
తెలంగాణలో 22ఏ నిషేధిత జాబితాలో ఉన్న నిరుపేదల ఆస్తుల వివాదాలను వేగంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. సీసీఎల్ఏ, న్యాయశాఖ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఉన్నతాధికారులతో హైపవర్ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. యూఎల్సీ భూములు, ఆమోదిత లేఅవుట్లలో ప్రభుత్వ భూములు, సింగరేణి కోల్బెల్ట్, జీవో 59, జీవో 118, అసైన్డ్ భూములు, ఇందిరమ్మ ఇళ్లు, నాలా రుసుములు, అనధికార లేఅవుట్లు, లీజ్హోల్డ్ ఆస్తులు, భూదాన్ భూములు తదితర 12 అంశాలపై ప్రభుత్వం పరిష్కార చర్యలు ప్రకటించింది.





