
తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి సందడి నెలకొంది. ఆదివారం సెలవుదినం కావడం.. సోమవారం పండగ నేపథ్యంలో మార్కెట్లకు జనాలు పోటెత్తారు. గణేశుడి ప్రతిమలు, పూజాసామగ్రి కొనుగోలు చేయడానికి పోటీపడ్డారు. విగ్రహాలను కొనుగోలు చేసి పలువురు వాహనాల్లో వారి ప్రాంతాలకు తీసుకెళ్లారు. ఇక మార్కెట్లలో భిన్న రూపాల్లో రూపుదిద్దుకున్న గణనాథులు చూపరులను ఆకట్టుకున్నాయి.





