
పశ్చిమ రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల నుండి 2026 సెప్టెంబర్ 19 నాటికి నైరుతి రుతుపవనాలు వెనుదిరిగేందుకు పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. సముద్ర మట్టం వద్ద రుతుపవన ద్రోణి ప్రస్తుతం సౌరాష్ట్ర, పరిసర ఈశాన్య అరేబియా సముద్రం మీదుగా ఉన్న అల్పపీడన కేంద్రం, డీసా, జైపూర్, ఆగ్రా, లక్నో, గయా, సాగర్ దీవి మీదుగా ఆగ్నేయ దిశగా ఈశాన్య బంగాళాఖాతం వరకు వెళ్తోంది. ఈరోజు (2026 సెప్టెంబర్ 16) ఉదయం 08:30 గంటల సమయానికి ఉత్తర థాయ్లాండ్ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడి, సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఇది సెప్టెంబర్ 18 సాయంత్రానికి ఉత్తర అండమాన్ సముద్రంపైకి ప్రవేశించే అవకాశం ఉంది. దీని ప్రభావంతో సెప్టెంబర్ 19 సాయంత్రం నాటికి అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇది క్రమంగా బలపడి రానున్న 3-4 రోజుల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా – ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాలను చేరుకునే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ, పరిసర ప్రాంతాలలో ఉన్న ఉపరితల ఆవర్తనం, ప్రస్తుతం సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, ఆనుకుని ఉన్న రాయలసీమ ప్రాంతాలపై కొనసాగుతోంది.