
ఆఫ్ఘనిస్థాన్‌తో తొలి టీ20లో భారత్ నెగ్గినా, 10 పరుగులకే నిష్క్రమించిన సంజు శాంసన్‌పై తీవ్ర ఒత్తిడి నెలకొంది. జింబాబ్వే సిరీస్‌లో చెలరేగిన యంగ్ గన్ వైభవ్ సూర్యవంశీ బెంచ్‌పై ఉండటంతో, సంజు స్థానానికి ముప్పు ఏర్పడింది. ఓపెనర్ అభిషేక్ శర్మ, వన్‌డౌన్ ఇషాన్ కిషన్ తుది జట్టులో స్థానాలు ఖాయం చేసుకున్నారు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సపోర్ట్ ఉన్నా, రెండో టీ20లో సంజు మెరిస్తేనే ఆసియా కప్ తుది జట్టులో చోటు దక్కుతుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.