
టాలీవుడ్లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా తనదైన మాస్ అండ్ రా ఎనర్జీతో గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్ సరికొత్త రికార్డుకు సిద్ధమయ్యారు. 'లైలా', 'ఫంకీ' నిరాశపరిచినప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా కేవలం 36 రోజుల వ్యవధిలో మూడు భిన్నమైన చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆయన స్వయంగా తెరకెక్కిస్తున్న హై-వోల్టేజ్ చిత్రం 'కల్ట్' అక్టోబర్ 30న, తరుణ్ భాస్కర్ కాంబోలో రానున్న క్రేజీ సీక్వెల్ 'ఈ నగరానికి ఏమైంది రిపీట్' నవంబర్ 19న, అలాగే పొలిటికల్ థ్రిల్లర్ 'లెగసీ' డిసెంబర్ 4న విడుదల కానున్నాయి. యాక్షన్, కామెడీ, పొలిటికల్ డ్రామాలతో రానున్న ఈ ట్రిపుల్ లైనప్ విశ్వక్కు ఎలాంటి భారీ విజయాన్ని అందిస్తుందో చూడాలి.
Tags:#x27