
ఇంటర్నెట్‌ డెస్క్: లండన్‌లోని ‘సిల్వర్‌స్టోన్‌ సర్క్యూట్‌’లో జరిగిన ‘మిచెలిన్‌ లే మాన్స్‌ కప్‌’ కార్‌ రేస్‌ సందర్భంగా సీఎం విజయ్‌, అగ్రకథానాయకుడు అజిత్‌ (Ajith) కలుసుకున్న విషయం తెలిసిందే. ఈ రేస్‌ అనంతరం ఒకరికొకరు ప్రత్యేకంగా కానుకలు ఇచ్చిపుచ్చుకున్నారు. రేసింగ్‌లో పాల్గొన్న అజిత్‌కు మద్దతుగా విజయ్‌ అక్కడకు వెళ్లి ఆయనను ఉత్సాహపరిచారు. అనంతరం అజిత్‌కు ఒక చిన్న రేసు కారు బొమ్మని విజయ్‌ ( Vijay ) బహుమతిగా అందించగా.. దానికి బదులుగా ఆయన సీఎంకు ఓ హెల్మెట్‌ను అందజేశారు. ‘నా ప్రియమైన సోదరుడు అజిత్‌కు ప్రేమతో..’ అని విజయ్‌ తన ఆటోగ్రాఫ్‌తో గిఫ్ట్‌ ఇవ్వడం అందరి దృష్టిని ఆకర్షించింది. తమిళ చిత్రసీమలో వీరిద్దరి అభిమానుల మధ్య ఎప్పుడూ పోటీ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. తాజాగా వీరిద్దరూ ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని ఎన్నో రోజులుగా వస్తోన్న విభేదాల వార్తలకు చెక్‌ పెట్టారు. ఇక నటి త్రిష, రాధికా శరత్‌కుమార్‌ కూడా లండన్‌లో అజిత్‌ను కలిసి అభినందించారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. ‘మహాశక్తి’ టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. నితీశ్‌ తివారీ దర్శకత్వంలో భారీ స్థాయిలో తెరకెక్కుతోన్న చిత్రం ‘రామాయణ’ (Ramayana).





