
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఉచిత ఎస్ఎస్డీ టోకెన్లను తిరుపతిలో జారీ చేస్తారనే విషయం తెలిసిందే. తర్వాతి రోజు దర్శనానికి ముందు రోజు టికెట్లను జారీ చేస్తారు. తిరుపతిలోని విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం కాంప్లెక్స్‌లో వీటిని పంపిణీ చేస్తారు. అయితే తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎస్ఎస్డీ టోకెన్ల జారీపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్ఎస్డీ టోకెన్ల జారీని రద్దు చేసింది. ఈ నెల 14వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఈ టోకెన్లను జారీ చేయరు. మొత్తం ఆరు రోజుల పాటు జారీని ఆపేయనున్నారు. తిరిగి ఈ నెల 20వ తేదీన టోకెన్ల జారీ తిరిగి ప్రారంభిస్తారు. 21వ తేదీన దర్శనానికి 20న జారీ చేయనున్నారు.
Tags:#tirumala
Found this helpful?
Share this story with your network