారి ఆగ్రహం వ్యక్తంచేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. పారిశ్రామిక ప్రాంతం పిలకవానిపాలెంకు చెందిన జి.అప్పారావుకు ఎప్పుడూ రూ. వెయ్యికి మించి పన్ను రాదు. అయితే సెప్టెంబరు 30లోగా రూ.23,024 పన్ను చెల్లించాలని జీవీఎంసీ ఆయనకు నోటీసు ఇచ్చింది. కింద ఒక ఫ్లోరు, పైన మరో ఫ్లోరు.. దుకాణాలకు వినియోగిస్తున్నట్లు అందులో పేర్కొంది. దీంతో తనకు దుకాణాలు ఎక్కడున్నాయంటూ? అప్పారావు రెవెన్యూ, సచివాలయ అధికారులను కలిసినా ప్రయోజనం లేకపోయింది. దీంతో సమస్యను జిల్లా న్యాయసేవా కేంద్రం పరిధిలోకి తీసుకెళ్లారు. ఈనెల 12న జరిగిన లోక్‌ అదాలత్‌లో న్యాయాధికారి బాధ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలన జరపకుండా ఎలా పన్ను విధిస్తారని ప్రశ్నించి.. తక్షణం సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





