
రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌.. ప్రధాని మోదీ ఆర్థిక రంగ దృక్పథాన్ని ‘మోదీనామిక్స్‌’గా అభివర్ణించారు. కోల్‌కతాలో ఆయన మాట్లాడారు. మోదీ హయాంలో భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. ప్రస్తుతం మేధో శక్తిని, మానవ వనరుల్ని పూర్తి సామర్థ్యంతో వినియోగించడంతోనే ఇది సాధ్యమైందని వివరించారు. ‘‘2014కు ముందు కూడా భారతదేశంలో మేధోశక్తి, మానవ వనరులు రెండూ ఉండేవి. కానీ పూర్తి సామర్థ్యంతో పని చేయలేకపోయేవి. ఇవి పూర్తి సామర్థ్యంతో పని చేయగలిగేలా మోదీ ఒక వ్యవస్థను సృష్టించారు" అని అన్నారు.





