
TTD Employees House Sites Resolution: ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న టీటీడీ ఉద్యోగుల హౌస్ సైట్ల సమస్యకు పరిష్కారం దిశగా కీలక అడుగు పడిందని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించారని.. వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారని తెలిపారు. టీటీడీ ఉద్యోగుల సంక్షేమానికి ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. బ్రహ్మోత్సవాల తర్వాత ఉద్యోగుల ఇళ్ల స్థలాలకు సంబంధించి చర్యలు ప్రారంభిస్తామని.. ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ ప్రాజెక్ట్‌పై కూడా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు వచ్చినట్లు బీఆర్ నాయుడు తెలిపారు.