
ఆనందపురం: వినాయక చవితి పండగ నేపథ్యంలో ఆనందపురం మార్కెట్‌లో పూజా సామగ్రి, పూలు, పండ్ల ధరలు భారీగా పెరిగాయి. ఉత్తరాంధ్రలో పూల మార్కెట్‌కు ప్రసిద్ధి చెందిన ఆనందపురం మార్కెట్‌లో పూల ధరలు మూడు రెట్లు పెరిగాయని వినియోగదారులు వాపోతున్నారు. మొన్నటి వరకు శ్రావణమాసం పేరుతో ధరలు పెంచిన వ్యాపారులు.. ప్రస్తుతం వినాయక చవితి సందర్భంగా మరోసారి ధరలు పెంచారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొబ్బరికాయ రూ.50 నుంచి రూ.80 పెరిగిందని, ఇతర పూజా సామగ్రి ధరలు కూడా పెరిగాయని చెబుతున్నారు. పండగ సందర్భంగా తప్పనిసరిగా కొనుగోలు చేయాల్సి రావడంతో వ్యాపారులు చెప్పిన ధరలకు కొనక తప్పడం లేదని వాపోయారు. ధరల పెరుగుదలను నియంత్రించాల్సిన వేములవలస పంచాయతీ అధికారులు మార్కెట్‌లో సరైన పర్యవేక్షణ చేయడం లేదని ఆరోపించారు. అధికారులు స్పందించి మార్కెట్‌లో క్రయవిక్రయాలను తనిఖీ చేసి, అధిక ధరలకు విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





