
విజయవాడ: రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా వివిధ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో డివిజన్లు, వార్డుల సంఖ్యను పెంచుతూ నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే కీలకమైన విజయవాడ (Vijayawada) నగర పాలక సంస్థలో డివిజన్ల సంఖ్యను గణనీయంగా పెంచింది. ఇప్పటివరకు విజయవాడ కార్పొరేషన్‌లో 64 డివిజన్లు ఉండగా, కొత్తగా మరో 22 డివిజన్లను జోడించి మొత్తం సంఖ్యను 86కు పెంచుతూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. కార్పొరేషన్ ఎన్నికల సన్నాహాల్లో భాగంగా ఈ ఏడాది మే నెలలోనే డివిజన్ల పెంపు ప్రతిపాదనలు తెరపైకి రాగా....మే 18 నుంచి 24 వరకు ప్రజలు, వివిధ వర్గాల నుంచి అభ్యంతరాలు, సూచనలను అధికారులు స్వీకరించారు. ఈ పునర్విభజన ప్రక్రియలో అత్యధిక మార్పులు విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోనే చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు తూర్పు నియోజకవర్గంలో ఉన్న 21 డివిజన్ల సంఖ్య కాస్తా 29కి చేరాయి. ప్రజల నుంచి పెద్దగా అభ్యంతరాలేవీ రాకపోవడంతో అధికారులు 86 డివిజన్ల జాబితాను అధికారికంగా ఖరారు చేశారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





