
Vijay – Trisha: నటుడిగా వెండితెరను ఏలి, ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రిగా పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత విజయ్ వ్యక్తిగత జీవితంపై ప్రతిపక్షాలు, నెటిజన్లు నిరంతరం నిఘా ఉంచుతూనే ఉన్నారు. అయితే తాజాగా లండన్‌లోని రేసింగ్ సర్క్యూట్ వేదికగా విజయ్, త్రిష ఒకేచోట కనిపించడం, అక్కడ విజయ్ ఇచ్చిన ఒకే ఒక్క రియాక్షన్ ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. సీఎం హోదాలో అధికారిక పర్యటన నిమిత్తం యూకే వెళ్లిన విజయ్.. అక్కడే కార్ రేసింగ్ ఈవెంట్లో పాల్గొంటున్న తన చిరకాల మిత్రుడు, స్టార్ హీరో అజిత్ కుమార్‌ను ప్రత్యేకంగా కలిసి విషెస్ తెలిపారు. ఇద్దరు అగ్ర హీరోలు ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న దృశ్యాలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే అసలు డ్రామా అంతా ఆ తర్వాతే స్టార్ట్ అయ్యింది. రేసింగ్ ఈవెంట్‌ను గ్యాలరీ నుంచి ప్రత్యక్షంగా వీక్షిస్తూ నిలబడిన సీఎం విజయ్ పక్కకి అనూహ్యంగా నటి త్రిష వచ్చి చేరారు. అంతవరకు సరదాగా ఉన్న విజయ్.. త్రిష ఫ్రేమ్‌లోకి రాగానే కొంచెం అసౌకర్యానికి గురైనట్లు కనిపించారు. కెమెరా లెన్స్‌లు తమపైనే ఉన్నాయని గమనించిన దళపతి.. తన ముఖం వీడియోలో పడకుండా వెంటనే పక్కకు తిప్పుకుని అక్కడి నుంచి తప్పుకునే ప్రయత్నం చేయడం కెమెరాల్లో స్పష్టంగా రికార్డైంది. ఈ కొద్ది సెకన్ల విజువల్స్ బయటకు రావడమే ఆలస్యం.. సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించాయి. గత కొన్నేళ్లుగా విజయ్, త్రిష రహస్యంగా డేటింగ్లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో లెక్కలేనన్ని కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. బ్లాక్‌బస్టర్ హిట్ ‘లియో’ తర్వాత ఈ ప్రచారం మరింత ఊపందుకుంది. మార్చి 2026లో చెన్నైలో జరిగిన ప్రముఖ నిర్మాత కల్పాతి ఎస్. సురేష్ కుమారుడి వివాహ రిసెప్షన్‌కు సైతం వీరిద్దరూ కలిసి హాజరుకావడం తీవ్ర చర్చకు దారితీసింది. రాజకీయ ప్రత్యర్థులు సైతం శాసనసభ వేదికగా, బహిరంగ సభల్లో త్రిష పేరును పరోక్షంగా ప్రస్తావిస్తూ విజయ్ను టార్గెట్ చేసిన సందర్భాలూ ఉన్నాయి. ఇంతటి సున్నితమైన రాజకీయ నేపథ్యం ఉన్న తరుణంలో.. యూకే టూర్లో స్వయంగా ముఖ్యమంత్రే కెమెరాల నుంచి తప్పించుకోవడానికి మొహం చాటేసినట్లు కనిపించడం ఇప్పుడు విమర్శకులకు మరింత ఆజ్యం పోసినట్లయింది. కేవలం యాదృచ్ఛికంగా జరిగిన ఘటనే అయినా.. సీఎం విజయ్ బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే ఆయన ఏదో దాచేందుకు ప్రయత్నించారా? లేక అనవసర వివాదాల నుంచి దూరంగా ఉండాలనే ఉద్దేశంతోనే అలా తప్పుకున్నారా? అన్న ప్రశ్నలు నెటిజన్లలో జోరుగా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా, యూకే రేసింగ్ ఈవెంట్లో విజయ్-త్రిషల తాజా మూమెంట్‌తో కోలీవుడ్ నుంచి పొలిటికల్ సర్కిల్స్ వరకు మరోసారి తీవ్ర ప్రకంపనలు మొదలయ్యాయి. Thalapathy Vijay didn't expected her entry ? He looks UNCOMFORTABLE right after the moment trisha entered the frame 👀 #Thalapathy #Vijay #Ajithkumar #TVK pic.twitter.com/2lDJpW5hnP — Gokul (@ItzGokulVJ) September 12, 2026